లైఫ్ స్టైల్టెక్నాలజీ & గాడ్జెట్లు

Smart Electric Rice Cooker : ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తో వంట చిటికెలో!

Electric Rice Cooker
Smart Electric Rice Cooker :  రైస్ మాత్రమే కాదు కర్రీస్ కూడా చిటికెలో, మహిళా  కస్టమర్ల ఆదరణే  ధ్యేయంగా కంపెనీలు  కూడా కొత్త కొత్త రకరకాల ఉత్పత్తులతో మార్కెట్లను హోరెత్తిస్తున్నాయి.

వంట గదిలో ప్రతిరోజూ వంటపని తో కుస్తీ పట్టే మహిళలకు ఊరట కలిగించేలా ఎన్నో  ఎలక్ట్రిక్ ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పుడు గతంలో పోల్చుకుంటే వంట పని సులభం అయిందని చెప్పవచ్చు, ఎప్పటికప్పుడు మహిళా  కస్టమర్ల ఆదరణే  ధ్యేయంగా కంపెనీలు  కూడా కొత్త కొత్త, రకరకాల ఉత్పత్తులతో మార్కెట్లను హోరెత్తిస్తున్నాయి.

Electric Rice Cooker

అందులోనూ వంట గదిలో పనిని చాలా సులభంగా, తొందరగా చేసుకునేలా సమయం కలిసి వచ్చేలా వంట  పూర్తి చేసుకునేలా స్మార్ట్  ఉపకరణాలు అందుబాటులోకి చాలానే వచ్చాయి, వాటిలో రైస్ కుక్కర్  ఒకటి.

ఇంతకుముందు అన్నం వండాలంటే పడిన తిప్పలు అన్నిటినీ దూరం చేసింది రైస్ కుక్కర్, బియ్యం కడిగి అందులో వేసి కావలసిన పరిమాణంలో నీటిని పోసి స్విచ్ వేస్తే ఇక  వండి పెట్టే పని అది చూసుకుంటుంది, ఇప్పుడు  రైస్ కుక్కర్ లో సరికొత్త మోడల్స్  సిద్ధం అయిపోయాయి.

వీటిలో ఆహారాన్ని సులభంగా తయారు చేయడమే కాకుండా, టైమర్ సహాయంతో వాటిని ట్రాక్ చేసే ప్రయత్నాన్ని కూడా మనం చేయగలిగేలా  ఈ కుక్కర్ లు పని చేస్తున్నాయి.

Electric Rice Cooker

ఈ కుక్కర్ (Smart Electric Rice Cooker) లో కొత్తదనం ఏమిటో?

ఈ కొత్త స్మార్ట్ రైస్ కుక్కర్  అన్నం మాత్రమే కాదు, ఓట్స్, కిచిడి, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పప్పులను వండుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, దీనిలో బంగాళాదుంపలు లేదా గుడ్లు మొదలైనవి కూడా ఉడక పెట్టవచ్చు.

సాధారణ కుక్కర్లో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేయించడం ద్వారా  ప్రెషర్ కుక్కర్ లో తయారు చేసే విధంగానే ఈ స్మార్ట్ ఎలక్ట్రిక్ కుక్కర్ లో కూడా కూరలు చేసుకోవచ్చు.

స్మార్ట్ రైస్ కుక్కర్ (Smart Electric Rice Cooker) యొక్క ఫీచర్లు :

  • ఇది శుభ్రం చేయడానికి సులభమైన లోపలి కుండ ను  కలిగి ఉంటుంది.
  • సులభంగా తీసివేసే, ఇన్స్టాల్ చేయగల సీలింగ్ రింగ్ కూడా దీనిలో ఉంటుంది.
  • కుక్కర్ లోపల ఉన్న ఆవిరిని తొలగించడానికి ఒక హ్యాండిల్  కూడా ఉంది ఇందులో , దాని ద్వారా మూత తెరవడానికి ముందు, మనం  ఆవిరిని తీసివేయడానికి ఆ హ్యాండిల్ ను తిప్పవచ్చు.
  • ఇది మైక్రోవేవ్, టైమర్, సాటే,  నెమ్మదిగా వంట చేయడం వంటి అనేక బటన్ లను  కలిగి ఉంది.
  • బియ్యం,  చేపలు, బీన్స్, సూపులు చేయడానికి కూడా దీనిలో ఎంపికలు ఉన్నాయి.
  • ఏదేమైనా,  దానిలో ఇవ్వబడిన వినియోగ మార్గదర్శిని ని చదవాలి,  అనగా గైడ్ ను  చదవాలి,  తద్వారా దాని యొక్క ప్రతి లక్షణాన్ని మనం వివరంగా తెలుసుకోవచ్చు, అలాగే మనం ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, అనే తప్పులను కూడా ఇది నివారిస్తుంది.

Electric Rice Cooker

కుక్కర్ (Smart Electric Rice Cooker) కొనే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు :

ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ లు అనేక రకాలుగా వస్తాయి, దీన్ని కొనుగోలు చేసేటప్పుడు, సరైన కుక్కర్ ను ఎంచుకోవడానికి ముందుగా కొన్నవారి రివ్యూలు చదవండి.

దీనిలో ఫీచర్లను కూడా  ఇతర వాటితో సరిపోల్చండి, ఎందుకంటే అన్ని కంపెనీలు ఒకే రకమైన ఫీచర్లను అందించవు.

ఇవి కూడా చదవండి :
స్పెషల్ ఎగ్ దమ్ బిర్యాని
ఆవుపేడతో వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా!
టాక్స్ పేయర్లకు ఊరట ఇచ్చిన ఐటీ శాఖ.. వివరాలివే
ఒక్క ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ తో 10 బ్రేక్ఫాస్ట్ లు