IPhone 13 Pro: ఐఫోన్ 13 సిరీస్ మోడల్ లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, ఐఫోన్ 13 లాంచ్ తేదీ వచ్చేసింది.
ఐఫోన్ 13 లాంచ్ తేదీ వచ్చేసింది, ఈసారి తక్కువ ధరలోనే రాబోతున్నాయి, ఆపిల్ ఐఫోన్ ల విషయానికి వస్తే వీటికి అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ అనే చెప్పుకోవాలి, కొత్త ఫోన్ వస్తుంది అంటే అది పండగ అలాగే ఉంటుంది, స్మార్ట్ ఫోన్ వినియోగదారుల దృష్టి కూడా ఐఫోన్ పైనే ఉంది.
ఆపిల్ తన తదుపరి వినూతన ఫీచర్ల తో ఐఫోన్ లను కూడా పరిచయం చేస్తుంది, ఐఫోన్ 13 సిరీస్ మోడల్ లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది, ఆపిల్ తన ఐఫోన్ 13 (IPhone 13 Pro) సిరీస్ మోడల్ లను సెప్టెంబర్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఇది ఐఫోన్ 12 సిరీస్ మాదిరి గానే నాలుగు వేరియంట్ లలో లభ్యమవుతుంది అని చెబుతున్నారు, ఐఫోన్13 సిరీస్ మునుపటి మోడల్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే ను కలిగి ఉంది, మెరుగైన కెమెరా ఫీచర్ తో సహా వివిధ ఫీచర్లు ఉన్నప్పటికీ ధర పెరగకపోవచ్చు అంటున్నారు.
భారతదేశంలో దీని ధర రూ.74,169 గా తెలుస్తోంది, ఐఫోన్ 13 ప్రో మాక్స్ (IPhone 13 Pro Max) ఖరీదైన పరికరం, దీని ధర భారతీయ కరెన్సీలో రూ.81,594.
అంతే కాకుండా ఐఫోన్ 13 (IPhone 13 Pro) లైనప్ ముందు భాగంలో కొత్త డిజైన్ కలిగి ఉంటుంది, 2021 ఐఫోన్లు మెరుగైన కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి, ఇది వీడియోలలో నేపథ్యాన్ని అస్పష్టం చేయడానికి, వీడియో పోట్రైట్ మోడ్ ను మద్దతిస్తుంది.
ఏడాది రెండవ భాగంలో 130 నుంచి 150 మిలియన్ ఐఫోన్ యూనిట్లను ఉత్పత్తి చేయడానికి ఆపిల్ సంస్థ సిద్ధమవుతోంది.
ఐఫోన్ 13 లైనప్ (IPhone 13 Pro) లేజర్ ఇమేజింగ్, ప్రిడిక్షన్ మరియు రేంజింగ్ సెన్సార్ తో కూడా రావొచ్చు, లిడార్ సెన్సార్ ఇప్పడి వరకు ఐఫోన్ 12 ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం చేయబడింది.