జాతీయం-అంతర్జాతీయంటెక్నాలజీ & గాడ్జెట్లుబిజినెస్

Olaelectric Scooter 2021: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ భళా

olaelectric
Olaelectric Scooter : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్ లో విదుదల కానుంది, స్కూటర్ అధికారికంగా మార్కెట్ లోకి రావడానికి ముందే మార్కెట్ లో ఓలా స్కూటర్ కలర్స్ అంటూ కొన్ని ఇమేజులు హల్‌చల్ చేస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనాలకు యమ డిమాండ్ పెరుగుతోంది, చాలా మంది ఇటే మొగ్గుతున్నారు, ఈ క్రమంలో నే జూలై చివరి నాటికి ఓలా ఎలక్ట్రిక్  స్కూటర్ (Olaelectric Scooter) భారత మార్కెట్ లో విదుదల కానుంది.

స్కూటర్ అధికారికంగా మార్కెట్ లోకి రావడానికి ముందే మార్కెట్ లో ఓలా స్కూటర్ కలర్స్ అంటూ కొన్ని ఇమేజులు హల్‌చల్ చేస్తున్నాయి.

ఓలా అనేక రంగులలో దేశీయ మార్కెట్ లోకి ప్రవేశిస్తుంది.కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం నలుగు, గులాబి, తెలుపు, నీలం రంగులలో ఉన్నాయి.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Olaelectric Scooter) బ్యాటరీని ఒక్క సారి చార్జ్ చేస్తే 240 కి.మీ ల దూరం వరకు ప్రయాణించవచ్చు.వేగం పెరిగే కొద్ది ప్రయాణ సమయం తగ్గుతూ ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.449 చెల్లించి ను ముందుగా బుక్ చేసుకోవచ్చు.

బుకింగ్ అమౌంట్ నామ మాత్రం గా ఉండడం కూడా అడ్వాన్స్ రిజర్వేషన్ భారీగా పెరగడానికి ఒక కారణం అయిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

olaelectric scooter

స్కూటర్ రేటు ఒక లక్ష రూపాయలు నుంచి ఒక లక్షా ఇరవై వేల వరకు ఉండవచ్చని ఊహిస్తున్నారు, ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే జిపిఎస్ నావిగేషన్ అందుబాటులో ఉంటుంది, బ్లూటూత్ ద్వారా 4జి కనెక్టివిటి సౌకర్యం ఉంది.

దేశం లో అడ్వాన్స్డ్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే లక్ష బుకింగులు వచ్చాయి, అతి పెద్ద క్లాస్ ఫుడ్ స్పేస్,యాప్ బేస్డ్ కీ లెస్ యాక్సెస్, సెగ్‌మెంట్ లీడింగ్ రేంజ్ వంటి ఫీచర్ లతో రానుంది.

యుఎల్ ప్రాజెక్ట్ హేడ్ ల్యాంప్, సింగిల్ పీస్ సీట్, ఎక్స్‌టర్నల్ చార్జింగ్ పోర్ట్, ఎల్ ఇడి (LED) డి అర్ ఎల్, ఎల్ ఇడి (LED)టై లైట్, సామానులకు తీసుకు వెళ్ళేందుకు రియర్ గ్రబ్ హ్యాండిల్స్ , బ్లాక్ కలర్ ఫ్లోర్ మ్యాట్, పూర్తిగా డిజిటల్ క్లస్టర్‌లు ఉంటాయి.

olaelectric

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Olaelectric Scooter) అనేది ఇటర్బ్ యాబ్స్ స్కూటర్ కి కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ చేసి తీసుకొచ్చిన స్కూటర్, ఓలా కంపెనీ వారు రెండు మోడల్స్ ను విడుదల చేయబోతున్నారు, ఒకటి ఓలా ఎస్1, రెండవది ఓలా ఎస్1ప్రో.

ఒలా ఎస్1 కు మినిమం 100కి.మీ టాప్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఓలా ఎస్1ప్రో కు మినిమం  టాప్ స్పీడ్ 110 కి.మీ నుండి 120కి.మీ లు ఉండొచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మోటర్ పవర్ కోసం తక్కువలో తక్కువగా 5కిలో వాట్స్ లు వాడుతుండొచ్చు అని అంచనా వేస్తున్నారు, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లో హైపర్ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ తో వస్తుందని ఓలా కంపెనీ ప్రకటించింది.

18 నిమిషాలలోనే 50% చార్జింగ్ అవుతుందని తెలిపారు.

బుకింగ్‌ కోసం క్లిక్ చేయండి : Olaelectric

ఇది కూడా చదవండి : 2 కోట్ల లైకులతో ఇన్‌స్టా లో ఫోటో రికార్డ్.