జాతీయం-అంతర్జాతీయంలైఫ్ స్టైల్

Aliens : ఏలియన్స్ దొరికేశారా? మనుషులు వర్సెస్ ఏలియన్స్

aliens
Aliens : అనంత విశ్వం లో ఎప్పుడో ఒక్కప్పుడు ఏదో ఒక చోట ఏలియన్స్ జాడ దొరుకుతుందన్న ఆశతో అనంత విశ్వం లో అంతులేని అన్వేషణ కొనసాగుతూ ఉంది, తాజా గా కొందరు సైటిస్టులు ఏలియన్స్ కు సంభందించి కీలక విషయాన్ని వెల్లడించారు.

అనంత విశ్వం లో సైన్సు కు అందని రహస్యాలు, అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవి మన ఊహలకు, అంచనాలకు ఏ మాత్రం అందవు, అలా సూపర్ పవర్ గా భావించే వాటిల్లో ఒకటి ఏలియన్స్ (Aliens).

అవి అసలు ఉన్నాయో తెలియదు గాని ఆ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఎదో ఒక ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తూ ఉంటుంది. అందుకే దశాబ్దాల అన్వేషణలో గ్రహాంతర వాసులకి సంభందించి ఏ ఒక్క ఆధారం దొరక్క పోయినా వెతుకులాట మాత్రం ఆగడం లేదు.

అనంత విశ్వం లో ఎప్పుడో ఒక్కప్పుడు ఏదో ఒక చోట ఏలియన్స్ జాడ దొరుకుతుందన్న ఆశతో అనంత విశ్వం లో అంతులేని అన్వేషణ కొనసాగుతూ ఉంది, ఈ క్రమం లోనే తాజా గా కొందరు సైటిస్టులు ఏలియన్స్ కు సంభందించి కీలక విషయాన్ని వెల్లడించారు.

aliens

ఇంతకీ సైటిస్టులు చెప్పిన ఆ ఏలియన్స్ (Aliens) ఆఫ్ ది సీక్రేట్ ఏంటి??

ఇప్పడి వరకు గ్రహాంతర వాసుల (Aliens) గురించి మన ఆలోచనలు ఒకేలా సాగాయి. వేరు గ్రహాల నుంచి గ్రహాంతర వాసులు మనల్ని కలుస్తారని , వారు మన కంటే ఎక్కువ టెక్నాలజీ తో ఉంటారని మనం అనుకుంటున్నాం. కాని కొందరు సైటిస్టులు మాత్రం మరోలా కూడా ఆలోచించాలి అంటున్నారు.

ఇతర గ్రహాల పైన ఉన్నవారు మన కోసం ఎదురు చూస్తున్నారని , మనమే అసలైన గ్రహాంతర వాసులమని అంటున్నారు.
ఇక పరిశోధకులు ఇచ్చిన స్టేట్‌మెంట్ తో మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.

ఇప్పడి వరకు ఈ భూమి పై తప్ప వేరే గ్రహాలపై మనుషులు, జంతువులు, పక్షులు, కీటకాలు ఏవీ కనిపించలేవు. కనీసం అందుకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాలు ఇప్పడి వరకు సాధించలేక పోయారు సైటిస్టులు, కాని ఎక్కడో ఒక చోట మన లాంటి వాళ్ళు ఉంటారని ఎప్పడికయిన మనం కలుస్తామని ఇప్పడికీ మనం పరిశోధనలు చేస్తూ వచ్చాము.

aliens

ఇక నేచర్ ఆస్ట్రానమీ జర్నల్ లో పరిశోధకులు లీసా కాల్టెనెగ్గర్, జాకీ ఫాహెట్టీలు  ఏలియన్స్ పై గత కొద్ది ఏళ్ళుగా చేసిన రీసర్చ్ కు సంభందించిన కీలక విషయాలు వెల్లడించారు.

పరిశోధన సమయం లో వారు కనుగొన్న కొత్త విషయాలు, అలాగే టెక్నాలజీ పరంగా మనం ఇంకా ఎంత వరకు అభివృద్ధి చెందాలన్న విషయాలు తెలిపారు.

భూమి ట్రాన్సిట్ జోన్ లో మొత్తం 1,715 నక్షత్ర వ్యవస్థలను కని పెట్టామని అన్నారు. నక్షత్రాలను భూమి నుంచి చూసేందుకు వీలవుతుందని వీటి చుట్టూ గ్రహాలు తిరిగితే వాటిని కూడా గుర్తించడానికి వీలవుతుందని చెప్పుకొచ్చారు.

ఈ నక్షత్రాల దగ్గర ఉండే గ్రహాల పై మనలా మనుషులు ఉంటే వారు మనలని చేరగలరని, అలగే భవిష్యత్తు లో మన టెక్నాలజీ పెరిగితే మనం వారిని చేరగలమని చెప్పుకొచ్చారు.

ఏదేమయినా ఈ విశ్వ కాంతి కంటే ఏదీ వేగంగా ప్రయణించలేదన్నది ఓ ఫార్ములా, కావున మనం కాంతి వేగం తో ప్రయాణించే మిషన్‌లను సిద్ధం చేసుకుంటే తప్ప వేరే గ్రహాలను చేరే పరిస్థితి లేదు.

aliens

అలాంటి టెక్నాలజీ ని మనం ఎప్పడికి రెడి చేసుకుంటాం ? ఇక అంత వేగం తో ఎలా వెళ్ళగలం? అంత వేగం తో ప్రయాణిస్తే మనలో ఎలాంటి మార్పులు వస్తాయి.? ఇలా ఎన్నో ప్రశ్నలు విశ్వం వైపు ఆశగా చూసేలా చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి : రెమ్యునరేషన్ పెంచేసిన కృతి