సినిమా

Krithi Shetty : 2వ సినిమాకే రెమ్యునరేషన్ పెంచేసిన కృతి True!

Krithi Shetty
Krithi Shetty: ఉప్పెన సినిమాతో కుర్రాళ్ళ మనసులో చెరగని ముద్ర వేసారు మంగళూర్ బ్యూటీ కృతి శెట్టి, ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తన బుట్టలో వేసేసుకోని టాలీవుడ్ లో విపరీతమయిన క్రేజ్ సంపాదించుకున్నారు.

ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూనే తన రెమ్యునరేషన్ ను నైస్ గా పెంచేసి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి (Krithi Shetty) జంటగా బుచ్చి బాబు సనా దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా ఉప్పెన.

అందమయిన ప్రేమకథ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌లో రికార్డుల కలెక్షన్‌లు రాబట్టింది, అంతే కాదు టాలీవుడ్ లో కృతి శెట్టి (Krithi Shetty) కెరీర్ కు బంగారు బాటను వేసింది.

ఇక ఈ సినిమా తరువాత నాని నటిస్తున్న శ్యాం సింగరాయ్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ సుధీర్ బాబు, ఇంద్రగంటి మోహన్‌క్రిష్ణ కాంబినేషన్‌లో ఒక సినిమా చేసేందుకు కూడా ఒకే చెప్పారు.

ఇక ఎనర్జిటిక్ హీరో రాం పోతినేని,లింగుస్వామి సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిపోయారు కృతి శెట్టి.

Krithi Shetty

ఇలా వరుస సినీమాలతో బిజీ బిజీ గా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ ను దక్కించుకున్నరని టాక్.

కింగ్ నాగార్జున హీరో గా తెరకెక్కనున్న బంగార్రాజు సినిమాలో కృతి శెట్టి కు చాన్స్ వచ్చిందట, కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య కూడా నటిస్తున్నారు, చైతు జోడిగా కృతి శెట్టి ను ఎంపిక చేసారట.

ఈ సినిమాకి గాను ఈ చిన్నది తన రెమ్యునరేషన్ ను పెంచిందని తెలుస్తుంది, నిన్నటి వరకు యాభై లక్షల వరకు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఈ సినిమా కోసం డెబ్బై అయిదు లక్షలు చార్జ్ చేస్తుంది.

ఉప్పెనంత క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి ఆ మాత్రం రెమ్యునరేషన్ పెంచడం లో తప్పే లేదంటున్నారు ఈ బ్యూటీ అభిమానులు.

Krithi Shetty

ఇది కూడా చదవండి : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్