లైఫ్ స్టైల్

Marshmallow – మార్ష్మల్లౌ ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చా

Marshmallow - మార్ష్మల్లౌ ఇంట్లో ఇంత ఈజీగా చేసుకోవచ్చా
Marshmallow : మార్ష్మల్లౌ బయట కొనాలంటే చాలా ధర ఉంటుంది తక్కువకు తక్కువ మూడు వందల నుండి నాలుగు వందలు పెట్టనిదే ఇవి మనకు దొరకవు.

అలాంటి మార్ష్మల్లౌ (Marshmallow) ను చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చదవండి. వీటిని ఇంత తేలికగా ఇంట్లో చేయడం తెలిస్తే ఇంకెప్పుడు కూడా బయట కొనరు.చాలా ఈజీగా మీరే ఇంట్లో చేసేస్తారు చిన్న చిన్న టిప్స్, కొలతలు పాటిస్తే..

కావాల్సిన పదార్థాలు:

1.పంచదార-1 టేబుల్ స్పూన్
2.కార్న్ ఫ్లోర్- ఒకటిన్నర టేబుల్ స్పూన్
3.నూనె-ఒక టీ స్పూన్
4.జిలెటిన్ పౌడర్‌- రెండు టేబుల్ స్పూన్లు
5.పంచదార-ఒక కప్పు                                                                                                                                                                                                                         6. వెనిల్ల ఎసెన్స్- పావు టీ స్పూన్

ముందుగా మిక్సీ జార్ తీసుకోని అందులో ఒక టేబుల్ స్పూన్ దాక పంచదార మరియు ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాక కార్న్ ఫ్లోర్ వేసి ఫైన్ పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి,ఇది మనకు ఐసింగ్ షుగర్ లాగా పని చేస్తుంది.

ఇది పక్కన పెట్టేసి చతురస్రాకార ట్రే ని తీసుకోవాలి, అది గ్లాస్ ఐనా పర్వాలేదు స్టీల్ ఐనా పర్వాలేదు దానికి కొంచం నూనె రాసి పైన మనం తయారు చేసి పెట్టుకున్న ఐసింగ్ షుగర్ ని కోట్ చేసి పెట్టుకోవాలి. గ్యాపులు ఏం లేకుండా మొత్తం కోట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా జిలెటిన్ వేసుకోండి. ఈ జిలెటిన్ మనకు సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ జిలెటిన్ పౌడర్‌కి 1/3 కప్ దాకా నీళ్ళని కలిపి ఉండలు లేకుండా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.

Marshmallow

ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని ఉంచి ఒక కప్పు దాకా పంచదార, పావు కప్పు దాక వాటర్ వేసి పంచదారని మీడియం మంట మీద పెట్టి కరిగించాలి, పంచదార మొత్తం కరిగాక మంటని చిన్నగా పెట్టి స్పూన్ తో కలుపుకుంటూ ఉండ పాకం వచ్చే అంత వరకు మరిగించాలి. ఇలా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి.

పాకం అనేది గోల్డెన్ రంగులోకి మారుతుంది.ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న జిలెటిన్ మిశ్రమాన్ని కలుపుకోవాలి.దీనిని చిన్న మంట మీద రెండు నిమిషాల పాటు ఉడికించాలి.

ఇలా రెండు నిమిషాల పాటు ఉడికిస్తే పైన తెల్లగా బురుగు లా వస్తుంది, దీనిని వెంటనే స్టవ్ మీదనుండి దింపి వేరే గిన్నె లోకి తీసుకోవాలి, దానిని ఒక నిమిషం పాటు స్పూన్ తో కలపాలి, ఈ మిశ్రమం చల్లారకూడదు, చల్లారితే గట్టి పడిపోతుంది, అప్పుడు మార్ష్మల్లౌను మనం చేయలేము.

కావున వేడిగ ఉన్నపుడే ఒక బీటర్ ను తీసుకోని తక్కువ స్పీడ్ లో అయిదు నిమిషాల పాటు బీట్ బాగా చేసుకొవాలి. దీనికి బీటర్ తప్పకుండా కావాలి. ఇందులోకి పావు టీ స్పూన్ వెనిల్ల ఎసెన్స్ ను కలుపుకోవాలి. తరువాత మళ్ళీ రెండు నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముందుగా మనం కోట్ చేసి పెట్టుకున్న ట్రే లోకి సగం వరకు వేయాలి.

Marshmallow

మిగిలిన సగం మిశ్రమంలో గులాబి రంగు వేసుకోవాలి.తరువాత రంగు అంతా కలిసేల మళ్ళీ బీట్ చేసుకోవాలి. తరువాత దీనిని మళ్ళి ఇంకో లేయర్ లాగా పరుచుకోవాలి, దీని పైన కూడా ఐసింగ్ షుగర్ ని చల్లుకోవాలి. తరువాత దానికి మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో రెండు గంటల పాటు ఉంచాలి. రెండు గంటల తరువాత బయటకి తీసి అంచులని నెమ్మదిగా, జాగ్రత్తగా   (Marshmallow) బయటకి తీయాలి.

తరువాత చాకు కూడా ఐసింగ్ షుగర్ ని పూసి కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి అది అంటుకోకుండా ముక్కలుగా కట్ చేయడానికి సులభంగా వస్తుంది.

అంతే ఎంతో స్పంజీగా, రుచిగా ఉండే మార్ష్మల్లౌ  (Marshmallow)  రెడీ.

ఇది కూడా చదవండి : మీ శత్రువు మీ ఫోనే- నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్