Pegasus Spyware 2021: మీ శత్రువు మీ ఫోనే- నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ (NSO )

pegasus spyware
Pegasus Spyware : ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపుతోంది. మన ప్రమేయం లేకుండానే మనం అనుమతి ఇవ్వకుండానే ఫోన్ను హ్యాక్ చేయడం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత.

ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ పెగాసెస్ ప్రపంచ వ్యాప్తంగా దుమారం లేపుతోంది. మన ప్రమేయం లేకుండానే మనం అనుమతి ఇవ్వకుండానే కెవలం ఒక్క మిస్స్డ్ కాల్ తో ఫోన్ను హ్యాక్ చేయడం పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ప్రత్యేకత. ఆ కాల్ కు స్పందించకున్నా సరే మిస్స్డ్ కాల్ వచ్చిందంటే చాలు ఫోన్ లో హ్యాకింగ్ వైరస్ చేరిపోతుంది.

కొన్ని సంధర్భాలలో వైఫై ల ద్వారా, గేమ్స్, సినిమాల యాప్ ద్వార కూడా చేరుతుంది, మాటలూ, సందేశాలూ వీడియోలు, ఫోటోలు, ఎక్కడెక్కడ తిరుతుంది కాల్ హిస్టరీ నెట్‌వర్క్ వివరాలు, డివైస్ సెట్టింగ్లు, ఈమెయిల్స్ ఇలా అన్ని కూడా ఆ నిఘా టెక్నాలజీ ని నియంత్రించే వారికి అందుబాటులోకి వచ్చేస్తాయి.

ఈ పెగాసెస్ (Pegasus Spyware) మన ఫోన్ లో చేరిందనే సంగతి గుర్తించడం కూడా చాలా కష్టం. ఆండ్రాయిడ్‌లే  కాదు అత్యంత సురక్షితం అనుకున్న ఐఫోన్ లో కూడా చేరిపోయింది. నిజానికి మొదట్లో చిన్న మెస్సేజో, మెయిలో పంపాక వాటిపై క్లిక్ చేయగానే వైరస్ చొరబడేది. ఇలాంటి సర్వ సాధారణ పద్దతినే ఈ పెగాసెస్ కూడా అనుసరించింది.

pegasus spyware

అయితే వాటిని నిరోధించే పద్దతులను ఫోన్ల కంపెనీలు సర్వీస్ ప్రొవైడర్లు కనుక్కుంటూ ఉండడం తో వారి కంటే నాలుగు అడుగులు ముందు ఉంటూ ఇలా మిస్స్డ్ కాల్ నిఘా వైరస్ ను టెక్నాలజీ ను కనుక్కుంది ఈ పెగాసెస్ తయారీ కంపెనీ ఎన్ఎస్ఓ(NSO) .

2016 లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని మానవ హక్కుల కార్యకర్త అహ్మ్మద్ మాన్సూర్ ఈ పెగాసెస్ (Pegasus Spyware) నిఘాను గుర్తించారు. తన ఐఫోన్ హ్యాక్ అయినట్టు అనుమానం వచ్చి కంపెనీ కి ఫిర్యాదు చేసారు.

దీనితో యాపిల్ దానిని సరిచేసి ఇచ్చింది. వాట్సాప్ మిస్స్డ్ కాల్ వ్యవహారం తో ఇది చాల మట్టుకు వెలుగులోకి వచ్చింది, అప్పడిదాకా తమ వాయిస్, వీడియోకాల్ ల సాంకేతికతలో ఈ లోపం ఉన్నట్లు వాట్సాప్ కూడా గుర్తించలేదు.

ఆ లోపాన్ని ఎన్ఎస్ఓ పెగాసెస్ (Pegasus Spyware) విజయవంతంగా వినియోగించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఫోన్లను లక్ష్యంగా చేసుకోని మిస్స్డ్ కాల్స్ చేసి వారి ఫోన్లలో చేరిపోయింది, దీనిపై కాలిఫోర్నియా కోర్ట్‌లో కేసును కూడా వాట్సాప్ దాఖలు చేసింది.

pegasus spyware

నిఘా వ్యవస్థలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్ లోని ఎన్ఎస్ఓ గ్రూప్ అనే సంస్థ తయారు చేసినదే ఈ పెగాసెస్. ఎన్ఎస్ఓ గ్రూప్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ, నిఘా టెక్నాలజీ దీని ప్రత్యేకత.

నేరాలు ఉగ్రవాదాన్ని కట్టడి చేయడానికి గాను ప్రపంచ వ్యాప్తంగా చాల ప్రభుత్వాలకు, చట్టబద్ధ సంస్థలకుసహాయం చేస్తుంటామని ఈ ఎన్ఎస్ఓ చెబుతుంటుంది, ఒక్కసారి పెగాసెస్ నిఘా నేత్రం ఫోన్లో చేరిందంటే దానిని ఏం చేసిన తొలగించలేరు. ఫోన్ మార్చుకోని,పాస్‌వర్డ్ లు అన్ని మార్చుకుంటే తప్ప చేసేదేం లేదు అన్నది నిపుణుల సలహా .

pegasus spyware

తెలియని నంబర్ నుండి మీకు కాల్ వస్తుంది.రిసీవ్ చేసుకున్నా,చేసుకోక పోయినా మీ స్మార్ట్ ఫోన్ హ్యాకింగ్ బారిన పడి పొయినట్టే లెక్క.

అనవసర యాప్స్ ఇన్స్టాల్స్ చేసుకున్న గాని , లింక్స్ పై క్లిక్ చేసినా మీరు కష్టాలలో పడినట్టే. ఫోన్ మాత్రమే మీతో ఉంటుంది, కంట్రోలింగ్ అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది.

ఇది కూడా చదవండి : తెలంగాణా లో పెరిగిన భూముల విలువ (జీవో)