జాతీయం-అంతర్జాతీయంలైఫ్ స్టైల్

Eruvaka Pournami 2021 : ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న- ఏరువాక పౌర్ణమి

eruvaka pournami
Eruvaka Pournami : రైతన్న ఎంతగా ఎదురు చూసే రోజు ఏరువాక పౌర్ణమి, ఎందుకంటే భూమిని నమ్ముకొని బతికే రైతు ఆ భూమాతకి శ్రద్ధగా పూజ చేసి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు ఇది.

“కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
ఏరువాక సాగాలో రన్నో చిన్నన్న
నీ కష్టం అంటా తీరునురో రన్నో చిన్నన్న”

రైతన్న ఎంతగా ఎదురు చూసే రోజు ఏరువాక పౌర్ణమి, ఎందుకంటే భూమిని నమ్ముకొని బతికే రైతు ఆ భూమాతకి శ్రద్ధగా పూజ చేసి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు ఇది.

రైతుకి ప్రకృతే దైవం, భూమే జీవనాధారం, అందుకే పొలాల్లో దుక్కి దున్నడాని చాలా గొప్పగా జరుపుకుంటాడు. గొప్పగా ఎలా అంటారా? అయితే ఇక్కడ చదవండి.

Eruvaka Pournami

ఏరువాక పౌర్ణమి (Eruvaka Pournami) రోజు రైతులు పొద్దున్నే నిదుర లేచి ఎడ్లకు శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు పసుపు, కుంకుమ కొంతమంది అయితే రంగులు కూడా పూస్తారు, అలాగే వాటికి చక్కగా గజ్జెలు, గంటలు కట్టి వాటిని కట్టేసే తాడుని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు.ఇక ఎద్దులకు కూడా భక్తి శ్రద్ధలతో బొట్టు పెట్టి పూజలు చేసి వాటికి బొబ్బట్లు తినిపిస్తారు.

అలాగే పొలాలకు వెళ్ళి భూదేవికి పూజలు చేసి పంటలు బాగా పండేలా దీవించమని ప్రార్థిస్తారు, ఎద్దులకు రంగులద్ది రకరకాల బట్టలతో అలంకరిస్తారు. మేళ తాళాలు డప్పు వాయిద్యాల నడుమ వాటిని ఊరంతా ఊరేగిస్తారు, అంటే ఓ చిన్న సైజు హోళి పండుగే కనిపిస్తుంది.

Eruvaka Pournami

అలాగే ఎద్దులు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, రోగాల బారిన పడకుండా ఉండేందుకు అధర్వణ వేదం లో చెప్పబడిన మందులను , నూనెలను తాగిస్తారు. అలాగే నాగలి తో పాటు అన్ని వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లకు పసుపు కుంకుమ రాసి పొంగళి నైవేద్యం సమర్పిస్తారు.

ఇంకో వైపు సస్యానికి ఓషధులకు అధిపతి చంద్రుడు. వర్ష ఋతువు మొదలయ్యక జ్యేష్టా నక్షత్రం లో తన నిండైన రూపంతో చందమామ కూడేది పౌర్ణమి రోజే, దేశం సుభిక్షంగా ఉండాలి అంటే కరువు కాటకాలు లేకుండా వర్షాలు సమృద్ధిగా పడి పంటలు చక్కగా పండాలి, దానికి నాంది పడేదే ఏరువాక పౌర్ణమి (Eruvaka Pournami) రోజు.

రైతే రాజు అని కీర్తించే మన దేశం లో రైతు హ్యాపీగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం.

ఇది కూడా చదవండి : భూమికి శత్రువుగా మారుతున్న జాబిల్లి