జాతీయం-అంతర్జాతీయంలైఫ్ స్టైల్

Moon: భూమికి శత్రువుగా మారుతున్న జాబిల్లి

Moon
Moon : తాజాగా నాసా శాస్త్రవేత్తల హెచ్చరికలు, ఇప్పటి వరకు చందమామ రావే, జాబిల్లి రావే అని ముద్దుగా పిలిచుకుంటున్న చంద్రుడు భూమికి శత్రువుగా మారబోతున్నాడట.

ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా కబళిస్తుందో చుస్తున్నాం, ఇలాంటి సమయం లో మరో వార్నింగ్.
ప్రపంచాన్ని షేక్ చేస్తోంది,తాజాగా నాసా శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పుడు మానవాళిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి.
ఇప్పటి వరకు చందమామ రావే, జాబిల్లి రావే అని ముద్దుగా పిలిచుకుంటున్న చంద్రుడు (Moon) భూమికి శత్రువుగా మారబోతున్నాడట.

వచ్చే దశాబ్దం లో కనీవినీ ఎరుగని విధ్వంసం కళ్ళ ముందే సాక్షాత్కరించబోతుందని నాసా శాస్త్రవేత్తలు హెచ్చరిక హెచ్చరిస్తున్నారు.

జాబిల్లి వల్ల ధరణికి పొంచి ఉన్న ముప్పు ఎంటో మీరు తెలుసుకోండి.

Moon

రాబోయే రోజుల్లో మహా ప్రళయం తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు, భారీ వర్షాలకు ఇప్పుడు నదులే ఉప్పొంగాయి కాని అప్పుడు ఏకంగా మహాసముద్రాలే విరుచుకు పడనున్నాయి , అయితే ఈ మహా ముప్పు భూవాతావరణం నుంచి కాదు, భూమికి దూరంగా ఉండే చంద్రుడి నుండి పొంచి ఉంది, చంద్రుడి వల్ల భూమి పై జల ప్రళయం తప్పదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

చంద్రుడి (Moon) వల్ల భూమిపై జల ప్రళయమా ? వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..

నాసా శాస్త్రవేత్తల పరిశోధనల సాక్షిగా ఇది నిజం. చంద్రుడి (Moon) వల్ల భూమిపై జలప్రళయం తప్పదని పక్కా ఆధారాలతో చెబుతున్నారు.

చంద్రుడు, కవుల కథల్లో చిన్నారుల హృదయాలల్లో ఎప్పటికీ చిరస్తాయిగా నిలిచి ఉంటాడు, మనిషికి చంద్రుడు దగ్గరి వాడు కాబట్టే చందమామ అని ఆప్యాయంగా పిలుచుకుంటాము, చల్లదనాల చంద్రబింబం లో ఆత్మీయతను పంచే మేనమామను చూసుకుంటాము. ఇలా శతాబ్దాలుగా మనిషి చంద్రుడికి దగ్గరవుతూనే ఉన్నాడు.

చందమామ (Moon) పై కాలు మోపడమే కాదు అక్కడ ఇల్లు కట్టుకొని చందమామ కేంద్రంగా అంతరిక్షం లోకి దూసుకు పోవాలని మానవుడి ఆకాంక్ష కాని ఇప్పుడు ఆ చంద్రుడే భూమి కి శత్రువుగా మారుతున్నాడు, భూమి పై జల విళయం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు.

Moon

చంద్రుడి భూ భ్రమణంపై నాసా శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనల్లో నిర్ఘాంత పోయే నిజాలు బయట పడ్డాయి, కక్ష్య లో చంద్రుడి చలనం వల్ల భూమిపై సముద్ర అలల్లో తీవ్ర స్థాయి అలజడి ఏర్పడుతుందని తేల్చారు. రాబోయే రోజుల్లో నెలకోసారి వరదలు ముంచెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి తో భూమి మీద సముద్ర మట్టం పెరుగుతుందని తెలుసు కాని తాజా నాసా అధ్యయనం ప్రకారం 2030 నాటికి సముద్ర మట్టంలో మార్పు కనిపించడంతో పాటు అదే వరదలకు దారి తీస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2030లో అమెరికా తీరప్రాంతం నీట మునిగి దెబ్బ తింటుందని,వచ్చే దశాబ్దంలో కనీవినీ ఎరుగని విధ్వసం కళ్ళ ఎదుట జరుగుతుందని హెచ్చరిస్తున్నారు, వర్షాకాలంలో నెలకు రెండు నుండి మూడు సార్లు వరదలు , ఆ సమయం లో సముద్రంలో రెండు అడుగుల ఎత్తులో కెరటాలు వస్తుంటాయట, అయితే 2030నాటికి వరదల సంఖ్య మూడు నుంచి నాలుగు రెట్లు
పెరగనున్నది.

Moon

ఇలా నెలకు పది నుంచి పదిహేను వరదలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటారని,వీధులు ఇళ్ళ చుట్టూ నీళ్ళు చేరి బయటకు రాలేక ఇంట్లో ఉండలేని ఇబ్బందులు వస్తాయట.

నాసా చెబుతున్న దాని ప్రకారం ఎలిప్టికల్ ఆర్బిట్‌లో చంద్రుడు దాని ధీర్ఘ వృత్తాకార కక్ష్యలో ఉన్నప్పుడు వేగం మారుతూ ఉంటుంది. దీనితో లైట్ సైడ్ విభిన్నమయిన యాంగిల్ లోకి వెల్లిపోతుంది , దానినే చలనం అంటారు. సాధారణంగా చంద్రుడిని చూస్తే ఇది కనిపించదు.

చంద్రుడు కక్ష్య పూర్తి చేయడానికి పట్టే 18.6 సంవత్సరాల్లో సగం సమయం భూమి ఆటుపోట్లు అదుపులో ఉండిపోతాయి. హై టైడ్స్ సాధారణం కంటే తక్కువగానూ,హై టైడ్స్ సాధారణం కంటే ఎక్కువగా మారిపోతాయి. మిగిలిన సగం సమయం లో టైడ్స్ పరిస్థితి తారు మారు అవుతూ ఉంటుంది.

Moon

చంద్రుడిలో చలనం ఎప్పుడూ ఉంటుంది.అయితే భూమి మీద వరదలు వచ్చే అంత ప్రభావం ఎందుకు అనేదే ఇక్కడ ప్రశ్న.
దానికి సమాధానం గ్లోబల్ వామింగ్ అని అంటున్నారు శాస్త్రవేత్తలు, చంద్రుడి చలనం భూతాపం కలిస్తేనే భూమిపై వరదలు ముంచెత్తుతాయని చెబుతున్నారు. అందుకే పెరుగుతున్న భూతాపం మానవ జాతిని కబళించే రోజు ఎంతో దూరంలో లేదంటూ అత్యంత తీవ్రమయిన హెచ్చరికలు జారి చేస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఇది కూడా చదవండి : ప్రేక్షకుల మనసు గెలుచుకున్న నారప్ప