Narappa : హీరో విక్టరీ వెంకటేష్ తాజా గా హీరోగా నటించిన సినిమా నారప్ప, ఇది తమిళ్ లో అసురన్ పేరుతో సూపర్ హిట్ కొట్టింది, దానికి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైం లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీస్ అయిన ఈ చిత్రం ఎలా ఉంది, కరోనా కారణంగా ఒటిటి (OTT) కి మారిన నారప్ప ప్రేక్షకుల మనసును గెలుచుకున్నారా? తమిళ్ ధనుష్ ని మరిపించారా? ఇవన్ని తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే అనంతపురం జిల్లా లోని ఓ గ్రామం లో హాయిగా జీవితం సాగిస్తుంటారు నారప్ప అలియాస్ వెంకటేష్, సుందరమ్మ అలియాస్ ప్రియమణి , అయితే నారప్ప ముగ్గురు పిల్లలతో హ్యాపీ గా జీవిస్తుంటాడు, ఆ ఊరి పెద్ద పండుస్వామి అలియాస్ నరేన్ తన తమ్ముడి కోసం ఊరిలో ఉన్న పేదల భూములను తీసుకుంటూ ఉంటాడు.
అయితే నారప్ప (Narappa) మాత్రం తన భూమిని ఇవ్వడు, ఈ క్రమంలో నారప్ప పెద్ద కొడుకు మునికన్నా అలియాస్ కార్తిక్‌రత్నం పండుస్వామి తో గొడవ పడి అతన్ని అవమానిస్తాడు, దానితో పండు స్వామి మునికన్నా ను దారుణంగా హత్య చేయిస్తాడు.
అన్నను చంపారన్న కోపం తో నారప్ప (Narappa) చిన్న కొడుకు సిన్నబ్బ అలియాస్ రాఖి పండు స్వామి ని హత్య చేస్తాడు, ఆ తరువాత నారప్ప కుటుంబం ను హత్య చేయాలని పండు స్వామి మనుషులు చూస్తారు, అప్పుడు నారప్ప ఏం చేసాడు, తన చిన్న కొడుకును ఎలా రక్షించుకున్నాడో అదే మిగిలిన కథ.
డబ్బు ఉన్నవాడికి పేదవాడికి మధ్య జరిగే జరిగే పోరాటమే నారప్ప సినిమా, భూమి ఉంటే తీసేసుకుంటారు, డబ్బు ఉంటే లాగేసుకుంటారు, కాని చదువును మాత్రం ఎవ్వరు తీసుకోలేరు, లాక్కోలేరు అంటూ చదువు యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ సాగిన కథ ఇది.
పీరియాడికల్, యాక్షన్ డ్రామా గా ఈ చిత్రం తెరకెక్కింది, తమిళ్ లో వచ్చిన అసురన్ సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఒరిజినల్ లో ఉన్న ఎమోషన్ ను ఎక్కడా మిస్ అవకుండా అద్భుతంగా తెరకెకించారు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, కథను చాలా చక్కగా ప్రేక్షకులకు కళ్ళాకు కట్టినట్టు చూపించడం లో దర్శకుడు విజయం సాధించారు.
ఇక వెంకటేష్ నటన ఈ సినిమా కు ప్రధాన ఆకర్షణ, ఆయన కొన్ని సన్నివేషాల్లో ప్రేక్షకుల చేత కన్నీళ్ళు తెప్పిస్తారు, అయితే మొదటి భాగం కాస్త నెమ్మదిగా అనిపించినప్పటికీ మునికన్నా హత్య తరువాత సినిమా వేగం అందుకుంటుంది.
ఇక ఫ్లాష్‌బ్యాక్, క్లైమక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేషాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
నారప్ప (Narappa) సినిమా వెంకటేష్ వన్ మ్యాన్ షో అని చెప్పవచ్చు. సినిమాని మొత్తం తన భుజాల మీద వేసుకున్నారు.ఎమోషన్ సన్నివేషాలలో ఆయన నటించిన తీరు అందరికి కంటతడి పెట్టించడమే కాదు ఆయన గొప్ప నటుడు అని చూసేవారందరికి అనిపిస్తుంది. ఇక షరామామూలుగానే యాక్షన్ సన్నివేషాలలో వెంకీ అదరగొట్టేసారు.
ప్రియమణి కూడా తన నేచురల్ యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకుంటారు. అలాగే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సారి రీమేక్‌ను ఎంచుకున్నారు. ఇక మొత్తంగా సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నారప్ప మనసు గెలుచుకుంటాడు, చదువు విలువ, బ్రతుకు విలువ తెలిసేలా చేస్తాడు.