జోక్స్ & కథలు

Money: ఎవరు గొప్ప (రెండు వేల రూపాయల నోటు మరియు రూపాయి నాణెం)

Money
Money: రెండు వేల రూపాయల నోటు మరియు ఒక్క రూపాయి నాణెంలో ఎవరు గొప్పో తెలుసుకోండి

అనగనగా రెండు వేల రూపాయల నోటు మరియు ఒక్క రూపాయి నాణెం ఒకే పర్సులోకి చేరాయి, రూపాయి నాణెం రెండు వేల నోటును కలిసిన ఆనందం లో ఆశ్చర్యపోతూ రెండు వేల నోటును అలాగే చూస్తూ ఉండిపోయింది.

దానితో రెండు వేల నోటు రూపాయి నాణెం తో ఇలా అంది ‘ ఏంటి మిత్రమా నన్ను అలాగే చూస్తున్నావు అని అన్నది ‘ అప్పుడు రూపాయి నాణెం నోటు తో ఏమిలేదు మిత్రమా నీ విలువ నాకంటే ఎక్కువ రెండువేల రెట్లు ఎక్కువ కదా, నీజీవిత కాలంలో ఎంతో మంది కన్నీళ్ళు తుడిచి ఉంటావు, ఎంతో మంది ఆకలి తీర్చి ఉంటావు ఎంతో మందిని ఆదుకొని ఉంటావు.అలాంటి నిన్ను చూస్తూ ఉంటే రెప్ప మూయలేక పోతున్న అని అంటుంది.

దానికి రెండు వేల రూపాయల నోటు బాధపడుతూ ” లేదు మిత్రమా, ఎవరి కన్నీళ్ళను తుడిచి, కడుపు నిండా అన్నం పెట్టే అవకాశం నాకు రాలేదు, ఎందుకంటే నేను పెద్ద ఉద్యోగి ఇంట్లోకి వెళ్ళాను, వాడు నన్ను తన లాకర్‌లో దాచాడు,ట్యాక్స్ ఎగ్గొట్టాడనే కారణం చేత ఈ మధ్య జరిగిన ఐటి దాడుల్లో నేను బయటకు వచ్చాను.

లాకర్‌లో నుండి బయట పడిన ఆనందం కొన్ని రోజులు కూడా లేదు, ఐటి దాడుల్లో పట్టుబడిన సొమ్ములో (Money) నుండి లంచం రూపం లో ఐటి అధికారికి ఇచ్చాడు.

లంచం తీసుకున్న అధికారి మళ్ళీ నన్ను లాకర్‌లో దాచాడు. నా జీవితం మొత్తం లాకర్‌లోనే గడిచిపోయింది. మొన్నే బయటికి వచ్చా అని అంటుంది, తరువాత నాణెం ను తన సంగతి చెప్పమంటుంది.

Money

అప్పుడు రూపాయి నాణెం (Money) ఇలా అంది ” మిత్రమా నా జీవితం లో ఎక్కడెక్కడ తిరిగానో చెప్పలేను. బిచ్చగాడి పళ్ళెంలో పడి వాడి ఆకలి తీర్చాను, ఏడుస్తున్న పిల్లవాడికి చాక్లెట్ ఇప్పించి వాడి మొహం లో చిరునవ్వును చూసాను, పూజారి హారతి పళ్ళెంలో, దేవుడి హుండిలో అక్కడి నుండి భగవంతుడి చరణాలను తాకి అలా ఒక చోటేంటి నేను తిరగని చోటే లేదు మిత్రమా ..

భగవంతుడి పాదాల నుండి మొదలుకొని పేదోని అంతిమ యాత్రల వరకు నేను ప్రతీ చోట ఉన్నాను అంటు ధీమాగా చెప్పింది..”

అప్పుడు రెండు వేల రూపాయల నోటు ఇలా అంది.. ఎంత విలువయినది కాదు మిత్రమా ఎంత మందికి చేరువై, వారి ఆకలి తీర్చామన్నదే ముఖ్యం అని అంటుంది.

నీతి : ఎంత ఉన్నతంగా బతికామన్నది కాదు ,ఎంత మందిని అక్కున చేర్చుకున్నామన్నదే ముఖ్యం.

ఇది కూడా చదవండి : రోదసీ లోకి వెళ్ళిన తొలి భారత వనిత