Sireesha Bandla: రోదసీ లోకి వెళ్ళిన తొలి భారత వనిత:

astronaut
Sireesha Bandla: కల్పనా చావ్లా, సునీతా విలియంస్ తరువాత రోదసీ లోకి వెళ్ళిన నాలుగవ మహిళ శిరీష బండ్ల .

శిరీష బండ్ల (Sireesha Bandla) 34 ఏళ్ల ఏరోనాటికల్ ఇంజనీర్, ఆమెతో పాటు జులై ఆదివారం బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ మరియు మరో నలుగురు కలిసి వర్జిన్ గెలాక్టిక్ యొక్క స్పేస్ షిప్ టూ యూనిటీలో అమెరికా రాష్ట్రం న్యూ మెక్సికో నుండి అంతరిక్ష అంచు వరకు ప్రయాణం చేశారు.

శిరీష బండ్ల (Sireesha Bandla) 4 సంవత్సరాల వయస్సులో యుఎస్ వెళ్లి, 2011 లో పర్డ్యూ విశ్వవిద్యాలయం యొక్క స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందారు.

బ్రిటిష్ వ్యాపార వేత్త రిచర్డ్ బ్రాన్సన్, తెలుగు అమ్మాయి శిరీష బండ్ల (Sireesha Bandla), మిగతా బృందం జులై ఆదివారం రోజు విజయవంతంగా రోదసీ అంచులకు వెళ్ళి వచ్చారు.

న్యూమెక్సికో నుంచి బయలుదేరి భూ ఉపరితలం నుంచి 53.5మైళ్ళ (సుమారు 86 కిమీలు) ఎత్తుకు వరకు Sireesha Bandla వెళ్ళారు.

అక్కడ భార రహిత స్థితిలో రిచర్డ్ బ్రాన్సన్, మిగతా సిబ్భంది అక్కడ గాలిలో తెలుతున్న దృశ్యాల్ ఆ యాత్ర లైవ్ స్ట్రీమింగ్‌లో అగుపించాయి.

అయితే , ఈ మాసంలోనే ప్రపంచ కుబేరుడు, అమేజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కూడా రోదసి యాత్ర చేసాడు, కాని బ్రాన్సన్ బృందం కర్మన్ లైన్ దాటలేదు కాబట్టి రోదసీ లోకి వెళ్ళినట్లు కాదని బెజోస్ సంస్థలు “బ్లూ ఆరిజాన్” అంటుండంతో అనేక అంశాలు ఇప్పుడు చర్చకొస్తున్నాయి.

ఈ క్రమంలో అసలు భూ ఉపరితలానికి ఎంత దూరం నుంచి రోదసీ మొదలవుతుంది?? ఇంతకీఇ కర్మన్ లైన్ అంటే ఏమిటి? సబార్బిట్ అంటే ఏమిటి వంటి అంతరిక్ష సాంకేతిక అంశాలను చూద్దాం.

Sireesha Bandla

“వర్జిన్ గెలాక్టిక్” యాత్రకు రెండు రోజుల్ ముందే జులై 9 న  “బ్లూ ఆరిజాన్” వరుసగా రెండు ట్వీట్లు చేసింది. అందులో భాగంగా వర్జిన్ గెలాక్టిక్ , బ్లూ ఆరిజాన్ ల యాత్రలను పోల్చి చూపించింది.

దాని ప్రకారం .. వర్జిన్ గెలాక్టిక్ మిషన్ లో భాగంగా వెళ్తున్నవారు రోదసీ లోకి వెళ్ళినట్లు కాదని పేర్కొంది.

భూమి నుంచి 100కిలో మీటర్ల వద్ద అంతర్జాతీయంగా గుర్తించిన “కర్మన్ లైన్ ” నుంచి రోదసీ మొదలవుతుందని …96% ప్రపంచం ఈ లెక్కనే గుర్తించిందని, కేవలం ప్రపంచం లో 4%మంది 80కిలోమిటర్లు దాటితే రోదసీ మొదలయినట్లేనని చెబుతారని ఆ ట్వీట్లో పేర్కొంది.

న్యూ షెపర్డ్ అనేది ఒక రాకెట్ అని , వర్జిన్ గెలాక్టిక్ కు చెందిన యూనిటి-22 ఎక్కువ ఎత్తులో ఎగరగైలిగే విమానం (హైఆల్ట్యూడ్ ఎయిర్‌ప్లేన్) మాత్రమేనని అందులో చెప్పారు.

అయితే ,వర్జిన్ గెలాక్టిక్ రోదసీ యాత్ర తరువాత “నాసా” వారిని అభినందిస్తూ ట్వీట్ చేసింది. అందులో వారు స్పేస్ లోకి వెళ్ళి వచ్చారనే పేర్కొంది.

ఇంతకీ రోదసీ ఎక్కడి నుండి మొదలవుతుంది?

Sireesha Bandla

సముద్ర మట్టం నుండి 100కిలోమీటర్ల(62మైళ్ళు లేదా 3,28,000)ఎత్తుకి వెళ్ళిన తరువాత “కర్మన్ లైన్”కి అవతల రోదసీ మొదలవుతుందని అంతర్జాతీయంగా ఎక్కువ దేశాలు ఆమోదిస్తున్నాయి. అయితే, ఆ ఎత్తులో కూడా కొన్ని చోట్ల భూ వాతావరణం కొంతమేర ఉంటుంది.

ఈ ఎత్తుకు వెళ్ళిన తరువాత ఆర్బిటాల్ వెలాసిటి (కక్ష్యా వేగం) సాధించకపోతే ఏ వస్తువయిన తిరిగి భూమ్మీదకు పడిపోతుంది. అయితే భూమి నుంచి 80కిమీ ల దూరం వెలితే రోదసీ లోకి వెళ్ళినట్లేనని అమేరికా గుర్తిస్తోంది. అమెరికా బృందం, నాసా కూడా కర్మన్ లైన్ కంటే 12 మైళ్ళు దిగువ నుంచే అంటే, 50మైళ్ళ (80కిమీ) నుంచీ రోదసీ మొదలవుతుందని చెబుతున్నాయి..

ఈ 80కిమీ ల దూరం ను “ఆస్ట్రోనాట్ లైన్” గా పిలుస్తున్నారు.1960 నుంచి అమెరికా దీన్నే రోదసీ సరిహద్దుగా పిలుస్తోంది. ఈ ఎత్తు దాటి వెళ్ళిన వారు పరిశోధకులైన, ప్రయాణికులైనా ఎవరియినా సరే అక్కడి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారిని “ఆస్ట్రోనట్స్” గానే గుర్తిస్తోంది.

కొత్త లెక్క…118కి.మీ దూరం :

రోదసీ సరిహద్దు ఖచ్చితంగా తేల్చాలనే ఉద్ధేశంతో 2009లో కాల్గరీ యూనివర్సిటీ పరిశోధకులు “సుప్రాథర్మల్ అయాన్ ఇమేజర్” అనే పరికరాన్ని వాడారు..

భూ వాతావరణం లోని సాధారణ గాలులు, అంతరిక్షం లోని ప్రమాదకర ప్రవాహాల మధ్య మార్పును కొలవడానికి దీన్ని వాడారు.

ఈ పరికరం అందించిన డాటా ప్రకారం రోదసీ సరిహద్దు సముద్ర మట్టం నుంచి 73 మైళ్ళ (118కిమీ) వద్ద మొదలవుతుందని వారు చెప్పారు.

ఇది కూడా చదవండి : గూగుల్ పే లో ట్రాన్స్‌ఫర్ లిమిట్ ఎంతనో తెలుసా