జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

Google Pay UPI : గూగుల్ పే లో ట్రాన్స్‌ఫర్ లిమిట్ ఎంతనో తెలుసా

Google Pay
Google Pay:  గూగుల్ పే ఖాతా నుంచి ఒక రోజుకు రూ.లక్ష వరకే డబ్బు పంపే అవకాశం ఉంటుందని సంస్థ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది.

ఈ మధ్యకాలంలో యూపిఐ (యునైటెడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) నుండి చేసే ట్రాన్సాక్షన్లు బాగా పెరిగిపోయాయి. మరి ముఖ్యంగా అయితే గూగుల్ పే,ఫోన్ పే,పేటిఎం వంటి యుపిఐ పేమెంట్ యాపులను చాలా మంది వాడుతున్నారు.

చాలా శాతం ఈ యాపుల నుండే పేమెంట్ కడుతునారు. ఎక్కడైన, ఏదైన వస్తువు కొన్నా, ఎక్కడయినా షాపింగ్ చేసినా . వెంటనే ఎవరికైన డబ్బులు పంపాలన్న ఈ యాపుల నుండె డబ్బును ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు.

బ్యాంక్ నుండి బ్యాంక్ కు యూపిఐ ద్వారా డబ్బు పంపితే వెంటనే క్రెడిట్ అయ్యే సదుపాయం ఉండడంతో డబ్బు పంపిణీ(మనీ ట్రాన్స్‌ఫర్)కు ఈ మధ్య అందరూ ఎక్కువగా యూపిఐ విధానాన్నే పాటిస్తున్నారు.

అయితే యూపిఐ పేమెంట్ కు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఈ క్రమంలో అందరూ ఎక్కువగా వాడే పేమెంట్ యాప్ గూగుల్ పే (Google Pay) కు లిమిట్ ఎంత, నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.

Google Pay

గూగుల్ పే (Google Pay) మాత్రమే కాకుండా ఇతర యాప్స్ ద్వారా కూడా ఒక బ్యాంక్ ఖాతా నుంచి ఒక రోజుకు రూ.లక్ష వరకే డబ్బు పంపే అవకాశం ఉంటుందని సంస్థ తన సపోర్ట్ పేజీలో పేర్కొంది. లక్ష కంటే ఎక్కువ పంపిస్తే ఆ ట్రాన్సాక్షన్ సక్సెస్ కాదని తెలిపింది.

అలాగే అన్ని యూపిఐ యాప్స్‌లో ఒకరోజుకు పది (10)సార్లు మాత్రమే డబ్బు ను పంపే అవకాశం ఉందని తెలిపారు..
అయితే ఈ యూపిఐ లిమిట్ కు ఆయా బ్యాంకుల్లో ఆయా పరిమితులు(లిమిట్స్) ఉంటాయి. కొన్ని బ్యాంకుల అకౌంట్లకు రూ.లక్ష లిమిట్ ఉంటే మరి కొన్ని బ్యాంకులకు తక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులు ఒక రోజుకు రూ.లక్ష వరకు యూపిఐ ద్వారా చెల్లింపు చేసుకునే అవకాశం ఉండగా ..అదే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అకౌంట్ కు కేవలం రోజుకు రూ.పదివేలు(10వేలు) లిమిట్ ఉన్నది.

దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులు రూ.లక్ష వరకు యూపిఐ లిమిట్ ను కలిపిస్తుండగా ఇంకొన్ని బ్యాంకులేమో రూ.50వేలు, రూ.20వేలు, రూ.10 వేలు గరిష్ట యూపిఐ పరిమితిని ను విధించాయి.

యూపిఐ లిమిట్ విషయం మీద బ్యాంకును సంప్రదించి పరిమితి కనుక్కుంటే ట్రాన్సాక్షన్ లు చేసుకునేందుకు ఇబ్బందులు ఉండవు.

ఇది కూడా చదవండి : సరికొత్త వాట్సాప్ ఫీచర్లు ఇవే