టెక్నాలజీ & గాడ్జెట్లుజాతీయం-అంతర్జాతీయం

WhatsApp 2021: సరికొత్త వాట్సాప్ ఫీచర్లు ఇవే

WhatsApp
WhatsApp : ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్లు వాడేవారికి కొన్ని ప్రత్యేకమయిన ఫీచర్లను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సంస్థ కంకణం కట్టుకుంది.

ప్రఖ్యాత మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశ పెడుతుంటుంది. అయితే గత కొద్ది నెలలుగా ఈ వాట్సాప్ భారత్ లో ప్రైవసీ పాలసీ వివాదం ఎదుర్కొంది. ఆ క్లిష్ట కాలం లోనూ కొత్త ఫీచ్గర్లను ముందుకు తీసుకు రావడం లో వెనుకంజ వేయలేదు.

రీడిజైన్‌డ్ ఇన్ యాప్ నోటిఫికేషన్స్ :

మాతృక సంస్థ ఫేస్‌బుక్ టెక్నాలజీ ని అప్‌డేట్ చేయడం మీద దృష్టి సారిస్తుంది. ఈ క్రమంలో వాట్సాప్‌ను రీడిజైన్ చేయడానికి సంస్థ నిర్ణయం తీసుకుంది.

వాట్సాప్ బీటా ఇన్‌ఫో ప్రకారం యాప్ నోటిఫికేషన్లపై పని చేస్తోంది. నోటిఫికేషన్ బ్యానర్, ఫోటోలు, వీడియోలు, జీఐఎఫ్ మరియు స్టిక్కర్లలో మరింత సమాచారం అందించే దిశగా వాట్సాప్ కృషి చేస్తోంది.

WhatsApp

యాప్ నోటిఫికేషన్స్ వాట్సాప్ యూజర్లు పెద్దదిదిగా చేసుకుని చాట్ ప్రివ్యూ కూడా చెక్ చేసుకునే ఇంకో ఫీచర్ ను అందించడానికి కృషి చేస్తోంది. నోటిఫికేషన్స్లో నేరుగా స్క్రోల్ చేసి పాత సందేశాలను చూసుకునేలా మార్పులను చేస్తోంది.

వ్యూ వన్స్ ఫీచర్ (View One Feature) :

వాట్సాప్ కొత్తగా తీసుకొస్తున్న ఫీచర్లలో వ్యూ వన్స్ ఫీచర్ (View One Feature) ఒకటి. మనం మెస్సేజులు, ఫోటోలు, వీడియోలు ఎవరికయిన పంపిస్తే వారు వాటిని వారికి ఎప్పుడు అవసరం అయినపుడు ఎన్ని సార్లు అయినా తీసి చూసుకోవచ్చు, అయితే వ్యూ వన్స్ ఫీచర్ గనక అందుబాటులోకి వస్తే మనం పంపిన మెస్సేజులు, ఫోటోలు, వీడియోలు ఎవరికయిన పంపిస్తే వారు వాటిని ఒకసారి చూసి ఆ చాట్ నుండి బయటకి రాగానే ఆ సమాచారం అదృశ్యం అవుతుంది.

కాని ఇక్కడ మెస్సేజును అందుకున్న వ్యక్తి మెస్సేజులు, ఫోటోలును స్క్రీన్ షాట్ తీసుకునే ఒక అవకాశం ను కలిపించింది.

వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫాంస్ (WhatsApp voice  Waveforms) :

వాట్సాప్ కంపెనీ అందించే మరో కొత్త ఫీచర్ వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫాంస్. వాయిస్ మెస్సేజులు వింటున్న వాయిస్ అనేది వేవ్ రూపం లో కనిపిస్తుంది.

వాట్సాప్ బీటా ప్రకారం అయితే ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్ వాడేవారు(యూజర్స్) సిద్ధం అయింది. ఐఫోన్ (ఐఓస్) యూజర్లకు ఇంకా టెస్టింగ్ దశలోనే ఉన్నాట్లు సమాచారం.

మనం ఇప్పడివరకు వాయిస్ మెస్సేజు వింటుంటే బార్ ముందుకు వెలుతుంది. అయితే ఈ కొత్త వాట్సాప్ వాయిస్ వేవ్‌ఫాంస్ ఫీచర్ అందుబాటులోకి వస్తే తరంగాల రూపంలో మెస్సేజు డిస్ప్లే అవుతుంది.

ఇది కూడా చదవండి : భోజన ప్రియుల కోసం 5 బెస్ట్ ప్రదేశాలు.