లైఫ్ స్టైల్

Almonds: చక్కని ఆరోగ్యానికి రోజూ బాదం పప్పు ఎక్కువ తింటే ముప్పు

Almonds
Almonds: మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ బాదాం పప్పును నాన బెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఈ ఉరుకుల పరుగుల జీవితం లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎల్లప్పుడూ పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని డాక్టర్లు సూచి స్తుంటారు. ఈ క్రమం లోనే చాలా మంది నట్స్ , సీడ్స్ తింటుంటారు. నట్స్ లో  ఎక్కువ మంది బాదాం పప్పులని ఎక్కువగా తింటుంటారు, బాదం పప్పులో ఎన్నో పోషకాలు ఉంటాయి.

అలాగే మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఈ బాదం పప్పును నాన బెట్టి ఉదయాన్నే తింటే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు, ఇవి రోగ నిరోధక శక్తి పెరగడంలో కూడా బాగా తోడ్పడుతాయి.

మరి రోజుకు ఎంత బాదాం తినాలి అతిగా తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

Almonds

బాదం లో ఎన్నో పోషకాలు ఉన్నాయి వాటిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అని వైద్యులు చెబుతూ ఉంటారు.
రక్తం లో కొవ్వు స్థాయిలను తగ్గించడమే కాకుండా హై బిపి , గుండె సంభందిత వ్యాధులను దూరం చేస్తుంది.
అలాగే శరీరంలో కాల్షియం స్థాయిని పెంపొందిస్తుంది. అటు డయాబిటిస్ భాదితులు బాదం పప్పులను రోజూ తినడం చాలా మంచిది.

ఇదిలా ఉంటే శరీరానికి మేలు చేస్తుంది కదా అని మోతాదుకి మించి ఏదీ తీసుకోకూడదు. ప్రతి రోజు ఏ ఆహారం అయినా అధిక మోతాదులో తీసుకుంటే లేని పోని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇదే సూత్రం బాదం కు కూడా వర్తిస్తుంది, రోజుకు 8 నుంచి 10 బాదాం పప్పులు తినమని వైద్యులు సూచిస్తున్నారు.

Almonds

అయితే బాదం (Almonds) పప్పులని నేరుగా తినకుండా నీటిలో నానబెట్టి 7 లేదా 8 నిమిషాల తరువాత తొక్క తీసి తింటే మంచిదట. అయితే బాదం (Almonds) లో ఎన్నో పోషకాలు ఉంటయని అవి ఆరోగ్యానికి చాలా మంచిదని మోతాదుకు మించి తింటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : భూమికి శత్రువుగా మారుతున్న జాబిల్లి