Land Rates in Telangana 2021: తెలంగాణా లో భూముల విలువ పెరిగింది, భూముల విలువ పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది, ఎల్లుండి (23 July) నుంచి భూముల కొత్త ధరలు అమలులోకి రానున్నాయి, ఒక్క రోజే ఉండడంతో సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు జనాలు పోటెత్తారు.
తెలంగాణాలో గత ఏడేళ్ళుగా భూముల ధరలను (Land Rates) పెంచలేదు ప్రభుత్వం.దీనితో మార్కెట్ వాల్యూ కన్న తక్కువ ధరకే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీని వల్ల హోం లోన్స్ పొందడం లో ఇబ్బంది ఎదురయ్యేవి. వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం భూముల ధరలను పెంచింది.
గత కొన్నేళ్ళుగా తెలంగాణా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు కసరత్తు చేస్తూ ఉంది, కేబినెట్ సబ్ కమిటీ కూడా రాష్ట్రం లో ఆదాయ వనరులు పెంచుకునేందుకు మార్గంగా రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచడం, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి భూముల విలువలను రివైజ్ చేయాలని ఆదేశాలను జీవో ప్రభుత్వానికి జారీ చేసింది.
ఏదైతే 2013 లో అనగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఈ భూముల యొక్క రిజిస్ట్రేషన్ కు సంభందించినటువంటి చార్జెస్ అనేవి రివైజ్ చేయడం జరిగింది. అదే విధంగా భూముల విలువలను కూడా రివైజ్ చేయడం జరిగింది.
తెలంగాణా ప్రభుత్వం వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ చార్జీల విషయం లో ఆలోచించి వాటి ధరలను తగ్గించారు, భూముల విషయానికి వస్తే 2013 నుండి ఇప్పడి వరకు ఎలాంటి రివైజ్ చేయలేదు, ఒక వైపున బహిరంగ మార్కెట్ లో భూముల విలువలు భారిగా పెరుగుతున్నప్పడికీ..
పరిశ్రమలు రావడం అదే విధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లు రావడం,వ్యవసాయానికి సంభంధించిన పనులు పెరిగిన నేపథ్యంలో అన్ని చోట్ల ,హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో విస్తరణ జరిగిన నేపథ్యంలో కూడా ప్రభుత్వం భూమల వాల్యూస్ పెంచలేదు.
దాని వల్ల ప్రభుత్వానికి నష్టం రావడం, మరియు ఎవరియితే వినియోగ దారులు ఉన్నారో వారి లోన్స్ విషయం లో కూడా ఇబ్బందులు వచ్చున నేపథ్యంలో వీటన్నిటినీ రివ్యూ చేసిన ప్రభుత్వం భూముల ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది.
జూలై 22వ తేదీ నుండి పెంచిన భూముల ధరలు (Land Rates) అమలులోకి రావడం జరుగుతుంది. ఇప్పడి వరకు తెలంగాణా లో రిజిస్ట్రేషన్ చార్జీలు కేవలం 6% మాత్రమే ఉండేవి, వీటిని 7.5% కి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముందు ఎవరయితే స్లాట్స్ బుక్ చేసుకున్నారో వారికి కూడా కొత్త ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ లు చేసుకోవాల్సి ఉంటుంది అని ప్రభుత్వం తెలిపింది.
వ్యవసాయ భూముల విషయానికి వస్తే ఎకరం భూమి ధర ఇప్పడివరకు మార్కెట్ లో కనిష్టంగా పదివేలు(10,000) ఉండేది, దానిని ఇప్పుడు గరిష్టంగా రూ.75,000 లకు చేయడం జరిగింది.
వీటిని ఆధారంగా చేసుకుంటూ 3 కేటగిరీలు గా విభజించడం జరిగింది.
తక్కువ రేంజులో భూముల ధరలను (Land Rates) ప్రస్తుతం ఉన్న వాల్యూస్ కన్న 50% పెంచడం జరిగింది, మిడ్ రేంజులో ఉన్న భూమల ధరలను 40%, మిగతా హై రేంజు ఉన్న వాటిని 35% పెంచడం జరిగింది.
అదే విధంగా ఒపెన్ ప్లాట్స్ విషయానికి వస్తే ఇప్పడి వరకు గజం ధర రూ.100 గా మార్కెట్ వాల్యూ ఉండేది మినిమం గా వాటి ధర రూ.200 చేయడం జరిగింది.
అపార్ట్‌మెంట్స్ విషయంలో ఇప్పడి వరకు చదరపు అడుగుకు రూ.800 మినిమం చార్జెస్ ఉండేవి , అయితే వాటిని మినిమం గా రూ.1000 లకు చేయడం జరిగింది.