Lionel Messi : అర్జెటీనా ఆటగాడు లియోనెల్ మెస్సీ ఇన్‌స్టా లో పెట్టిన ఫోటో తో వచ్చిన లైకులతో రొనాల్డోను బీట్ చేసాడు, ఇంటర్‌నెట్ అందరికి అందుబాటు లోకి వచ్చాక సోషల్ మీడియాను తెగ వాడేస్తున్నారు.
డిజిటల్ మీడియా జోరు సాగుతున్న ఈ కాలం లో ..సెలెబ్రిటీలు ఏది పెట్టినా ఏం చేసినా దాన్ని ఒక సంచలనంగా మార్చేస్తున్నారు. కామెంట్లు,లైకులతో రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టిస్తున్నారు. మరి ముఖ్యం గా అభిమానులు ఐతే చాల చురుకుగా ఉంటూ సెలెబ్రిటీలకు ఉత్సాహాన్ని అందిస్తున్నారు.
అయితే ఇటీవల సెలెబ్రిటీ షేర్ చేసిన ఒక ఫోటో రికార్డును సొంతం చేసుకుంది. దాని వివరాల్లోకి వెలితే ఫుట్‌బాల్ ఆటగాళ్ళయిన రొనాల్డో, లియోనెల్ మెస్సీ సోషల్ మీడియాలో రికార్డులతో యుద్దం చేస్తున్నారు. లియోనెల్ మెస్సీ (Lionel Messi) ,రొనాల్డో క్రియేట్ చేసిన ఒక రికార్డును బ్రేక్ చేసాడు.
ఈమధ్య కోపా అమెరికా టోర్నీలో అర్జెంటీనా టీం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంగా లియోనెల్ మెస్సీ తన ట్రోఫీతో ఒక చిత్రాన్ని దిగాడు. ఆ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రాం ఖాతా లో పంచుకున్నాడు.
ఇప్పటి నుంచి ఆ ఫోటో తెగ వైరల్ అయిపోయింది. ఆ చిత్రానికి దాదాపు ఇరవై మిలియన్లకు (20 మిలియన్లు) అనగా రెండు కోట్లకు పైగా లైకులు వచ్చాయి. ఇన్‌స్టాగ్రాం ఖాతాలో ఓ అథ్లెట్ పంచుకున్న చిత్రానికి ఇన్ని లైకులు రావడం ఇదే మొదటిసారి.
ఇంకోవైపు గతంలో డీగో మారడోనా చనిపోయినప్పుడు ఆయనకు నివాళిగా ఒక చిత్రాన్ని రొనాల్డో షేర్ చేసాడు. ఇప్పడిదాకా రొనాల్డో,మారడోనా చిత్రాలకు 19.8 మిలియన్లకు అనగా 1.98 కోట్లకు పైగా లైకులు వచ్చాయి. ఇటీవల లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఆ రికార్డును బద్దలు చేసాడు.
కోపా అమెరికా ఫైనల్స్ లో బ్రెజిల్ అపి లియోనెల్ మెస్సీ ఆధ్వర్యంలో అర్జెంటీనా టీము విన్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇందులో లియోనెల్ మెస్సీ ఈ గేములో నాలుగు గోల్స్ చేసి ఆయన కెరీర్‌లోనే మొట్ట మొదటిసారిగా అంతర్జాతీయ ట్రోఫీను దక్కించుకున్నాడు. ఈ గేములో ముఖ్య పాత్ర వహించి ,ప్లేయర్ ఆఫ్ ద టొర్నీగా లియోనెల్ మెస్సీ పేరొందాడు.