జాతీయం-అంతర్జాతీయం

Treasure Gold: బయటపడిన లంకె బిందెలు – అమ్మవారి నగలా? గుప్త నిధులా?

Treasure
Treasure: కళ్ళు జిగేల్ మనే బంగారం , బయటపడిన లంకెబిందె!  అవి అమ్మవారి నగలా? లేక కాకతీయ రాజులకు చెందిన సొమ్ములా? పెంబర్తిలో కాకతీయుల ఆనవాళ్ళున్నాయా? పురావాస్తు శాఖా అధికారుల ఏం చెప్తున్నారో ఇక్కడ చదవండి.

గుప్త నిధుల (Treasure) కోసం చీకటి గుహల్లో కూడా అన్వేషిస్తుంటారు, చారిత్ర ఆనవాళ్ళ ఆధారంగా సింబల్స్ ను ఆసరాగా చేసుకోని గుప్త నిధులకోసం గాలిస్తుంటారు.

అయితే జనగామా జిల్లాల్లో మాత్రం ఒక్క సారిగా గుప్త నిధులు బయట పడ్డాయి. పెంబర్తిలో కళ్ళు జిగేల్ మనేలా లంకె బిందె బయట పడింది, ఒకటి కాదూ, రెండు కాదూ ఏకంగా అయిదు కిలోల పైగానే బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి.

మొదట లంకె బిందె (Treasure) ను చూసి భూ యజమాని ఆశ్చర్యపోయినా ఆ తరువాత తేరుకోని ఈ విషయాన్ని అందరికీ తెలియ చేసాడు.

Treasure
జనగామా జిల్లా పెంబర్తి కి చెందిన సంకట నర్సయ్య కుమారుడు సంకట ఎల్లయ్య సంకట పరుశురాములు కి చెందిన భూమిని నెలన్నర క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం భోగారానికి చేందిన మెట్టు నరసింహ అనే రియల్ఎస్టేట్ వ్యాపారికి కొనుగోలు చేసాడు.

404, 399 సర్వే నంబరు గల ఈ భూమి దాదాపు 11 ఎకరాల వరకు ఉంటుంది. అయితే ఈ భూమి లో వెంచర్ వేసేందుకు చదును చేస్తుండగా జెసిబి కి ఏదో తగిలినట్టు అనిపించింది. వెంటనే దాని దగ్గరికెళ్ళి చూడగా ఆశ్చర్యం, ఆనందం ఒక్క సారిగా వారిని ఉక్కిరిబిక్కిరి చేసాయి.

లంకెబిందె (Treasure) బంగారు, వెండి నగలతో నిండిన కనిపించింది. ఒకటి కాదూ, రెండు కాదూ ఏకంగా అయిదు కేజీల కంటే ఎక్కువే ఉంది అది. దీనిని చూసిన వెంటనే గతం లో భూ యజమాని అయిన సంకట ఎల్లయ్యకు, ఆ తరువాత మిగితా చుట్టు పక్కల వారికి సమాచారం ఇచ్చారు నరసింహ.

Treasure

లంకెబిందె (Treasure) బయట పడిన సమయంలో అక్కడ ఇద్దరు మాత్రమే ఉన్నారు, ఆ తరువాత స్థానికులు ఇచ్చిన సమాచారం తో పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు.తన భుమిలో లంకెబిందె బయట పడడంతో దగ్గరికెళ్ళి చేతుల్లోకి తీసుకున్నాడు భూ యజమాని నరసింహ, అంతే ఒక్క సారిగా పూనకం తో ఊగిపోయాడు , ఆ సమయంలో అమ్మవారే తనని పూనింది అన్నట్టు అనిపించింది అన్నారు నరసింహ.

మరి ఆ సొమ్ము ఎవరికి చెందాలి? భూ యజమానికి హక్కు ఉంటుందా? గ్రామానికి కొంత చెందే అవకాశం ఉంద? లేక పురావస్తు శాఖా స్వాధీనం చేసుకుంటుందా?

సాధారణంగా గుప్త నిధులు బయట పడితే రెండు జంట లంకెబిందెలు బయట పడుతుంటాయి, కాని పెంబర్తిలో ఒకటే లంకెబిందె దొరికింది.

Treasure

అందులో అన్ని అమ్మవారి నగలు ఉన్నాయని అన్నారు భూ యజమాని నరసింహ. తమ గ్రామంలో అమ్మవారి ఆలయం నిర్మిస్తామని ఇందులోని నిధిలో పెంబర్తి గ్రామానికి కొంత చెందేల అధికారులను కోరారు పెంబర్తి గ్రామ సర్పంచ్.

ఇంకా ఇందులో పురావస్తు శాఖా అధికారులు ఒక బౌండరీ ఫిక్స్ చేసి త్రవ్వకాలు జరిపితే ఇంకా కూడా కొన్ని నిధులు బయట పడే అవకాశం ఉంది అని ,ఆ త్రవకాలను కూడా త్వరలో జరపాలని అధికారులను కోరారు ఆ గ్రామ సర్పంచ్.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ లో మరో ఐటీ హబ్