IT Hub : హైదరాబాద్ లో హైటెక్‌సిటీని మించి కొత్తగా కొత్తగా సిలికాన్ వ్యాలీ ఏర్పాటు కాబోతుందని వార్తలు వచ్చాయి. అమెరికా సిలికన్ వ్యాలీని గుర్తు తెచ్చేలా ఇది ఉండబోతుందా అని కొన్ని వార్తలు వినబడుతున్నాయి.
మరో ఐటి హబ్ రాబోతుందా అని చర్చలు నడుస్తున్నాయి.
హైదరాబాద్ ఐటీ కి కేరాఫ్ గా మారింది. వరల్డ్‌వైడ్ గా మేటి కంపెనీలన్ని హైదరాబాద్ లో భాగ్యనగరం లో తమ కార్యాలను ఏర్పాటు చేసుకున్నాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి లో ఏర్పాటు అయిన సాఫ్ట్‌వేర్ కంపెనీలతో హైదరాబాద్ ప్రపంచ పటం లో నిలిచింది.
తెలంగాణా లో ప్రత్యక్షంగా , పరోక్షంగా లక్షాలాది మందికి ఐటీ రంగం ఉపాధి కల్పిస్తోంది. దీనితో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ లో దేశం లోనే తెలంగాణా అగ్రస్థానం లో నిలుస్తోంది.
హైదరాబాద్ (IT Hub) అడ్డాగా తెలంగాణా లో ఎన్నో ఐటీ కంపెనీలు ఉన్నాయి. హైటెక్ సిటీ ,సైబర్ టవర్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కోకాపేట్, ఆదిభట్ల మొదలుకొని వరంగల్ హైవే లోని పోచారం వరకు ఎన్నో సాఫ్ట్‌వేర్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
హైదరాబాద్ నలు మూలలతో పాటు రాష్ట్రం లోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ విలువలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం లో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు సృష్టిస్తోంది.
సాఫ్ట్‌వేర్ రంగంలో టాప్ ప్లేస్ లో కనిపిస్తున్న హైదరాబాద్ ఈ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఇప్పుడున్న హైటెక్ సిటీ ని మించి కొత్తగా ఐటీ హబ్ (IT Hub) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అమెరికా సిలికన్ వ్యాలీని తలపించేలా నిర్మించేలా ప్లాన్ చేస్తోంది. దీనికోసం పక్కా ప్రణళికలతో ముందుకెళుతున్న సర్కార్ 640 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ నగరాన్ని ఏర్పాటు చేయబోతోంది.
హైటెక్ సిటీ కి సమీపంలో అవుటర్ రింగురోడ్డుకు ఆనుకుని కొత్త ఐటీ హబ్ రానుంది. కొత్త ఐటీ హబ్ (IT Hub) కోసం సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొల్లూరు , ఈదులనాగులపల్లి మరియు రంగారెడ్డి జిల్లా లోని కొండకల్ గ్రామాల పరిధిలోని 640 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది. దీన్ని హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో డెవలప్ చేయనున్నారు.
దీనికి అవసరమయిన భూములను ల్యాండ్ పోలింగ్ విధానంలో సమీకరించనుంది సర్కార్.ఆ భూములను తీసుకొని డెవలప్ చేసి భూయజమానులకు ఎకరాకు 600 గజాల ప్లాట్ కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఈ 640 ఎకరాలలో ప్రభుత్వానికి చెందిన అసైట్, సీలింగ్ భూములు ఎక్కువగా ఉన్నాయి.
640 ఎకరాల విస్తీర్ణం లోని భూమిని బెంగళూరు తరహాలో సాఫ్ట్‌వేర్ రంగానికి కేంద్రంగా చేయనున్నారు ,అమెరికా లోని సిలికన్ వ్యాలీ తరహాలో సువిశాలమయిన రోడ్‌లు ,అండర్‌గ్రౌండ్ విధ్యుత్ సరఫరా వ్యవస్థ, తాగునీరు ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో మౌళికమయిన సదుపాయాలను ఏర్పాటు చేయబోతోంది. దీనికోసం ఏరియా డెవలప్‌మెంట్ ప్లాన్ రూపొందిస్తుంది.
డెవలప్‌మెంట్ చేసిన ప్లాన్ ను ఐటి అనుబంధ రంగాలకు సంబంధించిన కంపెనీలకు విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదయం సమకూరడం తో పాటు ఐటీ హబ్ (IT Hub) ద్వారా పది లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సర్కార్ అంచనా వేస్తోంది.