క్రీడలుజాతీయం-అంతర్జాతీయం

Olympics Tokyo 2021 : ఒలంపిక్స్ – టోక్యో

olympics tokyo
Olympics Tokyo 2021 : భారత కాలమాన ప్రకారం జూలై 23 సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ఒలంపిక్స్ వేడుకలు ప్రారంభం అయ్యాయ్.

టోక్యో ఒలంపిక్స్ (Olympics Tokyo) కి కౌంట్ డౌన్ ప్రారంభం అయిపోయింది. జూలై 23 న టోక్యో ఒలంపిక్స్ (Olympics Tokyo) కలర్‌ఫుల్ గా ప్రారంభం అయ్యాయి. అయితే కరోనా కారణంగా వేడుకలకు ప్రేక్షకులను అనుమతించడం లేదు, ఈ సారి ప్రేక్షకులు లేకుండానే విశ్వ క్రీడలను నిర్వహించారు.

ప్రారంభోత్సవానికి భారత్ నుండి 22 మంది క్రీడాకారులు, 6గురు అధికారులు మాత్రమే హాజరయ్యారు. ప్రారంభోత్సవాన్ని కేవలం 950 మంది మాత్రమే వీక్షిస్తారు, ప్రపంచ దేశాల నుంచి 20 విశిష్ట అతిథులు హాజరయ్యారు.

భారత కాలమాన ప్రకారం జూలై 23 సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ఒలంపిక్స్ వేడుకలు ప్రారంభం అయ్యాయ్.
జపాన్ చక్రవర్తి అకిహి తో ఒలంపిక్స్ వేడుకలను ప్రారంభించారు. అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ కూడా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు,  జపాన్ ప్రధాని సుగా ఆమెకు ఘన స్వాగతం పలికారు.

Olympics Tokyo

టోక్యో ఒలంపిక్స్ లో తెలుగు వాళ్ళు కూడా భాగస్వామ్యులు అయ్యారు. టోక్యో ఒలంపిక్స్ కు వాలంటీర్ లుగా పని చేసారు.
టోక్యో ఒలంపిక్స్ ప్రారంభం కావడానికి ముందుగా గ్రీస్ నుండి ఒలంపిక్స్ ఫ్లేమును తీసుకు వచ్చి టోక్యో లోని అన్ని ప్రదేశాలలో తిప్పి చివరగా టోక్యో కి చేరుతుంది.చివరి రోజున ఒలంపిక్స్ ప్రారంభం అవుతాయి.

ఈ సారి ఎన్నడూ లేని విధంగా భారత్ నుంచి 120 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు, 2016 లో జరిగిన రియో ఒలంపిక్స్ లో కేవలం రెండే మెడల్స్ గెలిచి తీవ్రంగా నిరాశ పరిచిన ఇండియా ఈసారి వాటి సంఖ్యను పెంచుకోవాలన్న పట్టుదల తో ఉంది.

టోక్యో ఒలంపిక్స్ (Olympics Tokyo) లో ఇండియా మొదటి బోణీ :

Olympics Tokyo

టోక్యో ఒలంపిక్స్ లో ఇండియా మొదటి బోణీ కొట్టింది, తొలి పతకాన్ని సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ 49కేజీల విభాగం లో మీరాభాయ్ చాను సిల్వర్ మెడల్ సాధించింది. వెయిట్ లిఫ్టింగ్ లో కరణం మల్లేశ్వరి తర్వాత ఒలంపిక్స్ పతకాన్ని సాధించింది మీరాభాయ్.

2000 లో ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పతకాన్ని సాధించింది కరణం మల్లేశ్వరి. సిల్వర్ మెడల్ సాధించిన మీరాభాయ్ చాను కు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మనిపూర్ మనిపూస అంతర్జాతీయ వేదిక పై త్రివర్ణ పతకాన్ని రెపరెప లాడించింది, టోక్యో ఒలంపిక్స్ లో ఇండియా శుభారంభం చేసింది.

olympics tokyo

టోక్యో ఒలంపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ విభాగం లో మీరాభాయ్ 87కేజీ లను విజయ వంతంగా ఎత్తింది, ఆ తరువాత 89 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో ఫేయిల్ అయింది, దీనితో ఆమే రజతం తో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

క్లీన్ అయిండ్ జర్క్ లో 115 కేజీలు ఎత్తిన మీరాభాయ్ చాను ఒలంపిక్స్ లో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది, 22ఏళ్ళ తరువాత ఒలంపిక్స్ లో పతకం సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది మీరాభాయ్ చాను.

ఇది కూడా చదవండి : హైదరాబాద్ లో మరో ఐటీ హబ్