టెక్నాలజీ & గాడ్జెట్లుజాతీయం-అంతర్జాతీయంబిజినెస్

Google Pixel 6 : అదిరిపోయే ఫీచర్స్ – గూగుల్ పిక్సెల్ 6 సిరీస్

google pixel 6
Google Pixel 6 : గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్ లను గూగుల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

మార్కెట్లోకి రోజు రోజుకి కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వస్తుంటాయి. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్లతో, మోడళ్లతో విడుదల చేస్తుంటారు.

ఇక గూగుల్ పిక్సెల్ 6 (Google Pixel 6), గూగుల్ పిక్సెల్ 6  ప్రో (Google Pixel 6 Pro) స్మార్ట్ ఫోన్ లను గూగుల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

ఇవి గూగుల్ టెన్సర్ ప్రాసెసర్ తో పని చేయనున్నాయి, దీనితో పాటు వీటికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా గూగుల్ రిలీజ్ చేసింది.

google pixel 6
@GOOGLE

మేడ్ బై గూగుల్ అనే ట్విటర్ అకౌంట్ ద్వారా వీటిని గూగుల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది, ఇవి మూడు రంగులలో లాంచ్ కానున్నాయి. గూగుల్ పిక్సెల్ 6 ప్రో (Google Pixel 6 Pro) లో వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా ఉండనున్నది, దీనితోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ టెలిఫోన్ షూటర్ ఉండనున్నాయి.

google pixel 6
@GOOGLE

గూగుల్ పిక్సెల్ 6 లో టెలిఫోన్ సెన్సార్ తప్ప మిగిలిన సెన్సార్లు ఉండనున్నాయి, వీటిలో ఇన్డిసిప్లేన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది.

గూగుల్ పిక్సెల్ 6 ప్రో లో 6.7 అంగుళాల యు హెచ్ డి ప్లస్ డిస్ప్లేను అందించనున్నారు, దీని స్క్రీన్ రీఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉండనున్నది.

google pixel 6
@GOOGLE

గూగుల్ పిక్సెల్ 6 లో 6.4 అంగుళాల హెచ్ డి ప్లస్ డిస్ప్లేను అందించనున్నారు, ఈ ఫోన్ యొక్క రిఫ్రెష్ రేటు 96 హెర్ట్జ్ గా ఉండనుంది.

గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్లను గూగుల్ కంపెనీ ప్రముఖ యూట్యూబర్ లకు అందించింది, ఈ స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరమే లాంచ్ అవనున్నాయి. రెండు నెలల క్రితం లీకైన ఫోటోల తరహాలోనే దీని డిజైన్ ఉండబోతుంది.

ఇది కూడా చదవండి : ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో పడనున్న రుణమాఫీ.