జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

Runa Mafi 2021 : ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో పడనున్న రుణమాఫీ.

Runa Mafi
Runa Mafi : తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన నగదు మొత్తం జమ కానుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 16వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో రుణమాఫీ (Runa Mafi) కి సంబంధించిన నగదు మొత్తం జమ కానుంది. రూపాయలు యాభై(50) వేల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ సందర్భంగా శుక్రవారం మన రాష్ట్ర ఆర్థికశాక మంత్రి హరీష్ రావు, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నగరంలోని బి ఆర్ కే ఆర్ భవన్లో బ్యాంకు అదికారులతో సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా 42 బ్యాంకుల అధికారులు భేటీ కి హాజరయ్యారు.

ఈ నేపధ్యంలో ఆర్థికశాక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రూపాయలు యాభై(50) వేల లోపు ఉన్న రైతుల రుణమాఫీ (Runa Mafi) పై క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ ఇది లాంఛనంగా ఈ రుణ మాఫీ (Runa Mafi) నీ ప్రకటిస్తారు అని చెప్పారు.

New Rules

ఆగస్టు 16వ తేదీ నుంచి ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు రూపాయలు 2006 కోట్లు జమ అవుతాయని అన్నారు.

బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు ఈ ఇద్దరి సమన్వయంతో రైతుల ఖాతాల్లో మొత్తం రుణమాఫీ జమ అయ్యేలా చూడాలి. ఇందుకు గాను తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంక్ అధికారులకు సూచించారు.

ఈ యొక్క రుణమాఫీ రైతుల ఖాతాల్లో మొత్తం జమ అవగానే ముఖ్యమంత్రి పేరుతో రైతుల యొక్క రుణం మాఫీ అయినట్లు వారి యొక్క మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ లు వెళ్లాలన్నారు.

Cheaper Countries

రైతు రుణమాఫీ తో పాటు కొత్త రుణానికి మీరు కనుక అర్హులు అయితే ఆ సందేశంలో తప్పకుండా తెలపాలన్నారు.

రైతుల ఖాతాల్లో జమ అయిన రుణమాఫీ మొత్తాన్ని ఇతర ఖాతాల్లోకి జమ చేయకూడదు అన్నారు. రైతులకు ఇబ్బందులు వచ్చేలా చేయకూడదు అని అన్నారు. రుణమాఫీ లబ్ధిదారుల ఖాతాలలో ఉన్న రుణాన్ని జీరో చేసి కొత్త పంటకు అవసరం అయ్యే రుణం కూడా ఇవ్వాలని అన్నారు.

Runa Mafi

మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల రుణమాఫీ చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలన్నారు.

బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణమాఫీ మొత్తం చేరేలా చూడాలని అన్నారు. వ్యవసాయ శాఖ తరపున సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక శాక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకులకు సంబండిచిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి : ఏకలవ్యుడిని కృష్ణుడు ఎందుకు చంపాడో మీకు తెలుసా?