క్రీడలుజాతీయం-అంతర్జాతీయం

Gold Medal in Olympics 2021 : ఇండియా కు మొదటి గోల్డ్ మెడల్

Gold Medal
Gold Medal in Olympics 2021 : టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా కు మొదటి గోల్డ్ మెడల్, జావెలిన్ త్రో లో స్వర్ణం సాదించి సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా

జావెలిన్ త్రో లో స్వర్ణం (Gold Medal) సాదించి సంచలనం సృష్టించిన నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో భారత్ కు మొదటి గోల్డ్ మెడల్ అందించి అందరి మన్ననలను పొందాడు.

నీరజ్ చోప్రాను అభినందించిన రాష్ట్రపతి, ప్రధాని, నీరజ్ చోప్రా పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ రోజు ఒలింపిక్స్ లో చరిత్ర లిఖించబడిందని ఆయన అన్నారు. ఫైనల్ లో నీరజ్ చోప్రా చాలా బాగుందని ప్రధాని మెచ్చుకున్నాడు.

Gold Medal

ఎన్నాళ్ళో వేచిన కల సాకారం అయింది. భారత ఒలింపిక్స్ అథ్లెటిక్స్ లో బంగారు పతాకాన్ని గెలుచుకున్న మొదటి బారతీయుడు అయ్యాడు. ఒలింపిక్స్ జావెలిన్ త్రో ఈవెంట్ లో బంగారు పతాకం సాదించాడు.

ఫైనల్ ఈవెంట్ లో 87.58 మీటర్లు విసిరాడు. ఫస్ట్ అటెంప్ట్ లో 87.03 మీటర్లు విసిరిన నీరజ్, సెకండ్ అటెంప్ట్ లో ప్రదర్శన మెరుగుపరుచుకొని 87.58 మీటర్లు విసిరి మొదటి స్థానం లో నిలిచాడు.

ఇది కూడా చదవండి : అదిరిపోయే ఫీచర్స్ – గూగుల్ పిక్సెల్ 6 సిరీస్