బిజినెస్

IPO Market : లక్షలు లక్షలు లాభాలు తెచ్చిపెడుతున్న ఐపిఓ ఇన్వెస్ట్‌మెంట్!

IPO
IPO Market :  ఐపీఓ (IPO) అంటే ఏమిటి, అందులో ఎలా పెట్టుబడి పెట్టాలో,  మనకు లాభాలు తెచ్చిపెట్టేవి ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఐపిఓ (IPO) అనగా ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఏదైనా ఒక కంపెనీ మొదటి సారి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతూ ఉంటే దానిని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటాము.

ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఉదాహరణ కి, ఒక కంపెనీ చాలా సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉండి, అది  ఇంకా విస్తరించాలనుకుంటే, దాని కోసం చాలా డబ్బులు కావాలి, అది కూడా కోట్లలో కావాల్సివస్తుంది.

అప్పుడు వాళ్లకి రెండు మార్గాలు ఉంటాయి.

IPO

ఒకటవ మార్గం: వాళ్ళు డైరెక్ట్ గా బ్యాంకు కి వెళ్లి బ్యాంకు నుండి డబ్బు అప్పుగా తీసుకోవచ్చు. కానీ, వాళ్ళు వాళ్ల దగ్గర ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి లోన్ కి అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఆ లోన్ తీసుకోవడం ద్వారా ప్రతి నెల దానికి అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.

రెండవ మార్గం: స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశించడం, అది కూడా ఐపీఓ (IPO) ద్వారా, ఆ కంపెనీకి కావాల్సిన డబ్బుల విలువ గల కంపెనీ షేర్స్ ను ఐపీఓ ద్వారా పబ్లిక్ కి అమ్మకానికి పెడతారు,   అలా ఎవరెవరైతే షేర్స్ కొంటారో  వాళ్లకి షేర్స్ వస్తాయి, కంపెనీకి డబ్బు వస్తుంది. దీని ద్వారా కంపెనీ విస్తరించుకోవచ్చు, అలా వచ్చిన డబ్బులు మళ్ళీ ఒక్క రూపాయి కూడా కంపెని ఎవరికీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

కంపెనీ చాలా బాగా నడుస్తుందనుకోండి షేర్స్ కొన్న వాళ్ళ షేర్ వాల్యూ పెరుగుతుంది, అలాంటప్పుడు ఎవరి దెగ్గర అయితే  షేర్స్ ఉంటాయో  వారి యొక్క షేర్ ధర పెరిగి వాళ్ళందరికీ లాభాలు వస్తాయి, ఈ రకంగా ఐపిఓ పనిచేస్తుంది.

అందువల్ల ప్రతి కంపెనీ ఐపిఓ ద్వారా స్టాక్ మార్కెట్ లోకి  రావాలి అనుకుంటుంది, ఎందుకంటే స్టాక్ మార్కెట్ లోకి వెళ్తే వాళ్లకు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు, ఆ రకంగానే ఆస్తులు కూడా తనకా పెట్టాల్సిన అవసరం ఉండదు.

IPO

ఈ స్టాక్ మార్కెట్లు 2 రకాలు గా ఉంటాయి:

  1. ప్రైమరీ మార్కెట్
  2. సెకండరీ మార్కెట్

ప్రైమరీ మార్కెట్ ఏమిటంటే ఐపీఓ (IPO). ఏదైనా కంపెనీ ఫస్ట్ టైం లిస్టు అవుతూ ఉంటే దానిని ఐపిఓ అంటాం. ఈ ఐపిఓలో వాటికి ఓపెనింగ్ మరియు క్లోజింగ్ డేట్స్ ఇస్తారు. ఈ టైం లోనే మనం దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఒకవేళ అందరు అప్లై చేసుకున్నారు అనుకోండి ఉదాహరణకు లక్ష షేర్స్ ఉన్నాయనుకోండి, పది లక్షల మంది అప్లై చేస్తున్నారనుకోండి పది లక్షల మందికి రావు.

దానికి బిడ్డింగ్ వేస్తారు లేదా కొన్ని కొన్ని సార్లు లాటరీ ద్వారా తీస్తారు, అందువల్ల ఎవరికైతే అదృష్టం ఉంటుందో వాళ్ళకి మాత్రమే షేర్స్ లభిస్తాయి.

కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే కంపెనీ పది లక్షలు షేర్స్ ని ఇష్యూ చేస్తుందనుకోండి, కానీ కొనేవాళ్ళు మాత్రం మూడు లక్షలు, నాలుగు లక్షలు మాత్రమే ఉన్నారనుకోండి, అప్పుడు అందరికి షేర్స్ వస్తాయి, కానీ అలాంటి వాటికీ డిమాండ్ లేకపోవడం వలన షేర్ వాల్యూ పెరగదు, అప్లై చేసిన వాళ్ళు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది, అలాంటప్పుడు కంపెనీ కి కూడా సరిగ్గా డబ్బులు రావు.

Coinbazzar

ఈ ఐపివో లో ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ డబ్బులు మాత్రమే కంపెనీకి వెళ్తాయి. ఒకసారి కంపెనీ లిస్ట్ అయిన తర్వాత దానిని సెకండరీ మార్కెట్ అంటారు.

ఐపిఓ (IPO) ఓపెన్ అయింది, ప్రజలు కొనుక్కున్నారు, చాలామందికి అలాట్మెంట్ అయింది. అలా అంతా జరిగిన తర్వాత సెకండరి మార్కెట్ లోకి లిస్ట్ అవుతుంది. అనగా ఎన్ఎస్ఈ (NSE) , బిఎస్ఈ (BSE) లోకి ఎంటర్ అవుతుంది.

లిస్ట్ అయిన తర్వాత జనం షేర్స్ ని అమ్ముకున్న, కొనుక్కున్న కంపెనీకి సంబంధం ఉండదు మరియు కంపెనీకి ఒక్క రూపాయి కూడా రాదు. ఎవరైతే ఐపిఓ లో డబ్బును ఇన్వెస్ట్ చేశారో ఆ డబ్బు మాత్రమే కంపెనీకి వెళ్తుంది.

లిస్ట్ అయిన తర్వాత అంటే సెకండరీ మార్కెట్ కు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి షేర్స్ వస్తాయి, ఎవరైతే కొనుకుంటారో వాళ్లకు మాత్రమే డబ్బు వస్తుంది తప్ప కంపెనీకి ఒక్క రూపాయి కూడా వెళ్లదు.

చాలా కంపెనీలు ఐపిఓ (IPO) లో ప్రవేశం పొందాలని అనుకుంటాయి. అయితే దానిలో ప్రవేశం పొందాలంటే ముందుగా సెబీ (SEBI) దగ్గరికి వెళ్ళాలి.

సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ అఫ్ ఇండియా, వాళ్ల దగ్గరికి వెళ్లి డ్రాఫ్ట్ బుక్ లెట్ ని సబ్మిట్ చేయాలి, దీనిలో కంపెనీ యొక్క అన్ని వివరాలు ఉంటాయి.

Cheaper Countries

ప్రతీ విషయం ఉంటుంది, ఎలా అంటే, ఎప్పుడు స్టార్ట్ చేశారు, బిజినెస్ మాడెల్ ఏమిటి, ఏ ప్రోడక్ట్స్ ని అమ్ముతున్నారు, దాని సీఈఓ ఎవరు, మేనేజర్ ఎవరు, ఆ రకంగానే ప్రతి సంవత్సరం ఎంత సంపాదన వస్తుంది, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అని అలా అన్ని వివరాలు సెబీకి సబ్మిట్ చేయాలి.

సెబీ వాళ్లు పరిశీలన  చేసి  అంతా సరిగ్గా ఉంటే అప్రూవ్ ఇస్తారు, సరిగ్గా లేకుంటే ఉదాహరణకి సమాజానికి హాని జరుగుతుందనుకోండి లేదా దాని వల్ల ఇంకా ఏదైనా ఇబ్బంది ఉందనుకోండి వాళ్ళు దానిని రిజెక్ట్ చేస్తారు.

ఒకవేళ అప్లై చేసిన తర్వాత సెబీ వాళ్లు అప్రూవ్ చేసినట్టయితే, వాళ్ళు కంపెనీ ఐపిఓ (IPO) ను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కి అప్పచెప్తారు.

IPO

ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఏం చేస్తారంటే ప్రతిదీ వాళ్లే ఫిక్స్ చేస్తారు, ఎలా అంటే, ఫేస్ వాల్యూ ఎంత, షేర్ వాల్యూ ఎంత, ఎప్పుడు అలాట్మెంట్ కావాలి, ఎప్పుడు ఓపెనింగ్ డేట్, ఎప్పుడు క్లోజింగ్ డేట్ అలా అంతా వాళ్లే ఫిక్స్ చేస్తారు.

ఫిక్స్ చేశాక మళ్ళీ సెబీకి అప్పచెప్తారు, అంతా ఒకే అయ్యాక దానిని బయటకు  విడుదల చేస్తారు.

ఫలానా కంపెనీ ఐపిఓ ఈ తేదీన ఇష్యూ చేస్తూ ఉంది, షేర్ ప్రైస్ ఇంతా బిడ్ చేసుకోండి అని చెప్తుంది. అలా కంపెనీ ఐపిఓ లను విడుదల చేస్తూ ఉంటారు.

మీరు కనుక ఐపిఓ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీ దగ్గర కచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి, ఆ రకంగానే ట్రేడింగ్ అకౌంట్ కూడా ఉండాలి.

ఇది కూడా చదవండి : ఇండియా కు మొదటి గోల్డ్ మెడల్