G Meet 2021: ఇప్పుడు గూగుల్ మీట్ లో అదిరిపోయే కొత్త ఫీచర్

g meet
G Meet : ఇతర యాప్స్ కు పోటి ఇచ్చేలా గూగుల్ మీట్ సరి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇప్పుడు కోవిడ్ కారణంగా ఆన్‌లైన్  తరగతుల నుంచి వర్క్ ఫ్రం హోం వరకు అన్ని ఆన్‌లైన్ లోనే  జరిగిపోతున్నాయి, దీనితో ఇతర యాప్స్ కు పోటి ఇచ్చేలా గూగుల్ మీట్ సరి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

g meet

G Meet ద్వారా ప్రతి సమావేశం(మీటింగ్) లో ఒకే సారి 25 మంది కో-హోస్ట్(Co-Host) లను జత  చేయవచ్చునని గూగుల్ సంస్థ తెలిపింది.

సమావేశం(మీటింగ్) నిర్వహించే హోస్ట్(Host) కు ఉండే అన్ని అధికారాలు కో-హోస్ట్(co -host) కు కూడా ఉంటాయి, అంతేకాకుండా పార్టీసిపేంట్లను మ్యూట్(Mute) లో పెట్టడం, సమావేశాలను ముగించడం వంటి పనులు కూడా కో-హోస్ట్(Co-Host) లు చేయగలరు.

g meet

వీరంతా మీటింగ్స్ సమర్థవంతంగా, సులభంగా నిర్వహించేందుకు హోస్ట్(Host) కు సహాయ పడతారు, దీనివల్ల హోస్ట్ లు మీటింగ్ లో చేరే   వ్యక్తుల అభ్యర్థన(Request) లను  సులభంగా  నియంత్రించవచ్చు.

యూజర్లు ఎక్కువగా రిక్వెస్ట్ చేసిన ఫీచర్ల లో మీటింగ్ మోడరేషన్ ఫీచర్ ఒకటి కాగా, గూగుల్ మీట్ (G Meet) ఈ ఫీచర్ ను ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది.

g meet

ముందు సేఫ్టీ ఫీచర్స్ అనేవి  గూగుల్ వర్క్ స్పేస్ వినియోగించే ఎడ్యుకేషన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి, కానీ ఇప్పుడు ఇవి గూగుల్ మీట్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

దీనిని క్విక్ యాక్సెస్ ఫీచర్ ముందుగానే  ఎనేబల్(ON) చేసి ఉంటుంది, ఎనేబుల్ చేయడం ద్వారా సమావేశంలో పాల్గొనే పార్టీసిపేంట్లు హోస్ట్ డొమైన్(Domain) నుంచి ఆటోమేటిక్ గా జాయిన్ అవచ్చు. మొబైల్ లేదా డెస్క్ టాప్ డివైస్ నుంచి అయినా మీటింగ్ లో చేరవచ్చు.

g meet

కొ-హోస్ట్ లు ప్రశ్నోత్తరాలు, పోల్స్ ను నిర్వహించడం లాంటి పనులు చెయ్యడం వల్ల హోస్ట్ కు చాలా సమయం ఆదా అవుతుంది, దానితో హోస్ట్ తన ప్రెసెంటేషన్ లను సులభంగా చేసుకోవచ్చు.

అడ్మిన్ల కోసం హోస్ట్ మేనేజ్మెంట్ సెట్టింగ్ లు డిఫాల్ట్ గా ఆన్ లేదా చేసేందుకు వీలుగా ఓ సెట్టింగును గూగుల్ పరిచయం చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి :
కొత్తగా మార్కెట్లోకి వస్తున్న మడత ఫోన్లు – అద్భుతమైన ఫీచర్లతో
18 ఏళ్ల లోపు యూజర్లకి సరి కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టిన గూగుల్
అదిరిపోయే ఫీచర్స్ – గూగుల్ పిక్సెల్ 6 సిరీస్
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ భళా