బిజినెస్జాతీయం-అంతర్జాతీయం

DMart Online : బిలియనీర్ల క్లబ్ లో డీమార్ట్ అధినేత రాధా కిషన్ దమాని

DMart Online
DMart Online : తాజాగా భారత దేశం నుంచి మరొకరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల క్లబ్ లో చేరారు.

తాజాగా భారత దేశం నుంచి డీమార్ట్ అధినేత- రాధా కిషన్ దమాని ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన వంద మంది బిలియనీర్ల క్లబ్ లో చేరారు, భారత్ లో బిసినెస్ పుంజుకుంటోంది, మన వ్యాపారవేత్తలు వందల కోట్ల ఆస్తులను గడిస్తున్నారు, ప్రపంచం లో కుబేరుల సరసన వారు కూడా నిలుస్తున్నారు.

ఇండియన్ బిగ్ బుల్  గా పేరొందిన రాకేష్ ఝన్‌ఝన్‌వాలాకు గురువు  లాంటి వ్యక్తి  రాధా కిషన్ దమాని, ఆయన ఎన్నో ఏళ్లుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు, ఇటీవల రాధాకిషన్ దమాని పోర్ట్ఫోలియో (Portfolio) ఉన్న  5 కంపెనీలు విపరీతమైన ఆదాయాన్ని సంపాదించి పెట్టాయి.

DMart Online

దీనితో ఒక్కసారిగా ఆయన ఆదాయం 19.3 బిలియన్ డాలర్లకు చేరింది, ఇందులో 4.1  బిలియన్ డాలర్లు ఈ ఒక్క ఏడాదిలోనే ఆయన ఖాతాలో వచ్చిపడ్డాయి, దీంతో ప్రపంచ కుబేరుల్లో ఆయన 97వ  స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బెర్గ్  బిలియనీర్  ఇండెక్స్ తెలిపింది.

ఎక్కువ ఆదాయం డీమార్ట్ (DMart Online) నుంచే అంట :

Tax Return

రాధా కిషన్ దమాని కి అత్యధిక సంపద తెచ్చిపెట్టిన వ్యాపారంలో ప్రథమ స్థానంలో నిలిచింది డీమార్ట్, దమానీ  ప్రధాన ప్రమోటర్ గా ఉన్నడీమార్ట్ షేర్ల విలువ ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయింది, డీమార్ట్ (DMart Online) లో రాధాకిషన్ దమానీ 65.20 శాతం  వాటా  కలిగి ఉన్నారు.

డీమార్ట్ షేర్ విలువ  జనవరి 1న రూ.2,789 ఉండగా, ఆగస్టు 17 న ఏకంగా ఒక షేరు విలువ రూ.3,649 కి చేరుకుంది, కేవలం ఎనిమిది నెలల్లో షేర్ విలువ 31 శాతం పెరిగింది, దీంతో డీమార్ట్  ద్వారా దమానీ ఖాతాలో 1.54 లక్షల కోట్ల సంపద చేరింది.

మిగిలిన సంపదలు:

ICICI Home Loan

రాధా కిషన్ దమాని డీమార్ట్ కాకుండా ఇంకా , సుందరం ఫైనాన్స్ నుంచి రూ.634 కోట్లు, టెంట్ గ్రూప్ నుంచి రూ.488 కోట్లు, బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్  నుంచి రూ.230 కోట్లు, మెట్రో పోలీస్ హెల్త్ కేర్  ద్వారా రూ. 229 కోట్ల సంపదను  కలిగి ఉన్నారు.

ఇవి కూడా చదవండి :
పెట్రోలు ధరల పెంపుపై అసలు నిజం బయటపెట్టిన నిర్మలా సీతారామన్
రేపటి నుంచి 5 రోజుల పాటు బ్యాంకు కు సెలవులు!
సంక్రాంతి బరిలోకి మూడు భారీ బడ్జెట్ సినిమాలు
స్పెషల్ ఎగ్ దమ్ బిర్యాని