లైఫ్ స్టైల్

Hyderabadi Egg Biryani Recipe : స్పెషల్ ఎగ్ దమ్ బిర్యాని

Hyderabadi Egg Biryani Recipe
Hyderabadi Egg Biryani Recipe : స్పెషల్ ఎగ్ దమ్ బిర్యాని ఎంతో టేస్టీ టేస్టీ గా గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యాని.

చాలా రుచిగా ఉండే ఈ ఎగ్ దమ్ బిర్యాని (Hyderabadi Egg Biryani Recipe) ని  ఈ చిన్న కొలతలతో, టిప్స్ తో చేస్తే చక్కగా చికెన్ బిర్యానీ తో పోటీ పడే ఎగ్ దమ్ బిర్యాని రెడీ అయిపోతుంది.

కావాల్సిన పదార్థాలు :

  • దాల్చిన చెక్క-ఒకటి
  •  లవంగ మొగ్గలు-నాలుగు
  • యాలకులు-నాలుగు
  • అనాసపువ్వు -ఒకటి
  • జాపత్రి-ఒకటి
  • మిరియాలు-అర టీ స్పూన్
  • జీలకర్ర -అర టీ స్పూన్
  • గసగసాలు- ఒక టీస్పూన్
  • జీడిపప్పు పలుకులు- 4 నుంచి 5
  • ధనియాలు-ఒక టీ స్పూన్
  •  బిర్యాని మసాలా దినుసులు
  • పెరుగు-పావు కప్పు
  • బాస్మతి బియ్యము -500 గ్రాంలు
  • గ్రుడ్లు -6 నుంచి 8
  • బ్రౌన్ ఫ్రైడ్  ఉల్లిపాయలు-పావు కప్పు

Hyderabadi Egg Biryani Recipe

ముందుగా బిర్యానీ (Hyderabadi Egg Biryani Recipe) కోసం మసాలా పొడిని తయారు చేసి పెట్టుకోవాలి, దాని కోసం  ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో  ఒక్క ఇంచ్ దాల్చినచెక్క, నాలుగు లవంగ మొగ్గలు, నాలుగు యాలకులు, ఒక అనాసపువ్వు, ఒక  జాపత్రి, అర టీ స్పూన్  మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ గసగసాలు, కొన్ని జీడిపప్పు పలుకులు, ఒక టీస్పూన్ ధనియాలు వేసి వీటన్నింటిని  మంచిగా మెత్తని పొడి చేసి మసాలా పొడిని సిద్ధం చేసి పెట్టుకోవాలి.

అదే మిక్సీ జార్ లో  కారానికి  తగ్గిన పచ్చిమిర్చి తరిగి వేసుకోవాలి, అలాగే ఒక పెద్ద టమాటా ని ముక్కలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి, ఇప్పుడు గ్రైండ్ చేసుకొని మెత్తని పేస్ట్ లా  తయారు చేసుకోవాలి.

ఒక గిన్నె తీసుకొని అందులోకి 1/3  కప్పు పెరుగును, అందులో ఒకటిన్నర స్పూన్  కారం, పావు టి స్పూన్  పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

Hyderabadi Egg Biryani Recipe

ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకుని అందులో రెండు లీటర్ల నీటిని  పోసుకోవాలి, ఇందులోకి మొత్తం బిర్యాని (Hyderabadi Egg Biryani Recipe) మసాలా దినుసులు, దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ ల  అల్లం వెల్లుల్లి పేస్ట్,  రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా,  పుదీనా కొద్దిగా  వేసి నీరూ ఎసరు వచ్చే వరకు మరిగించు కోవాలి.

ఎసరు మరుగుతున్నప్పుడు ఇందులోగంట పాటు నాన పెట్టుకొన్న   500 గ్రాముల బాస్మతి బియ్యాన్ని  నీరు లేకుండా వంచేసి  మరిగే నీటిలో   వేసుకోవాలి, మంటను మీడియం లో ఉంచి నిదానంగా కలుపుతూ ఉండాలి.

ఈలోపు వేరొక మంటమీద ఒక చిన్న పాన్  పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, నూనె వేడి అయిన తర్వాత అందులో కి 6 నుంచి 8  ఉడకబెట్టిన గుడ్లను పైన పొట్టు తీసేసి వేసుకోవాలి, అందులోకి సగం స్పూన్  కారం, పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.

Hyderabadi Egg Biryani Recipe

తక్కువ నుంచి మీడియం మంట మీద గుడ్లను చక్కగా వేగే వరకు చేసుకోవాలి, పది పదిహేను నిముషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి, వాటిని చేసుకున్నాక వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.

ఇప్పుడు అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల దాక నూనెను వేసుకొని నూనె వేడి అయిన తర్వాత దాంట్లోకి మొత్తం బిర్యాని (Hyderabadi Egg Biryani Recipe) మసాలాలు వేసుకోవాలి,  దాంట్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును  వేసి  పచ్చివాసన పోయేంత వరకు  కలుపుతూ ఉండాలి, అందులోకి పచ్చిమిర్చి టమాటా పేస్ట్ ను వేసుకోవాలి, నూనెలో  నూనె పైకి తేలే అంతవరకు ఫ్రై  చేసుకుంటూ ఉండాలి.

తర్వాత అందులో కి ఉప్పు, కారం,  పసుపు కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకోవాలి, దాని నుండి నూనె వేరే అయ్యే  అంత వరకు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ట్రై చేసుకున్న తర్వాత ఇందులో కి పావు కప్పు బ్రౌన్ ఉల్లిపాయలు వేసుకోవాలి, అలాగే  సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి.

Hyderabadi Egg Biryani Recipe

మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలా పౌడర్ ను కూడా వేసుకోవాలి, ఒక రెండు నిమిషాల పాటు నూనెలో  వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి, అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉడకబెట్టిన గుడ్లను వేసుకోవాలి.

అందులోకి 500ml నీటిని వేసుకోవాలి,తరువాత  మూతపెట్టి 5 నిమిషాలపాటు ఉడకబెట్టాలి, 5  నిమిషాల తర్వాత నూనె పైకి తేలుతుంది, తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కకు దించుకోవాలి, అందులో నుంచి  సగం గ్రేవి ని పక్కకు తీసి పెట్టుకోవాలి, మిగిలిన సగాన్ని అందులో ఉంచుకోవాలి.

తర్వాత  ముందుగా ఉదకబెట్టుకున్న   పెట్టుకొన్న  బాస్మతి బియ్యాన్ని ఒక లేయర్ గా వేసుకోవాలి, తర్వాత మళ్ళీ పక్కన పెట్టుకొన్న  మిగిలిన గ్రేవీని మళ్లీ ఒక పొరలాగా వేయాలి, దాని మీద మళ్లీ బ్రౌన్ ఆనియన్స్  ఆనియన్స్ ని వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర ను, రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ నీటిలో కలిపి పైన పరుచుకోవాలి.

దమ్ కోసం  (Hyderabadi Egg Biryani Recipe) :

Hyderabadi Egg Biryani Recipe

ఇలా అయిన తర్వాత గిన్నె  పైన ఒక బట్టర్ పేపర్ లేదా అల్యూమినియం ఫాయిల్ ఏది ఉంటే దానిని ఆవిరిపై కి పోకుండా పోకుండా గట్టిగా మూత పెట్టాలి, ఇప్పుడు దమ్  పెట్టడానికి  ఒక పాత పెనాన్ని పొయ్యి మీద పెట్టి ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం మంట మీద  వేడి చేయాలి, తర్వాత  ఈ బిర్యానీ గిన్నె ను ఆ  వేడి పెనం మీద పెట్టాలి .

Hyderabadi Egg Biryani Recipe

మొదట ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడకబెట్టుకోవాలి,  తర్వాత మంట చిన్నగా  చేసుకొని ఇంకొక పది నిమిషాలు మూత పెట్టి ఉడకబెట్టుకోవాలి ,అంతే ఎంతో టేస్టీ టేస్టీ గా గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యాని (Hyderabadi Egg Biryani Recipe) రెడీ అయినట్టే.

ఇవి కూడా చదవండి :
నోరూరించే ఎగ్ కారం దోస
ఆవుపేడతో వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా!
టాక్స్ పేయర్లకు ఊరట ఇచ్చిన ఐటీ శాఖ.. వివరాలివే
ఒక్క ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మిక్స్ తో 10 బ్రేక్ఫాస్ట్ లు