జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

Tax Return : టాక్స్ పేయర్లకు ఊరట ఇచ్చిన ఐటీ శాఖ.. వివరాలివే

Tax Return
Tax Return : టాక్స్ పేయర్లకు ఊరట ఇచ్చిన ఐటీ శాఖ, అదనపు చార్జీలు చెల్లించి రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని వెల్లడించింది.

కరోనా మహమ్మారి కారణంగా  2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐ టి ఆర్ దాఖలు (Tax Returns) చేయడంలో అనేకమంది టాక్స్ పేయర్లు  ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అందుకే వారికి ఊరటనిస్తూ  కేంద్ర ప్రభుత్వం ఐటీ రిటర్న్స్ దాఖలు  గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.

సాధారణంగా ప్రతి ఏడాది ఐ టి ఆర్ దాఖలుకు జూలై 31 వరకు మాత్రమే ఉండేది, గడువు పొడిగించడం పెద్ద ఊరట  ఇచ్చే అంశంగా చెప్పవచ్చు, అయితే ఈ- ఫైలింగ్ (Tax Returns) గడువును  పొడిగించినప్పటికీ కేంద్రం కొత్తగా ప్రారంభించిన ఐటి వెబ్ సైట్ లోని  సమస్యల కారణంగా ట్యాక్స్ పేర్లు లేట్ ఫీజు వడ్డీ చెల్లించాల్సి  వచ్చింది.

Tax Return

ఆగస్టు 1వ తేదీ తర్వాత రిటర్న్ దాఖలు చేసిన వారికి ఈ సమస్య ఎదురైంది, ఇలాంటి వారికి వడ్డీ ఇచ్చేస్తానని ఐటీ శాఖ ప్రకటించింది.

సెప్టెంబర్ 30 వరకు పన్ను చెల్లింపు గడువు ఉన్నప్పటికీ, టాక్స్ చెల్లింపుదారులు  అదనపు వడ్డీ, లేట్ ఫీజు  చెల్లించాల్సి వచ్చింది,  దీనిపై టాక్స్ పేయర్ల   నుంచి ఐటీ శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

దానికి  స్పందించిన ఐటీ శాఖ కొత్త వెబ్సైట్లో సామాజిక సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ పొరపాటు జరిగిందని ఆగస్టు ఒకటవ తేదీననే  సరిదిద్దాం , అయితే అప్పటికి కొంతమంది ఆలస్యంగా వడ్డీ వంటివి చెల్లించారు, వారందరికీ డబ్బును తిరిగి చెల్లిస్తామని ట్విట్టర్లో ట్వీట్ చేసింది.

Tax Return

టాక్స్ పేయర్లు చెల్లించిన అదనపు వడ్డీకి సంబంధించిన సెక్షన్ 243 ఎ,  లేట్ ఫీజు సెక్షన్ 234 ఎఫ్ లను తొలగించినట్లు ఐటీ శాఖ ఆ ట్వీట్ లో పేర్కొంది.

ఇక మీదట ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐ టి ఆర్ తాజా సాఫ్ట్వేర్ ను ఉపయోగించి ఆన్లైన్ లో నేరుగా (Tax Returns) రిటర్న్స్  చేయవచ్చు అని తెలిపింది, ఇప్పడికే  ఎవరైనా అదనపు చార్జీలు చెల్లించి రిటర్న్స్ దాఖలు చేసి ఉంటే ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని వెల్లడించింది.Tax Return

కేంద్ర ప్రభుత్వం  ఎంతో ఆర్బాటంగా కొత్త వెబ్సైట్ ను లాంచ్  చేసినప్పటికీ ఇలాంటి సాఫ్ట్వేర్ లోపాలు కల్పించడంపై టాక్సీ పేయర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ సైట్లో కొత్త ఫీచర్లను పరిచయం చేశానని పరిచయం ప్రభుత్వం చెబుతున్నా కూడా సైట్లో మాత్రం ఇప్పటికీ కమింగ్ సూన్ అని చూపిస్తుంది, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా గతంలో కొత్త రిటర్న్స్ ఫైల్ సాఫ్ట్వేర్ లోని కొన్ని సమస్యలను లేవనెత్తారు.

ఇవి కూడా చదవండి :
పెట్రోలు ధరల పెంపుపై అసలు నిజం బయటపెట్టిన నిర్మలా సీతారామన్
ఆవుపేడతో వ్యాపారం చేయొచ్చని మీకు తెలుసా!
మళ్లీ మొదలైన తాలిబన్ల రాజ్యం
విశ్వక్ సేన్‌ పాగల్ బుక్ చేసుకోండి 25% డిస్కౌంట్ తో