జాతీయం-అంతర్జాతీయం

Talibans Afghanistan : మళ్లీ మొదలైన తాలిబన్ల రాజ్యం

talibans afghanistan
Talibans Afghanistan : ఆఫ్ఘనిస్తాన్ లో  మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది, తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ మొత్తాన్ని  తమ గుప్పెట్లోకి  తెచ్చుకున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ లో మళ్లీ తాలిబన్ల రాజ్యం (Talibans Afghanistan) వచ్చింది, తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ మొత్తాన్ని  తమ గుప్పెట్లోకి  తెచ్చుకున్నాయి, ఊహించిన దాని కన్నా వేగంగా  కాబూల్ ని స్వాధీనం చేసుకొని వారి జెండాను ఎగరవేశారు.

ఒక్కో ప్రావిన్స్ ను  ఆక్రమించుకుంటూ తాలిబన్లు ముందుకెళ్లారు,  దీనితో ఏం చేయలేని పరిస్థితి లో ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం లొంగిపోయింది,  మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీ ని  తాత్కాలిక అధ్యక్షునిగా నియమించారు తాలిబన్లు.

తాలిబన్ల  అధిపత్యానికి ఆప్ఘనిస్తాన్ లొంగిపోయింది, పదిరోజులుగా దేశంలోని ప్రధాన నగరా లను  ఆక్రమిస్తూ వస్తున్న తిరుగుబాటుదారులు తాజాగా  కాబూల్ లోకి దూసుకెళ్లారు, దీనితో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం చేతులెత్తేసింది.

talibans afghanistan

తాలిబన్లకు అధికారాన్ని పూర్తిగా అప్పగించేందుకు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, పూర్తిస్థాయిలో పాలన పగ్గాలు చేతికి చిక్కాక  తాలిబన్ కమాండర్ అబ్దుల్ ఘని  బరాదర్  అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన  అష్రఫ్ ఘని ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయారు, ఘని తో పాటు ఆయన సన్నిహితులు కూడా కజకిస్థాన్ కి వెళ్ళిపోయారు.

ఘని దొరికితే బహిరంగంగా ఉరి తీస్తామని గతంలో తాలిబన్లు హెచ్చరించారు, దీనితో కాబుల్  నుంచి ఏదో ఒక దేశానికి వెళ్ళి  తల దాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ప్రస్తుతం కాబూల్ ఎయిర్పోర్ట్ మినహా ఘని  పారిపోయేందుకు వేరే అవకాశం  లేదు.

talibans afghanistan

బర్గాం  ఎయిర్ బేస్ ను తాలిబన్లకు అఫ్గాన్ (Talibans Afghanistan)  సైనికులు ఇప్పటికే అప్పగించేశారు, ఎయిర్ బేస్ లో  బందీలుగా  ఉన్న 5 వేల మందిని తాలిబన్లు విడుదల చేశారు, కొన్ని నెలలుగా అఫ్గాన్ బలగాలకు, తాలిబాన్ వర్గాలకు మధ్య జరుగుతున్న యుద్ధంలో ముష్కర మూక పూర్తి  ఆదిపత్యాన్ని కొనసాగించింది.

34 ప్రావిన్స్ లను తమ వశం చేసుకున్నారు తాలిబన్లు, కొన్ని నెలలుగా తుపాకులు , బాంబులతో ఒక్కొక్క నగరాన్ని తమ వశం చేసుకుంటూ వచ్చిన తాలిబన్లు   చివరకు మజారే షరీఫ్, జలాలాబాద్ ఆక్రమించారు.

అమెరికా నిఘా వర్గాల కు అంచనాలకు అందని రీతిలో కేవలం ఐదు వారాల్లోనే కాబుల్ ను తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు తాలిబన్లు, కాబోలు నలువైపుల నుంచి చుట్టుముట్టిన తాలిబన్లు ఘనీ  ప్రభుత్వాన్ని అష్టదిగ్బంధనం చేశారు, దీనితో అఫ్గాన్ ప్రభుత్వం (Talibans Afghanistan)  తాలిబన్లకు మోకరిల్లింది.

talibans afghanistan

కాబూల్ లో  తాలిబన్లు శాంతి మంత్రం పట్టించారు, ప్రభుత్వమే తమకు అధికారాన్ని అప్పగించాలని షరతు పెట్టారు, ఘనీ  రాజీనామాతో సాధారణ ప్రజలకు హాని తల పెట్టబోమని ప్రకటన చేశారు.

శాంతియుత చర్చల ద్వారానే కాబూల్ ని హస్త గతం చేసుకున్న తాలిబన్లు, విదేశీయులు అఫ్గాన్ లో ఉండాలనుకుంటే ఉండొచ్చని, అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ స్పష్టం చేశారు.

ఆఫ్ఘనిస్థాన్ లో  పరిస్థితులను  గమనిస్తున్న  భారత్ మన వాళ్ళను తీసుకొచ్చేందుకు కాబూల్ కు ఎయిర్  ఇండియా  విమానాలను పంపించింది, పలు దేశాల ప్రయాణికులతో కాబూల్  ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కిటకిటలాడుతోంది.

talibans afghanistan

కాబూల్ లోకి తాలిబన్లు ప్రవేశించకముందే అమెరికా  పౌరులను సురక్షితంగా తరలించింది ఆ ప్రభుత్వం, అధ్యక్షుడు జో బైడెన్  ఆదేశాల మేరకు కాబూల్ లోని  రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు అమెరికా పౌరుల్ని చినూక్   హెలికాప్టర్లతో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

రాయబార కార్యాలయంలోని రహస్య  డాక్యుమెంట్లను తగల పెట్టింది, ఒకవైపు చెక్ రిపబ్లిక్ కూడా తన దౌత్యవేత్తల ను కాబూల్  అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించింది, ఆఫ్ఘనిస్థాన్  లో పరిస్థితులను అంచనా వేయడంలో అమెరికా అధ్యక్షుడు  జోబైడెన్  విఫలం అయ్యారు.

ఆఫ్ఘనిస్థాన్ సైన్యం చాలా బలంగా ఉందని, సైన్యాన్ని జయించడం అసాధ్యం అని చెప్పారు, తాము మూడు లక్షల సైన్యానికి ట్రైనింగ్ ఇచ్చామని చెప్పారు, వారిని ఓడించడం ఆషామాషి కాదంటూ జూలై 8న ప్రకటన చేశారు.

talibans afghanistan

అయితే ఈ అంచనాలను తాలిబన్లు తలకిందులు చేశారు, ఆయన ప్రకటన చేసిన నెలరోజుల్లోనే ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం (Talibans Afghanistan)  చేసుకొని ప్రపంచాన్నే నివ్వెరపరిచారు.

పాశవిక కు మారు పేరు గా పేరుగాంచిన ఈ ముఠా ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న అని ఆందోళనను వ్యక్తమవుతున్నాయి, మధ్య రాతియుగం నాటి సూత్రాలను నమ్మిన తాలిబన్ల ప్రస్థానం విద్యార్థి దశ వినాశనం వరకు సాగింది. పాశవిక చర్యలతో, ఆటవిక పాలనతో తాలిబాన్లు ఆఫ్ఘన్ ను  నరకప్రాయంగా మార్చారు .

పష్టో  భాషలో తాలిబన్ అంటే విద్యార్థి అని అర్థం, 1990 సంవత్సరములలో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ సేనలపై పోరాడిన  వివిధ ముజాహిదీన్ వర్గాలు  రష్యా నిష్క్రమణ తర్వాత  సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి,  అయితే ముజాహిదీన్ నేతలు జనంపై విపరీతమైన పన్నులు వేసేవారు, డబ్బు కోసం కిడ్నాప్ లకు  పాల్పడేవారు , దీంతో ఆఫ్ఘనిస్థాన్ (Talibans Afghanistan)  అంతా అరాచకం తాండవించింది.

talibans afghanistan

ఈ నేపథ్యంలో 1994లో తాలిబన్లు ముల్లా  ఒమర్ నాయకత్వంలో  దేశంలో సుస్థిరతను నెలకొల్పడానికి రంగంలోకి దిగారు, సౌదీ అరేబియా నిధులతో ఉత్తర పాకిస్తాన్ లో నిర్వహించిన  ఇస్లామిక్  విద్యాలయాలు వీరు చదువుకునేవారు, వ్యవస్థాపక సభ్యులు అంతా ఒమర్ విద్యార్థులే  కావడంతో  ఆ ముఠాకు తాలిబన్ అని పేరు పెట్టారు.

తాలిబాన్ లకు పుట్టినిల్లు పాకిస్తాన్, ఈ వాస్తవాన్ని పాక్  నేతలు నిరాకరిస్తున్నా  తాలిబన్ తొలితరం నాయకులు పాక్   మదరసా ల్లోనే  చదివారనేది  సత్యం,  ఒక దశలో తాలిబాన్ లు  పాకిస్థాన్ లో  అస్థిరతను సృష్టించారు .

ఇటు అమెరికాపై 2001 సెప్టెంబర్ 11న ఉగ్ర దాడికి పాల్పడిన ఆల్ ఖైదా  అధినేత ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్థాన్ లో (Talibans Afghanistan)  స్థావరం ఏర్పాటు చేసుకున్నారని అమెరికా తేల్చింది.

ఇవి కూడా చదవండి :
ఓబిసి (OBC) రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు లేకపోయినా హోమ్ లోన్ గ్యారెంటీ
మీకు కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందా! ఐతే ఇది చదవండి!