లైఫ్ స్టైల్

Immunity Levels : ఈ ఐదు లక్షణాలు కనిపిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గినట్లే

Immunity Levels
Immunity Levels : ఈ కరోనా కాలం లో రోగ నిరోధక శక్తి బలహీన పడకుండా నిరోధించడం మరింత ముఖ్యం, వ్యాధులతో పోరాడే సామర్థ్యం మనం పెంచుకోవచ్చు.

రోగనిరోధక శక్తి అనగా ఇమ్యూనిటీ పవర్, ఇది  అనేక వ్యాధుల నుండి మనల్ని కాపాడుతుంది, రోగ నిరోధక శక్తి (Immunity Levels) బలహీనపడితే, మన శరీరం కూడా  అది తగ్గినట్లు  దాని సంకేతాన్ని ఇస్తుంది, ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ద్వారా, శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యం మనం పెంచుకోవచ్చు.

ఈ కరోనా కాలం లో రోగ నిరోధక శక్తి (Immunity Levels) బలహీన పడకుండా నిరోధించడం మరింత ముఖ్యం, నిరోధక శక్తి అసలు ఎందుకు బలహీనపడుతుంది, దాన్ని మనం  ఎలా బలోపేతం చేసుకోవాలి,  అనేక వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని మనం ఎలా పెంచుకోవాలి, ఇలా అనేక విషయాల పైన ఆరోగ్య నిపుణులు మనకు పలు సూచనలు ఇస్తున్నారు.

Immunity Levels

ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం బలహీనమైన రోగనిరోధక శక్తి (Immunity Levels) కి సంబంధించిన ఐదు పెద్ద సంకేతాలు ఇవే, అవేంటో  చూసేద్దాం.

1) దీర్ఘకాలిక ఒత్తిడి:

Immunity Levels

సుదీర్ఘ ఒత్తిడి కారణంగా, రోగ నిరోధక వ్యవస్థ  యొక్క ప్రతి స్పందన చాలా బలహీనంగా మారుతుంది, అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ ప్రకారం ఒత్తిడి శరీరంలో లింఫోసైట్లు, అనగా తెల్లరక్తకణాల మొత్తాన్ని తగ్గిస్తుంది. ఈ కణాలు సంక్రమణ (ఇన్ఫెక్షన్) తో  పోరాడడానికి సహాయపడతాయి.

2) తరచుగా వచ్చే జలుబు:

Immunity Levels

చలికాలంలో 2 నుంచి 3  రోజుల పాటు జలుబు రావడం సర్వసాధారణం, చాలామంది ప్రజలు ఏడు నుంచి పది రోజులలో కోలుకుంటారు, రోగనిరోధక వ్యవస్థకు  వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలు తయారు చేయడానికి మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది, మీకు  ఎక్కువ రోజులు జలుబు ఉంటే అది బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం అని గుర్తించండి.

3) తరచుగా వచ్చే చెవి ఇన్ఫెక్షన్లు :

Immunity Levels

అమెరికన్ అకాడమీ ఆఫ్ అలర్జీ ఆస్తమా అండ్ ఇమ్యూనాలజీ  ప్రకారం, ఒక  సంవత్సరంలో నాలుగు కంటే ఎక్కువ చెవి ఇన్ఫెక్షన్లు, మరియు రెండు సార్లు న్యూమోనియా వస్తే అది  బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ సంకేతంగా ఉంటుంది, అలాంటి సంకేతాలను మనం నిర్లక్ష్యం చేయరాదు.

4) పేలవమైన కడుపు :

Immunity Levels

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం, 70 శాతం రోగ నిరోధక శక్తి మన జీర్ణ వ్యవస్థ పైన ఆధారపడి ఉంటుంది, ఇక్కడ ప్రయోజనకరమైన బ్యాక్టీరియా మరియు సూక్ష్మజీవులు పేగులను సంక్రమణ (ఇన్ఫెక్షన్) నుండి కాపాడతాయి, మనకు తరచుగా విరేచనాలు, మలబద్ధకం అయితే, అది బలహీనమైన రోగనిరోధక శక్తికి సంకేతం.

4) శరీర గాయాలు ఆలస్యంగా తగ్గడం :

Immunity Levels

శరీరంలో ఎక్కడైనా కోతలు, కాలిన గాయాలు లేదా గీతలు   ఉన్నప్పుడు చర్మం వేగంగా డ్యామేజ్ కంట్రోల్ మోడ్  లోకి ప్రవేశిస్తుంది.

శరీరం కొత్త చర్మాన్ని ఏర్పరచడం లో  సహాయపడడానికి, సైట్ కి పోషకాలు అధికంగా ఉండే  రక్తాన్ని పంపడం ద్వారా గాయాన్ని రక్షించడం ప్రారంభిస్తుంది.

ఈ ప్రక్రియ ఆరోగ్యకరమైన రోగ నిరోధక కణాల పై   కూడా ఆధారపడి ఉంటుంది, గాయాలు మానడం లో  ఆలస్యం కనిపిస్తే అది కూడా రోగ నిరోధక శక్తి శరీరంలో తగ్గినది అనడానికి ఒక  సంకేతం అని భావించాలని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :
ఓబిసి (OBC) రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ
బరిలోకి దిగిన భీమ్లా నాయక్ – పవన్ కళ్యాణ్
షణ్ముఖప్రియకు రౌడీ దేవరకొండ వీడియో కాల్ తో ఆఫర్!
మళ్లీ మొదలైన తాలిబన్ల రాజ్యం