సినిమా

Pawan Bimla Nayak 2021 : బరిలోకి దిగిన భీమ్లా నాయక్ – పవన్ కళ్యాణ్

pawan bimla nayak
Pawan Bimla Nayak : వకీల్ సాబ్ ను ఇంకా మరవకముందే భీమ్లా నాయక్ గా వచ్చేస్తున్నారు మన పవన్,  గబ్బర్ సింగ్ కామెడీ పోలీస్ గా కాకుండా తిరుగు లేని పోలీస్ భీమ్లా నాయక్ గా మన ముందుకు  రాబోతున్నారు.

ఇడ్లీకి సాంబార్ లా, రోటికి చికెన్ కర్రీ లా,  బిర్యానికి థమ్సప్ లా, పవన్ కి పోలీస్ డ్రెస్ పర్ఫెక్ట్ కాంబినేషన్.  స్క్రీన్ పైన చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే, అభిమానులలో (Pawan Bimla Nayak)  పూనకాలు రావాల్సిందే, చూసిన ప్రతి మనిషి గొంతు చించుకొని అరవాల్సిందే.

వీడు ఆరడుగుల బుల్లెట్టు, పవర్ కే  ప్యాకెట్టు, ఫాలోయింగ్ లో ఎవరెస్టు, రికార్డుల పని  పట్టు, మంచితనంతో చెయ్యు  కనికట్టు, అభిమానులకు వీడు  బానిస అయినట్టు, ఇవి  పవన్ గురించి ప్రతి అభిమాని కాలర్  ఎగరేసి చెప్పే ప్రతి మాటలు, ఇవి  ఇంకా నాన్  పవర్  ఫ్యాన్స్ కూడా అనుకోకుండా అనేసే డైలాగులు.

ఆయన ప్రసంగిస్తే  ఒక ప్రళయం, స్క్రీన్ పై డైలాగులు చెబితే ప్రభంజనం, అభిమానులతో ముచ్చటిస్తే  శాంతం, అన్నిటిలోను సహనం, మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇది పవన్ నైజం.

 pawan bimla nayak

పవన్ గురించి ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే  ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది  మరి,  ఒకసారి   ఆయన మేనరిజం గుర్తుకు  తెచ్చుకున్నారా, ఇక  అంతే అంతే ఫ్లో లో  ఉపోద్ఘాతం రావడమే కాదు పై, వంటి పై  ఉన్న రోమాలు కూడా లేచి  నిలబడతాయి.

చేసిన కొన్ని సినిమాలతోనే కొండంత క్రేజ్ ను సంపాదించుకున్న పవన్, ఇక  సినిమాలు చేయను, రాజకీయాల్లోనే నా బ్రతుకు అని ఒక రోజు ప్రకటించారు, దీంతో ఊసురుమన్నారు  ఆయన అభిమానులు,  ఉండబట్టలేక సినిమాలు చేయాల్సిందేనని పట్టుబట్టారు మరి కొందరు, మరి  వారి పట్టో, లేదా పవన్  కనికట్టో తెలియదు కానీ,  రెండేళ్ల గ్యాప్ తర్వాత తిరిగి వకీల్ సాబ్ మన ముందుకు వచ్చారు పవన్.

 pawan bimla nayak

మగువలకు అండగా, మగవారి మెదళ్ళు నిండగా, నాలుగు మంచి మాటలు చెప్పి మరి బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టారు పవన్, అమ్మాయిల హక్కుల్ని సమాజంలో వారికి ఇస్తున్న లెక్కల్ని సరి చేసేందుకు ప్రయత్నించారు, ప్రయత్నించడమే కాదు మగువల మనసు గెలుచుకున్నారు, కుర్రాళ్ళ నడవడికను కొంతైనా మార్చగలిగారు.

ఇక వకీల్ సాబ్ బొనాంజా  తో పవన్  సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ గా సాగుతోంది, ఇప్పటికే యువ డైరెక్టర్లతో వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన పవన్, వాటన్నిటిని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసేందుకు తెగ ట్రై చేస్తున్నారు, ప్రయత్నించడమే కాదు సరికొత్త పీరియాడికల్ కథతో కొత్తగా వస్తున్నాడు.

వకీల్ సాబ్ ను ఇంకా మరవకముందే భీమ్లా నాయక్ (Pawan Bimla Nayak) గా వచ్చేస్తున్నారు మన పవన్, తనకే సెట్ అయ్యే  ఖాకీ డ్రెస్ లో, తనకు క్రేజ్ తెచ్చిపెట్టిన   పోలీస్ గన్నుతో, గబ్బర్ సింగ్ కామెడీ పోలీస్ గా కాకుండా స్ట్రిక్ట్ పోలీస్ భీమ్లా నాయ  గా మన ముందుకు  రాబోతున్నారు, త్రివిక్రమ్ మాటల్ని మరోసారి తన గొంతుతో వినిపించబోతున్నారు.

pawan bimla nayak

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , దగ్గుపాటి రానా కాంబినేషన్లో, త్రివిక్రమ్ రచన సారధ్యంలో, సాగర్ చంద్ర డైరెక్షన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది, మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్  కొశీయుమ్  సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను ప్రస్తుతం  ప్రొడక్షన్ నెంబర్ 12 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వాళ్లు.

ఇప్పటికే విడుదలైన రానా, పవన్ ఫస్ట్ లుక్ పై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి, ఇక తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్  ను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మూవీ మేకర్స్, పవన్ పవర్ కి భీమ్లా నాయక్ పేరు పర్ఫెక్ట్  గా సూట్ అవుతుంది ఇదే పేరును ఖరారు చేస్తారేమో అని కూడా అభిమానుల్లో  కలిగేలా చేస్తున్నారు.

pawan bimla nayak

భీమ్లా నాయక్ (Pawan Bimla Nayak) వస్తున్నాడు అంటూ లేటెస్ట్ గా విడుదలైన మేకింగ్   వీడియో పవన్ ఫ్యాన్స్ ని అలర్ట్  చేసింది, ఇందులో పవన్ ని చూసిన వారు ఏదో ఫ్రెష్  ఫీలింగ్ను  ఎంజాయ్ చేస్తున్నారు.

పోలీస్ యూనిఫాంలో రొమ్ము విరుచుకుని నడిచే తీరు, పెరిగిన ఛాతి సైజు, కళ్ళల్లో ఆ  ఉరిమే ఉరుములు, అన్ని పవన్ లో కొత్త పోలీసును (Pawan Bimla Nayak) చూపిస్తున్నాయి అనేది ఫస్ట్ టాక్, సినిమా దద్దరిల్లిపోతోంది  అనేది సెకండ్ టాక్.

అందులోనూ పవన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తమన్  ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండడం తో భీమ్లా  నాయక్ (Pawan Bimla Nayak) గ్లింప్స్ తో అంచనాకు మించి ఇండస్ట్రీని, ఇంటర్నెట్ ను ఒక రేంజ్ లో వణికిస్తుంది అనడం లో  మనకి  అసలు సందేహమే లేదు.

ఇది కూడా చదవండి : విశ్వక్ సేన్‌ పాగల్ బుక్ చేసుకోండి 25% డిస్కౌంట్ తో