జాతీయం-అంతర్జాతీయం

Prepaid Electricity Meter : మీకు కరెంటు బిల్ ఎక్కువగా వస్తుందా! ఐతే ఇది చదవండి!

prepaid electricity meter
Prepaid Electricity Meter : దేశమంతటా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది, భారత్ లో  త్వరలో రానున్న ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు

దేశమంతటా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను (Prepaid Electricity Meter) ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది, ఈ నేపథ్యంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను ఇన్స్టాల్ చేసుకోవాలని కేంద్ర మంత్రిత్వ శాఖలోని అన్ని పరిపాలనా వ్యవహారాల సంస్థలను ఆదేశించాలని ప్రభుత్వానికి కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది.

ప్రీపెయిడ్ మీటర్లు అమర్చుకోవడం ద్వారా విద్యుత్ పంపిణీ కంపెనీల ఆర్థిక లావాదేవీలు మెరుగుపడుతాయి అని వివరిస్తోంది విద్యుత్ మంత్రిత్వ శాఖ.

prepaid electricity meter

ప్రీపెయిడ్ మీటర్స్ ప్రీపెయిడ్ మొబైల్స్ ఎలా పనిచేస్తాయో అలానే ఇవి కూడా పనిచేస్తాయి, ఎంత విద్యుత్ కు రీఛార్జ్ చేస్తామో అంతే విద్యుత్ సరఫరా అవుతుంది, అయితే దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రీపెయిడ్ మీటర్లను ఉపయోగిస్తున్నారు, ఇందుకు దీనిని రీఛార్జ్ చేసుకోవాలి.

మొదటగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో మీటర్స్ (Prepaid Electricity Meter) ఏర్పాటు చేసిన తర్వాత దేశ వ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్స్ అమలుకానుంది, అంటే విద్యుత్ వినియోగదారులందరికీ ఇళ్ళల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఇన్స్టాల్ చేయబడతాయన్నట్లే.

prepaid electricity meter

బ్యాంకు హామీల కోసం సమయం వృధా చేయకుండా ప్రీపెయిడ్ పవర్ మీటర్లకు ముందస్తు చెల్లింపులు చెల్లించాలని అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర శాఖలను కోరుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీ చేసింది,  అదే సమయంలో ఆర్థిక లావాదేవీలకు అకౌంటుకు నిర్వహించాలని ప్రతి ఒక్క విభాగాన్ని కోరారు.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకారం, అన్ని ప్రభుత్వ సంస్థల విభాగాల్లో స్మార్ట్ విద్యుత్ మీటర్లు పంపిణీ ఆర్థిక స్థిరత్వంలో మార్పు తీసుకురావడానికి, ఇంధన సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలను ముఖ్యమైనవిగా నిరూపించడమే కాకుండా, ఇలాంటి వ్యవస్థను సృష్టించడానికి రాష్ట్రాలకు ఒక నమూనాగా కూడా పనిచేస్తాయి.

prepaid electricity meter

వ్యవసాయ వినియోగదారులు, మినహా విద్యుత్ వినియోగదారులందరికీ దశల వారీగా మీటర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : రీఛార్జ్ తో ఉచిత జీవిత భీమా అందిస్తున్న ఎయిర్‌టెల్, ఇలా చేయండి!