Airtel Prepaid : కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి రీఛార్జ్ తో ఉచిత జీవిత భీమా అందిస్తున్న ఎయిర్‌టెల్, అదిరిపోయే ఆఫర్లను ఇస్తున్న ఎయిర్‌టెల్
మీరు ఎయిర్‌టెల్ (Airtel Prepaid) సిమ్ వాడుతున్నారా అయితే మీకు ఒక శుభవార్త. ఎయిర్‌టెల్ ఒక బంపర్ ఆఫర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది, ఎయిర్‌టెల్ తన కస్టమర్ లకు రీఛార్జి ప్లాన్స్ పై నాలుగు లక్షల వరకు ఉచిత ప్రయోజనాలను అందిస్తుంది, ఫ్రీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు రెడీ అయింది.
ఎయిర్‌టెల్ రెండు ప్రీపెయిడ్ (Airtel Prepaid) రీఛార్జి ప్లాన్స్ పై ఈ ఆఫర్ ను అందిస్తోంది, 279 రూపాయలకు, అలాగే 179 రూపాయల రీఛార్జి ప్లాన్స్ లపై ఈ ప్రయోజనం పొందవచ్చు అని ఎయిర్‌టెల్ తెలిపింది.
279 రూపాయల ప్లాన్ పై 4 లక్షల వరకు ఇన్సూరెన్స్ వస్తుందని ప్రకటన చేసింది, అదే 179 రూపాయల ప్లాన్ పై రెండు లక్షలు ఇన్సూరెన్స్ లభిస్తుందని ఎయిర్‌టెల్ తెలిపింది.
అలాగే 179 రూపాయల ప్లాన్ రోజుకి 1.5జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుందని తెలిపింది, అంతేకాకుండా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు, ఇక 279 రూపాయల ప్లాన్ లో 28 రోజులు వ్యాలిడిటీ మరియు 2జీబీ డేటా వస్తుంది, అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది అని ఎయిర్‌టెల్ పేర్కొంది.
తన కస్టమర్లను మరింత ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లను ఇన్సూరెన్స్ లను కల్పిస్తోంది ఎయిర్‌టెల్.