జాతీయం-అంతర్జాతీయంలైఫ్ స్టైల్

World Lion’s Day : ఆగస్టు 10 నేడే వరల్డ్ లయన్స్ డే

World Lion's Day
World Lion’s Day : మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా ఈ సింహాల గూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది అదే ప్రపంచ సింహాల దినోత్సవం.

బ్రతికితే సింహంలా బతకాలి, చచ్చిన సింహంలా చావాలి, ఆకలేస్తోంది కదా అని సింహం గడ్డి తినదు, పలు సందర్భాల్లో మనిషి తనని తాను సింహంతో పోల్చుకుంటాడు, నిజంగానే అంతటి ప్రత్యేకం గల జంతువు సింహం, అందుకే మృగరాజు గా పేరుగాంచింది.

World Lion's Day

మదర్స్ డే, ఫాదర్స్ డే లాగా ఈ సింహాల గూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉంది అదే ప్రపంచ సింహాల దినోత్సవం (World Lion’s Day). ఈ సందర్భంగా ప్రజలందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశాడు.

“సింహం ధైర్యానికి నిర్వచనం, సింహాలకు నిలయం గా ఉన్నందుకు భారత్ గర్వపడుతుంది, ప్రపంచ సింహ దినోత్సవం రోజు (World Lion’s Day) సింహాల పరిరక్షణ పై మక్కువ ఉన్న ప్రజలందరినీ అభినందిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా భారత్ లో సింహాల సంఖ్య తగ్గుతుంది అని, ఈ సందర్భంగా మోడీ మరిన్ని విషయాలను ప్రస్తావించారు, తను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిర్ సింహాలకు సురక్షితమైన ఆవాసాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

సింహాల సంఖ్య పెరుగుదల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించమన్నారు, దీనివల్ల పర్యాటకానికి కూడా ప్రోత్సాహం అందుతుందని ప్రధాని మోడీ తెలిపారు.

World Lion's Day

ప్రతి సంవత్సరం ఆగస్టు 10 న వరల్డ్ లయన్స్ డే (World Lion’s Day) ను జరుపుకుంటారు, ఈ రోజున సింహాల పై అవగాహన పెంచడం, వాటి సంఖ్యను లెక్కించడం, వాటి పరిరక్షణకు మద్దతులను సేకరించడం వంటివాటిపై దృష్టిని సారిస్తారు.

ప్రస్తుతం ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రెడ్ లిస్ట్ ద్వారా అవి అంతరించిపోతున్న జాతిగా గుర్తించారు. ఆసియా టెక్ సింహం భారతదేశంలో కనిపించే 5 పెద్ద జంతువులలో ఒకటి, మిగిలిన నాలుగు రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ చిరుత, క్లౌడ్ చిరుత, మంచు చిరుత.

World Lion's Day

గత ఏడాది జూన్ లో గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిన సింహాల లెక్కల ప్రకారం సింహాల సంఖ్య పెరిగింది. 2015 నాటికి భారతదేశంలో 523 ఉన్న సింహాల సంఖ్య 2020 నాటికి 674 కు పెరిగింది, అంటే 29 శాతం సింహాల సంఖ్య పెరిగిందని ప్రకటించింది.

అటవీ జంతువులు అంతరించి పోవడం వల్ల మానవజాతికి పెను ముప్పు వాటిల్లుతుంది, అందుకే వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి. వనాలని పెంచాలి, ప్రకృతిని, అటవీ జంతువులను కాపాడాలి.

ఇది కూడా చదవండి : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ భళా