సినిమా

Allu Arha : తండ్రి బాటలో ఇప్పుడు కూతురు కూడా

allu arha
Allu Arha : శాకుంతలం సెట్స్ లో కూతురు అర్హ ను ఎత్తుకొని దిగిన ఫోటో ని షేర్ చేస్తూ నేను నా కూతురు అర్హ ఒకే లొకేషన్ లో వేరు చిత్రాల షూటింగ్ లో పాల్గొన్నాము అని సోషల్ మీడియా లో షేర్ చేసాడు.

అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ (Allu Arha) శాకుంతలం సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే, అల్లు ఫ్యామిలీ నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదటి అమ్మాయిగా అల్లు అర్హ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకుంది, ఈ సినిమాలో భరతుడి చిన్ననాటి పాత్రలో అల్లు అర్హ కనిపించనుంది.

తాజాగా అల్లు ప్రిన్సెస్ (Allu Arha) కు సంబంధించిన షూటింగ్ ను చిత్ర యూనిట్ పూర్తిచేసింది, దీనితో చిత్ర యూనిట్ అర్హకు గ్రాండ్ గా వీడ్కోలు ఇచ్చింది, అర్హ తో కేక్ కట్ చేయించి గ్రాండ్ గా వేడుకను నిర్వహించింది, ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య  అల్లు స్నేహ కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఆసక్తికర విషయం ఏమిటంటే శకుంతల సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రదేశంలోనే బన్నీ నటిస్తున్న పుష్ప సినిమా కూడా చిత్రీకరణ జరుపుకుంటోంది, ఈ సందర్భంగా శాకుంతలం షూటింగ్ స్పాట్ ను సందర్శించిన బన్నీ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు.

allu arha

శాకుంతలం సెట్స్ లో కూతురు అర్హ ను ఎత్తుకొని దిగిన ఫోటో ని షేర్ చేస్తూ నేను నా కూతురు అర్హ ఒకే లొకేషన్ లో వేరు చిత్రాల షూటింగ్ లో పాల్గొన్నాము, నేను అర్హ (Allu Arha) నటిస్తున్న సినిమా సెట్ ను సందర్శించాను, ఇలాంటి సందర్భం ఇంత తొందరగా వస్తుందని నేను అనుకోలేదు, కానీ చాలా త్వరగా జరిగింది, ‘శాకుంతలం లో భరతుడిని పుష్ప కలుసుకున్నాడు’  ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే యాదృచ్ఛికమైన రోజు అని అని ఒక కాప్షన్ ను జోడించాడు.

ఇది కూడా చదవండి : రోజు ఎనిమిది(8) గంటలు కన్నా ఎక్కువ కూర్చుంటే ముప్పే