Neeraj Chopra : నీరజ్ పేరు ఉన్న వారందరికీ మూడు రోజులలో తిరుపతి, కడప జిల్లాలోని చిల్లీస్ రెస్టారెంట్ చికెన్ బిర్యాని మినీ ప్యాక్ ఉచితం.
ప్రస్తుతం దేశం మొత్తం నీరజ్ చోప్రా (Neeraj Chopra) పేరు మారు మ్రోగుతోంది, మొన్నటి వరకు నీరజ్ చోప్రా గురించి తెలిసిన వారు చాలా తక్కువ, కానీ ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో దాదాపు వందేళ్ల క్రీడా చరిత్ర లో అథ్లెటిక్ విభాగం లో భారత్ కు తొలి స్వర్ణ పతకాన్ని అందించాడు నీరజ్ చోప్రా, దీనితో యావత్ భారతం నీరజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.
ప్రభుత్వాలతో పాటు పలు కంపెనీలు నీరజ్ చోప్రా కు బహుమతులను అందిస్తున్నాయి, అయితే తాజాగా చిల్లీస్ రెస్టారెంట్ యజమాని నీరజ్ పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా వ్యక్తపరిచారు.
నీరజ్ అనే ధీరుడి పేరు ఉన్న వారందరికీ 10 ,11, 12 తేదీలలో తిరుపతి, కడప జిల్లాలోని చిల్లీస్ రెస్టారెంట్ చికెన్ బిర్యాని మినీ ప్యాక్ ను ఉచితంగా అందిస్తోంది, అయితే వచ్చే అభ్యర్థులు తప్పకుండా తమ ఆధార్ జిరాక్స్ ను తీసుకురావాలి అట, ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.