సినిమా

F3 Movie : లీకైన వెంకీ, వరుణ్ క్యారెక్టర్స్

F3 Movie
F3 Movie : వెంకీ ఎఫ్ 3 సినిమా రిలీజ్ కూడా మళ్ళీ సంక్రాంతి బరిలో ఉండబోతుందని వెల్లడించారు.

2019 లో వచ్చిన F2 సినిమా పెద్ద కమర్షియల్ హిట్ గా నిలిచింది, ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి వంద కోట్ల వసూళ్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచి నిర్మాత దిల్ రాజు కి లాభాల పంట పండించింది, దానితో ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ గా F3 Movie రాబోతుందని అందరికీ తెలుసు.

అనిల్ రావిపూడి F3 Movie ను మరోసారి పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందిస్తున్నాడు, ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

F3 Movie

ఇటీవల వచ్చిన నారప్ప సినిమా వెంకటేష్ కు మరొక హిట్టు ను అందించింది, ఈ నేపథ్యం లో వెంకీ ఎఫ్ 3 సినిమా రిలీజ్ కూడా మళ్ళీ సంక్రాంతి బరిలో ఉండబోతుందని వెల్లడించారు, ఈ సినిమా కథ అంతా డబ్బు చుట్టూ తిరుగుతుందని గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది.

మెల్లగా మళ్ళీ నవ్వులు మొదలు అన్ని అనిల్ రావిపూడి ట్విట్టర్ లో ట్యాగ్ చేసి ఫొటోస్ షేర్ చేసారు.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో వెంకీ మరియు వరుణ్ తేజ్ పాత్రలకు సంబంధించిన ఒక వార్త లీక్ అయింది, ఇందులో వెంకటేష్ నటిస్తున్న పాత్రకి రేచీకటి ఉంటుందట, అలాగే వరుణ్ తేజ్ పాత్ర కి నత్తి ఉంటుందట, ఈ రెండు పాత్రల స్వభావాల తో ఆద్యంతం ఆసక్తికరంగా కథ సాగుతుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు దర్శకుడు అనిల్ రావిపూడి కి అసలు ఫ్లాప్ అంటే ఏంటో తెలియదు, మొదటి సినిమా నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు వరకు వరుసగా బ్లాక్ బస్టర్ కొడుతూ వస్తున్నాడు, ఇప్పుడు ఎఫ్ త్రీ తో మరోసారి భారీ బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు అని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇవ్వబోతున్న 3 క్రేజీ అప్ డేట్లు