జాతీయం-అంతర్జాతీయం

OBC Reservation Bill 2021 : ఓబిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ

obc reservation india
OBC Reservation Bill : ఓబిసి (OBC) జాబితాలను ఖచ్చితం చేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

ఓబిసి జాబితాలను ఖచ్చితం చేసే అధికారం రాష్ట్రాలకు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది, ఇక రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ బిల్లు  ఒక చట్టంగా మారుతుంది, ఓబిసి కులాల జాబితా ను రూపొందించుకునే అధికారం ఇప్పుడు రాష్ట్రాల కే దక్కుతుంది.

Coinbazzar

అంతకు ముందు ఓబిసి రిజర్వేషన్ల (OBC Reservation Bill) విషయానికి సంబంధించిన 127 వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది, ఈ బిల్లుకు లోక్ సభ నుంచి ఆమోదం రావడంతో నేడు రాజ్యసభ లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లుపై చర్చ సందర్భంగా నేడు జరగాల్సిన ప్రశ్నోత్తరాలు, భోజనం సమయాన్ని రద్దు చేశారు.

OBC Reservation Bill

బిల్లును ఎవరు వ్యతిరేకించడం లేదని చర్చ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించిన ఇబ్బంది లేదని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు, దీంతో నాలుగు గంటల పాటు ఈ అంశంపై చర్చ చేపట్టనున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తెలిపారు.

కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్ ఓబిసి బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు, బిల్లుపై చర్చ చేపట్టేందుకు ఏకగ్రీవంగా అంగీకరించిన సభ్యులందరికీ అతను ధన్యవాదాలు తెలిపారు.

obc reservation india

ఈ బిల్లు ఒక చారిత్రాత్మక బిల్లు అని అన్నారు, ఈ బిల్లు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి ఒక భరోసాగా నిలుస్తుంది అని అన్నారు, దేశంలోని ఐదవ వంతు ఓబీసీలకు ఈ బిల్లు కారణంగా లాభం చేకూరుతుందని అన్నారు, ఈ బిల్లు తీసుకువచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి : ఆగస్టు 16 నుంచి రైతుల ఖాతాల్లో పడనున్న రుణమాఫీ.