Top 10 Protein Breakfasts : ఈ మిక్స్ ని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ మిక్స్ చేసుకుంటే పది రకాల బ్రేక్ఫాస్ట్ లు నిమిషాల్లో చేసుకోవచ్చు.
మనకు బజార్లో రెడీమేడ్ గా ఇడ్లీ మిక్స్, పకోడా మిక్స్ దొరుకుతాయి, అదేవిధంగా ఈ మిక్స్ ని కూడా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ మిక్స్ చేసుకుంటే పది రకాల బ్రేక్ఫాస్ట్ (Top 10 Protein Breakfasts) లు నిమిషాల్లో చేసుకోవచ్చు, ఈ ప్రోటీన్ మిక్స్ ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు : Top 10 Protein Breakfasts
- బియ్యం: 2 కప్పులు
- పెసరపప్పు : అర కప్పు
- పెసలు: అర కప్పు
- మినప్పప్పు : అర కప్పు
- పచ్చి శెనగపప్పు : అర కప్పు
- ఎండు మిరపకాయలు- 7 నుంచి 8
- జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్
- ఇంగువ – అర టీ స్పూన్
- ఉప్పు- రుచికి తగినంత
బ్రేక్ఫాస్ట్ మిక్స్ తయారీ కోసం:
ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి, అందులో రెండు కప్పుల బియ్యం వేసుకోవాలి, అలాగే అర కప్పు పెసరపప్పు, అర కప్పు పెసలు వేసుకోవాలి, అలాగే అర కప్పు మినప్పప్పు, అలాగే దానితోపాటు అరకప్పు పచ్చి శెనగపప్పు తీసుకోవాలి, వీటన్నిటినీ ఒక శుభ్రమైన గుడ్డతో వాటి పైన ఉన్న దుమ్ము ని తుడిచేసుకోవాలి, ఇప్పుడు ఈ పప్పులను అన్నిటిని ఒక బాండీలో వేసి చిన్న మంట మీద ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు మెల్లగా దోరగా వేయించుకోవాలి.
అలాగే ఇంకొక ప్యాన్ లో 7 నుంచి 8 ఎండు మిరపకాయలను, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసి చిన్న మంట మీద రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి, అవి బాగా వేగాక గ్యాసు ఆపేసి అందులో అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి, ఇప్పుడు వీటిని కూడా చల్లార బెట్టుకోవాలి, అన్ని మొత్తం చల్లారాక పప్పులను కొన్నికొన్ని తీసుకుంటూ, అలాగే ఎండు మిరపకాయలు, జీలకర్ర కొంచెం రుచికి తగినంత ఉప్పు ని వేసుకోవాలి, తర్వాత మంచిగా గ్రైండ్ చేసి మెత్తని పొడిగా చేసుకోవాలి, మనకు ఇప్పుడు ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ తయారయింది, దీనిని గాలి చొరబడని సీసాలో నిల్వ ఉంచుకుంటే ఆరు నెలల వరకు చెడిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు దీనితో రకరకాల (Top 10 Protein Breakfasts) బ్రేక్ ఫాస్ట్ లను ఎలా తయారు చేయాలో చూద్దాం
దోస:
ఒక గిన్నెలో రెండు కప్పుల ప్రోటీన్ మిక్స్ ను వేసి తర్వాత కొన్ని కొన్ని నీటిని పోసుకుంటూ దోశ పిండి లా కలుపుకోవాలి, దీనిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలి, తర్వాత ఈ పిండితో దోసలు వేసుకుంటె క్రిస్పీ దోశలు మీ సొంతం.
ఊతప్పం:
అలాగే ఉతప్పం చేసుకోవడానికి అదే పిండి మిశ్రమంలో లో ఒక ఒక చిన్న సైజు ఉల్లిపాయ ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోవాలి, ఒక చిన్న సైజు క్యారెట్ తురుము వేసుకోవాలి, అన్ని బాగా కలుపుకోవాలి, ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి, తరువాత ఈ పిండి తో పెనం మీద ఉతప్పం లా వేసుకోవచ్చు.
అలాగే ఈ పిండితో గుంతపొంగనాలు, వడలు, బజ్జీలు, పకోడీలు, ఇడ్లీలు, స్టఫ్డ్ బ్రెడ్ పకోడా, చపాతి లు ఇలా పది రకాల బ్రేక్ ఫాస్ట్ లు కూడా చేసుకోవచ్చు.