Google Privacy : ప్రముఖ టెక్ సంస్థ అయిన గూగుల్ 18 ఏళ్ల లోపు యూజర్లకి సరి కొత్త ఫీచర్లను మరియు మార్పులను తీసుకొచ్చింది.
ప్రముఖ టెక్ సంస్థ అయిన గూగుల్ అందించే సెర్చ్, యూట్యూబ్, గూగుల్ ఇమేజెస్ మరియు ఇతర ప్లాట్ ఫారం లలో కొత్త ప్రైవసీ ఫీచర్లు మరియు మార్పులను తీసుకొచ్చింది, ఆ సరికొత్త ఫీచర్లు ఎలా ఉన్నాయి అంటే.
పద్దెనిమిది(18) ఏళ్ళ లోపు వారు లేదా వారి యొక్క తల్లిదండ్రులు గూగుల్ ఇమేజ్ ఫలితాల నుండి తమ ఫోటోలను తీసివేయమని గూగుల్ ను అభ్యర్థించవచ్చు, ఈ ప్రైవసీ (Google Privacy) ఫీచర్ రాబోయే ముందు వారాల్లో ప్రారంభం కానుందని గూగుల్ తెలిపింది.
రాబోయే వారాలు మరియు రాబోయే నెలల్లో యూట్యూబ్, సెర్చ్, అసిస్టెంట్, ప్లే మరియు ఇతర అన్ని ప్లాట్ఫామ్ లలో పద్దెనిమిది(18) సంవత్సరాల లోపు కొత్త ప్రైవసీ (Google Privacy) ఫీచర్ లు మరియు మార్పులను తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించినది.
పదమూడు(13) నుంచి పదిహేడు(17) సంవత్సరాల లోపు ఉన్న టీనేజర్లకు అందుబాటులో ఉండేలాగా అత్యంత ప్రైవేట్ ఆప్షన్ గా యూట్యూబ్ త్వరలో డిఫాల్ట్ అప్లోడ్ సెట్టింగ్స్ ని మారుతుందని గూగుల్ ప్రకటించింది.
ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫారం అనేక డిజిటల్ శ్రేయస్సు ఫీచర్ లను కూడా తీసుకొని రాబోతుంది, అంతేకాకుండా బిజినెస్ కంటెంట్ కోసం కూడా ప్రొటెక్షన్ ను అందిస్తుంది, త్వరలో ఈ ప్లాట్ ఫామ్ విరామం మరియు నిద్రవేళ రిమైండర్ లను ఆన్ చేయండి మరియు పద్దెనిమిది(18) ఏళ్ల లోపు యూజర్స్ కోసం ఆటోప్లే ను ఆపివేస్తుంది.
యూట్యూబ్ కిడ్స్ లో ఆటో ప్లే ఎంపిక మరియు డిఫాల్ట్ గా దాన్ని ఆపి వేయడం అనే కొత్త ఫీచర్ జోడించబడుతోంది.