Freeze Drying Technique : ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ: ఈ పూలు ఎప్పటికీ వాడిపోవు! ఎందుకో తెలుసా ?
అందానికి సంకేతం పువ్వు, కానీ రోజు మారిందంటే ఆ పువ్వు తాజాదనం పోతుంది, వాటి గుబాళింపు గాలిలో కలిసిపోతుంది. అదే పువ్వు జీవితం మొత్తం అలాగే ఉండి, అదే అందం తో ఉంటే ఎంత బాగుంటుందో కదా. సున్నితమైన పువ్వులు వాడిపోకుండా తాజాగా చాలా రోజులు ఉంటాయని చెబుతున్నారు వీటిపై పరిశోధన చేసి పేటెంట్ కూడా సాధించిన డాక్టర్ మహాలక్ష్మి.
హైదరాబాదుకు చెందిన మహాలక్ష్మి వేణుగోపాల్ రెడ్డి రిటైర్డ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారతదేశంలో మొట్టమొదటి సారి ఫ్లోరల్ ప్రిజర్వేషన్ థాట్ ఫ్రీజింగ్ డైయింగ్ టెక్నాలజీ ( Freeze Drying Technique) అనే పేటెంట్ పొందారు, దీని ద్వారా పూలను వాడిపోకుండా వాటి జ్ఞాపకాలను జీవితం మొత్తం ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, అందుకేనేమో తనను ఫ్లవర్ ప్రిజర్వేషన్ సైంటిస్ట్ అంటారు.
చాలామంది బయటకు వెళ్లేటప్పుడు తమకు నచ్చిన పూలను తెచ్చుకొని ఇంటిలో చాలా రోజులు పెట్టుకుంటూ ఉంటారు, అలానే ప్లాస్టిక్ పూలు పేపర్ ఫ్లవర్స్ లేదా ఆర్టిఫిషియల్ పూలు లాంటివి ఇంటిలో పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.
అదే ఒక నిజమైన పువ్వు జీవిత జీవితం మొత్తం అలా ఎండిపోకుండా ఉండాలి అని లేదా ఎవరికైనా బహుమతిగా ఇచ్చినప్పుడు ఎండిపోకుండా ఆ జ్ఞాపకాలను జీవితం మొత్తం అని ఉండాలి అని ఫ్రీజ్ డ్రైయింగ్ టెక్నాలజీ ని కనిపెట్టారు.
చాలామంది యూత్ వారికి ఇష్టమైన వారి కోసం ఇలా ఈ పువ్వులను గిఫ్ట్ గా ఇస్తూ వారి ఫీలింగ్స్ ని జీవితం మొత్తం పంచుకుంటున్నారు. ఫ్లవర్స్ ఒక్కటే కాకుండా, ఎవరైనా బొకే ఇచ్చిన లేదా పెళ్ళిళ్ళకి వాడిన దండలు వాటి మధురమైన జ్ఞాపకాల పూలను ఎప్పటికీ అలానే ఉంచేలా చేస్తున్నారు.