జాతీయం-అంతర్జాతీయం

Padma Awards 2022 : పద్మ అవార్డ్స్ దరఖాస్తుల ఆహ్వానం

Padma Awards
Padma Awards 2022 : పద్మ అవార్డులకు నామినేషన్ల ఆహ్వానం. తుది గడువు సెప్టెంబర్ 15, 2021. ఆన్ లైన్ లో మాత్రమే నామినేషన్ల స్వీకరణ.

భారత ప్రభుత్వం 2022 సంవత్సరానికి గాను (Padma Awards) పద్మ అవార్డులకు గాను నామినేషన్లు మరియు సిఫార్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డుల అందజేసేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

Padma Awards

నామినేషన్లకు స్వీకరించేందుకు తుది గడువు సెప్టెంబర్ 15 గా కేంద్రం తాజాగా ప్రకటించింది. నిర్దేశించిన ఫార్మాట్లలో ఆన్ లైన్ ద్వారా మాత్రమే అర్హత గల వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు హోం మంత్రిత్వ శాఖ వెబ్ సైటు లో పొందుపరిచినట్లు తెలిపింది.

Padma Awards

పద్మ అవార్డులను ప్రజల పద్మ గా మార్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ నేపథ్యంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులు, సమాజానికి కి సేవ చేస్తున్న వారిని గుర్తించి సిఫారసు చేయాలని కేంద్రం కోరింది. వారి ప్రతిభ, విషయాల ఆధారంగా, కళలు, క్రీడలు, సంఘ సేవ, విద్యా, వైద్య, విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పద్మ అవార్డులు అందజేయనున్నామని తెలిపింది.

Padma Awards

ఆసక్తి ఉండి అర్హత గల వారు వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది.

ఇప్పటికే క్షేత్రస్థాయిలో అసాధారణ కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులను పీపుల్స్ పద్మ అవార్డులకు నామినేట్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే జులై 11 న దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే.

ఇది కూడా చదవండి : బయటపడిన లంకె బిందెలు – అమ్మవారి నగలా? గుప్త నిధులా?