Cow Dung Business : ఆవుపేడ ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది, ఆవుపేడనే ఆదాయంగా మార్చుకుంటున్నారు ఛత్తీస్ ఘడ్ లో ఉన్న మహిళలు.
ఇంట్లో పాడి ఉంటే ఇల్లాలికి ఒంటినిండా పని మాత్రమే కాదు, చేతులు నిండా డబ్బు కూడా ఉంటుంది, ఇంట్లో చిల్లర ఖర్చులకోసం పిల్లల అవసరాలకోసం పాడి డబ్బులనే వాడుకుంటారు ఇల్లాల్లు, కానీ పాడితో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మకాలే కాదు డబ్బులు సంపాదించేస్తారు అతివలు.
ముఖ్యంగా ఆవుపేడ ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది, దీంతో మహిళలు ఇంట్లో ఉండే ఆవు పేడను బయటపడకుండా ఆవుపేడనే ఆదాయంగా (Cow Dung Business) మార్చుకుంటున్నారు ఛత్తీస్ ఘడ్ లో ఉన్న మహిళలు.
ఆవు పేడ తో మనకి పిడకలు మాత్రమే చేయవచ్చునని తెలుసు, కానీ సృజనాత్మకతకి పదును పెట్టి రకరకాల ఉత్పత్తులను తయారు చేయవచ్చని వీళ్లను చూస్తే తెలుస్తుంది, వాటిని వారు అమ్ముతూ చక్కగా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు ఛత్తీస్ ఘడ్ లో ఉన్న రాజ్ నంద్ గావ్ జిల్లాలోని కొన్ని గ్రామ మహిళలు.
మావోయిస్టు తుపాకుల మోతతో దద్దరిల్లే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మహిళల సృజనాత్మకత ఎంతోమంది దేశంలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.
రాజ్ నంద్ గావ్ జిల్లాలోని చౌరీయ, అంబాగోర్, తహసిల్, గుమకా, సింఘాల లతో పాటు మరికొన్ని ఎన్నో గ్రామాల్లోని ఆడవారికి ఆవు పేడ నే (Cow Dung Business) ఒక ఆదాయ వనరుగా మారింది.
ఆయా గ్రామంలోని మహిళలు స్వయం సహాయక బృందాలుగా ఏర్పడి ఆవు పేడతో పిడకలు కాకుండా విగ్రహాలు, మొబైల్ ఫోన్ స్టాండ్స్, నర్సరీ పాట్స్ వంటి ఎన్నో ఉత్పత్తులు తయారు చేస్తూ వాటిని మార్కెట్లో అమ్ముతూ చక్కటి ఆదాయం పొందుతున్నారు.
ఒకప్పుడు ఆవుపేడతో తయారుచేసిన ఉత్పత్తుల మార్కెట్ జిల్లా సరిహద్దులకే పరిమితంగా ఉండేది, ఇప్పుడు మాత్రం ఈ కామర్స్ వేదికల పుణ్యమా అని అంతర్జాతీయ స్థాయికి చేరింది ఈ మార్కెట్, ఒకప్పుడు ఆవుపేడతో వ్యాపారమా అని వెక్కిరించిన వారే ఇప్పుడు ఆవుపేడ నే లక్ష్మీదేవి అంటున్నారు.