Mosquito Trapper : చాలా తక్కువ ఖర్చుతో దోమలను చంపే ఒక పరికరాన్ని పదేళ్ల వయసున్న చిన్నారి తయారుచేసింది.
అసలే వర్షాకాలం, ఇంకేంటి బయట ఉన్న దోమలన్ని నీళ్లలో తిష్ట వేసుకుని కూర్చుంటాయి. దీని పరిష్కారం కోసం మనం ఎన్నో రసాయనకర ఉత్పత్తులను వాడాల్సి ఉంటుంది.
ఇది తప్పిస్తూ చాలా తక్కువ ఖర్చుతో ఒక పరికరాన్ని పదేళ్ల వయసున్న ఒక చిన్నారి తయారుచేసింది, ఆ పరికరంతో (Mosquito Trapper) దోమలన్ని పరార్ అంట, మరి దాని గురించి ఏంటో తెలుసుకుందాం.
కేరళలో ఉన్న తిరువనంతపురం లో పదేళ్ల వయసున్న చిన్నారి ఇందిరా అర్జున్ ఐదవ క్లాస్ చదువుతుంది . ఆమె ఉన్న ఊర్లో దోమలు చాలా ఎక్కువ ఉంటాయంట, అయితె ఆ దోమల వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ ఇలా దోమల వల్ల వచ్చే రోగాలు వల్ల ఆమె ఊరి వారు భాదపడడం, దాన్ని చూసి ఆమె బాధ పడింది.
వాన కాలం వస్తే అక్కడే కాకుండా ఎక్కడైనా ఇదే పరిస్థితి వస్తుంది కదా అందుకే ఆ చిన్నారి ఒక చిన్న ఆలోచన ఆలోచించింది, ఆ ఆలోచన పరిష్కారమే ఈ పరికరం. సాధారణంగా దోమతెరలు కొనాలన్నా చాలా ఖర్చవుతుంది.
డబ్బున్న వారు అయితే దోమతెరలు కొనుక్కుంటారు కానీ పేదవారు వాటిని కొనలేరు కదా. అందుకే ఆ చిన్నారి ఇదే ఆలోచించి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పరికరాన్ని (Mosquito Trapper) తయారు చేసింది.
పరికరం తయారీ :
ఈ పరికరం తయారుచెయ్యడం కోసం వాడి పడేసిన ఒక టైరు, పొడవాటి పైపు, గమ్ము, పేపరు మరియు ఈ పరికరాన్ని (Mosquito Trapper) గోడకు తగిలించేందుకు ఒక ఊచను తీసుకుంది.
ఇప్పుడు ఆ చిన్నారి వాడి పడేసిన టైరు ని అర్ధచంద్రాకారంలో కోసింది, ఆ సగం ముక్కను తీసుకొని టైరు మధ్యలోకి పైపును అతికించింది. ఆ పైపు చివరన మూతి బిగించింది. ఇక పైపుతో ఉన్న ఈ పరికరాన్ని గోడకు తగిలించింది.
దాని పనితీరు:
ఇక టైరు లో నీళ్లు పోసి, ఒక పేపర్ ను ఆ నీటి మీద ఉంచింది. ఈ పరికరాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికీ తగలకుండా ఒక ఇంట్లో మూలన ఉంచింది. ఒక మూడు రోజుల పాటు దాన్ని ఎటూ కదలకుండా ఆ పరికరాన్ని అలానే ఉంచింది.
అలా ఉంచడం వలన దోమల అనేవి నీటి చెమ్మ కి వచ్చి ఆ నీటిలో పడిపోయాయి ఇక మూడు రోజుల తర్వాత ఆ నీటిని పైపు ద్వారా వడ పోసింది. తరువాత ఆ చిన్నారి నీళ్ల మీద ఉన్న పేపర్ ను క్లోరిన్ ద్రావణంలో వేసింది. ఎందుకంటే ఇంకా ఏమైనా దోమ యొక్క లార్వాలు, లేదా దోమ గుడ్లు ఉంటే చనిపోతాయి.
కాబట్టి ఇక వడబోసిన నీటిని మళ్లీ ఆ టైర్ లో ఉంచి మళ్లీ దానిమీద ఒక కొత్త పేపర్ ని పెట్టింది అది సరే మళ్లీ అవే నీళ్లు ఎందుకు అంటారా ఇక్కడే ఉంది అసలు రహస్యం దోమలు నీటి విడుదల చేసిన ఫెరోమెన్ అందులోనే ఉంటుంది మరి. దీంతో ఆ వాసనకి దోమలు చాలా ఆకర్షితులవుతాయి. ఇక అప్పట్నుంచే దోమలు ఉచ్చులో పడతాయి అన్నమాట , బావుంది కదా మీరు కూడా ప్రయత్నించి చూడండి.