Rashtragaan : ఆగస్టు 15 న మీ వీడియో టీవీ లో చూడాలనుకుంటున్నారా! ఈ పని చేయండి చాలు!

rashtragaan
Rashtragaan : ఆగస్టు 15 మీ వీడియో టీవీ లో చూడాలనుకుంటున్నారా, మీ వీడియో రికార్డు చేసి ఇక్కడ అప్లోడ్ చేయండి.

భారత్ కి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా, ఆనాటి విజయాలను, భారత అద్భుతమైన చరిత్రను స్మరించుకోవడానికి భారత ప్రభుత్వం “ఆజాది కా అమృత్ మహోత్సవం” పేరుతో అందరితో జాతీయ గీతం పాడించడానికి, అందరిలో దేశ భక్తి పెంపొందించడానికి “రాష్ట్ర గాన్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

రాష్ట్ర గాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అందరిలో దేశ భక్తి పెంపొందించడం, 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని అందరూ గుర్తుపెట్టుకునేలా చేయాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ  సందర్భంగా స్వాత్రంత్ర దినోత్సవ మహోత్సవాని గొప్పగా  చేసే సమయం, దేశం మనందరికీ అప్పగించడం మా అదృష్టం… ప్రజల పండుగగా, భారతదేశ ప్రతి మనస్సు పండుగగా జరుపుకుందాము”  అన్ని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

rashtragaan

రాష్ట్ర గాన్ కార్యక్రమం కోసం “Rashtragaan.in” అనే వెబ్ సైట్ ను ప్రారంభించింది, ఈ వెబ్సైట్ లో సబ్మిట్ చేసిన వీడియోలు స్వాత్రంత్ర  దినోత్సవం రోజున టీవీ లో చూపించబోతుంది.

టీవీ లో తమ వీడియోను చూడాలి అనుకునే వారు ఈ వెబ్సైటు లో లాగిన్ అయి జాతీయ గీతం పాడుతూ తమ వీడియో రికార్డు చేయాల్సి వుంటుంది.

అయితే పంపిన అన్ని వీడియోలను చూపించడం కుదరదు కాబట్టి, పంపిన వీడియోలలో నుంచి 100 వీడియోలను సెలెక్ట్ చేసి వాటిని స్వాత్రంత్ర  దినోత్సవం రోజున టీవీ లో చూపిస్తారు.

కానీ పంపిన ప్రతి ఒక్కరు జాతీయ గీతం పాడినందుకు సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

rashtragaan

స్వాత్రంత్ర  దినోత్సవం రోజున టీవీ లో మీ వీడియో కూడా చూడాలి అనుకుంటే ఈ క్రింది విధంగా చేయండి.

ఈ “Rashtragaan.in”  వెబ్ సైట్ కు లాగాన్ అవండి.

  • STEP 1 లో మీ పేరు ఎంటర్ చేయండి.
  • STEP 2 లో “REC” అనే బటన్ పైన క్లిక్ చేసి జాతీయ గీతం పాడుతూ వీడియో రికార్డు చేయండి.
  • STEP 3 లో రికార్డు చేసిన వీడియో ను అప్లోడ్ చేయండి.
  • STEP 4 లో మీరు జాతీయ గీతం పాడుతూ వీడియో పంపినందుకు సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోండి.
ఇది కూడా చదవండి : మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంతో మీకు తెలుసా?