జాతీయం-అంతర్జాతీయంబిజినెస్

Telangana Income 2021-22 : మన తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎంతో మీకు తెలుసా?

Telangana Income
Telangana Income 2021-22 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-2022) మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్-జూన్ లో రాష్ట్రం యొక్క ఆదాయం గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్ర ఆదాయం (Telangana Income) రూ. 24,629 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి ఏడు సంవత్సరాలు కావస్తోంది. అయితే ఏడు పదుల వయస్సు ఉన్న ఇతర రాష్ట్రాలతో పోటీపడుతూ అభివృద్ధి పరంగా పరుగులు తీస్తోందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021-2022) మొదటి త్రైమాసికం అంటే ఏప్రిల్-జూన్ లో రాష్ట్రం యొక్క ఆదాయం (Telangana Income) గణనీయంగా పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

2020-2021 మొదటి త్రైమాసికం లో వచ్చిన ఆదాయం కంటే 67 శాతం పైగా ఆదాయం అంటే దాదాపు రూ. 24,629 కోట్లు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.

Telangana Income

2021 సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్, మే నెలల్లో ఆశించినంత ఆదాయం అయితే రాలేదు. ముఖ్యంగా మే నెలలో రాబడి గణనీయంగా తగ్గినప్పటికీ త్రైమాసికం చివరినాటికి ఆదాయం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల చివర్లో సెకండ్ వేవ్ వల్ల రూ. 8,054 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

మే నెలలో లాక్ డౌన్ వల్ల రూ. 6,364 కోట్లు మాత్రమే వచ్చింది. జూన్ నెలలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి పునః ప్రారంభం అయ్యాక ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. దీనివల్ల ఈ ఆర్థిక సంవత్సరం లోనే తొలిసారి జూన్లోనే ఆదాయం 10 వేల కోట్ల మార్కును దాటింది.

New Rules

జూన్ నెలలో మొత్తం రూ. 10,222 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ మూడు నెలల్లో మొత్తం కలిపి మన ప్రభుత్వానికి రూ. 24,629 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది మన బడ్జెట్ అంచనాల్లో 13.98 శాతం.

గత సంవత్సరం కంటే మెరుగ్గా ఈ పరిస్థితి ఉన్నట్లుగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. గత సంవత్సరం కరోనా ఆంక్షలు ఎక్కువగా ఉండగా తొలి త్రైమాసికంలో రాష్ట్ర ఖజానాకు రూ. 14,722 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది.

Coinbazzar

ఇది మన బడ్జెట్ అంచనాల్లో 10.28 శాతం. ఈ సారి సెకండ్ వేవ్ ఇబ్బంది ఉన్నా కూడా గత ఏడాది తొలి త్రైమాసికం కంటే అదనంగా రూ. 9,907 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తంగా చూస్తే 67 శాతం పెరుగుదల కనిపించింది.

ఇది కూడా చదవండి : వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఇప్పుడు వాట్సాప్ లో