ICMR News: ఐసీఎంఆర్ కీలక ప్రకటన, కోవాగ్జిన్ మరియు కోవిషీల్ద్ కలయికతో మంచి ఫలితాలు, సీయంసీ కాలేజీ లో మిక్సింగ్ ట్రయల్స్ ఫలితాలు
రెండు వేర్వేరు వ్యాక్సిన్లు కలిపి తీసుకోవడానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) కీలక ప్రకటన విడుదల చేసింది. కోవిషీల్ద్ మరియు కోవాగ్జిన్ మిక్సింగ్ తో మంచి పలితాలు.
కోవాగ్జిన్ మరియు కోవిషీల్ద్ మిక్స్ చేసి వేసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని ఐసీఎంఆర్ (ICMR) తెలిపింది. ఇలా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా మెరుగవుతుందని అంటుంది.
రెండు వాక్సిన్లు కలిపి తీసుకోవడంపై ఎప్పటినుంచో చర్చ నడుస్తున్న మనదేశంలో పలువురు పరిశోధనలు జరుపుతున్నారు. దీనిపై ఐసీఎంఆర్ కూడా గత నెలలో సీయంసీ కాలేజీ లో మిక్సింగ్ ట్రయల్స్ చేసింది. ఇందులో 300 మంది వాలవంటీర్స్ పైన పరిశోధనలు చేసినది.
అయితే రెండు కలిపి తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చినట్లు తమ పరిశోధనలో తేలిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది.
ఇప్పటి వరకు రెండు డోసులను ఒకే రకమైన టీకా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెప్పారు, కానీ ఐసీఎంఆర్ చేసిన ఈ ప్రకటనతో ఒక డోసు కోవాగ్జిన్ మరొక డోసు కోవిషీల్ద్ తీసుకునే అవకాశం ఉంటుంది.