జాతీయం-అంతర్జాతీయం

Amazon USA : ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనున్న అమెజాన్

Amazon USA Alexa
Amazon USA : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా ఎక్కువ మొత్తంలో గిఫ్టు లను అందిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

అమెజాన్ (Amazon USA) తన ఉద్యోగులకు భారీ ఆఫర్ ను ప్రకటించింది, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా ఎక్కువ మొత్తంలో గిఫ్టు లను అందిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.

రెండు నెలల క్రితం వ్యాక్సిన్ చేయించుకున్న వారికి మాస్కు అవసరం లేదని అమెరికా ప్రభుత్వం తెలిపింది, దీన్ని ఆసరాగా తీసుకొని ప్రజలు మాస్కులు లేకుండా కోవిడ్-19 నిబంధనని ఉల్లంఘించడంతో మరోసారి కరోనా విజృంభించింది.

అయితే ఇప్పటికే అమెరికా మాస్క్ ఫ్రీ కంట్రీ అని ప్రకటన చేసుకుంది, దానివల్ల అమెరికాకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. రోజుకి కనీసం లక్ష కి పైగా కరోనా కేసులు నమోదు కావడంతో వందల సంఖ్యలో డెల్టా వేరియంట్ రోగులు ఆస్పత్రి పాలవుతున్నారు.

Amazon USA

అదేవిధంగా మాస్క్ ఫ్రీ అని ప్రకటించిన అమెజాన్ (Amazon USA) కూడా దిద్దుబాటు చర్యలు తీసుకుంది, అమెజాన్ హెడ్క్వార్టర్స్ కు చెందిన లాజిస్టిక్స్ సెంటర్ లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఉద్యోగులు వ్యాక్సినేషన్ చేయించుకోలేదు, పైగా దానికి తోడు మాస్క్ లేకుండా తిరగడం వల్ల వారి సహోద్యోగులు కరోనా బారిన పడ్డారు.

దీనితో అప్రమత్తమైన అమెజాన్ (Amazon USA) కంపెనీ వ్యాక్సిన్ ఆఫర్ ను ప్రకటించినట్లు తెలుస్తోంది. మ్యాక్స్ యువర్ వ్యాక్స్ లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు బహుమతులను అమెజాన్ కంపెనీ ప్రకటించింది.

Amazon USA

ఇందుకోసం 14.9 కోట్లరూపాయలను కేటాయించిందని బ్లూమ్ బర్గ్ వెల్లడించింది, వ్యాక్సిన్ తీసుకున్న ఫ్రంట్ లైన్ ఉద్యోగులకు లాటరీ టికెట్లను అందజేస్తూ డ్రాలో విజేతలుగా నిలిచిన మొదటి ఇద్దరికీ 3.7 కోట్ల రూపాయల అమెజాన్ సంస్థ అందించిందని తెలిపింది.

ఆ తర్వాత అరుగురికి డెబ్బై నాలుగు లక్షలు, మరో ఐదుగురికి కార్లను వెకేషన్ ప్యాకేజీలను అందించిన అందించనుంది అని పేర్కొంది.

Corona Test

ఫ్రంట్ లైన్ ఉద్యోగులు అంటే అమెజాన్ కంపెనీ లో నే కాకుండా ఆ సంస్థకు అనుసంధానంగా ఉన్న ఆర్డర్లు నిల్వచేసే గోడౌన్స్, హోల్సేల్ మార్కెట్లో, గ్రోసరి స్టోర్లలో లో పనిచేసే ఉద్యోగులతోపాటు పార్ట్ టైమ్ ఉద్యోగులకు కుద ఈ ఆఫర్ వర్తిస్తుందని బ్లూమ్ బర్గ్ తెలిపింది.

ఇది కూడా చదవండి : లక్షలు లక్షలు లాభాలు తెచ్చిపెడుతున్న ఐపిఓ ఇన్వెస్ట్‌మెంట్!