IPL Rules 2021 : క్రీడాకారుడు బంతిని స్టాండ్ లోకి సిక్స్ గా బాదితే ఆ బంతిని తిరిగి ఉపయోగించకూడదనే ఒక రూల్ తీసుకు వచ్చింది.
ఐపీఎల్ తొలి ఫేస్ సందర్భంగా ఎదురైనా సమస్యలతో మిగిలిన మ్యాచ్లను అయినా సురక్షితమైన వాతావరణంలో నిర్వహించడానికి బీసీసీఐ(BCCI) తనవంతు ప్రయత్నం చేస్తుంది.
ఆటగాళ్ల సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని రెండవ దశ ఐపీఎల్ కోసం BCCI ఓ కొత్త రూల్ తీసుకు వచ్చింది, ఎవరైనా క్రీడాకారుడు బంతిని స్టాండ్ లోకి సిక్స్ గా బాదితే ఆ బంతిని తిరిగి ఉపయోగించకూడదనే ఒక రూల్ తీసుకు వచ్చింది.
ఐపీఎల్ (IPL Rules) 2021 ఫేజ్-2 సంబంధించి 41 పేజీలతో కూడిన బయో బబుల్ ప్రోటోకాల్స్ ను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.
కాని కథనం ప్రకారం ఎవరైనా ఆటగాడు బంతిని స్టాండ్ లో కి సిక్స్ గా బాదితే ఆ బంతిని తిరిగి ఉపయోగించరు, ఆ బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకువస్తారు.
మైదానం అవతల పడే బాల్స్ ను ఇతరులు పట్టుకునే అవకాశం ఉన్నందున తిరిగి అదే బాల్ ని వాడితే కరోనా సోకే ప్రమాదం ఉంది, అందుకని స్టాండ్ కి వెళ్లే బంతిని పూర్తిగా శుభ్ర పరిచిన తర్వాత బాల్ లైబ్రరీలో దాచానున్నారు.
ఈసారి ప్రేక్షకులకు అనుమతిస్తునందున ఈ కొత్త నిబంధనను తీసుకొస్తున్నట్లు BCCI స్పష్టం చేసింది, అయితే స్టాండ్స్ లో పడిన బంతి స్థానంలో కొత్త బంతిని తీసుకు వస్తే మాత్రం బ్యాట్స్మెన్స్ కు అడ్వాంటేజ్ గా మారనున్నది.
ఎందుకంటే కొత్త బాల్ గట్టిగా ఉంటూ సులువుగా బ్యాట్ పైకి వస్తుంది, పైగా UAE పిచ్ లో స్పిన్నర్లకు సహకరిస్తాయి, కానీ ఈ నిబంధన కారణంగా గా వారు కొత్త బంతి వచ్చిన ప్రతిసారి దానికి అనుగుణంగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది, బాల్ పై పట్టు చిక్కకుండా పోతుంది.
అయితే ఏది ఏమైనా ఈ నిబంధన (IPL Rules) మాత్రం బౌలర్లకు పెద్ద శిక్ష అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు , ఇప్పటికే బ్యాట్స్మెన్ కి ఫేవర్ గా మారిన టీ20 లో ఇదే తరహాలో కొత్త నిబంధనలతో బౌలర్లు మరింత బలహీన అవుతారని అభిప్రాయపడుతున్నారు.
కాగా శ్రీలంక పర్యటనలో ఎదురయిన చేదు పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బిసిసిఐ ఈ కొత్త బయో బబుల్ ప్రోటోకాల్స్ ను రూపొందినచినట్లు తెలుస్తుంది.