OTT Movies : తాజాగా విడుదల అయినవి, ఇండియా లో స్ట్రీమింగ్ లోకి వచ్చినవి, ఇంకా తెలుగు లోకి అనువదించిన వాటిలో కొన్ని మంచి సినిమా లు ఇక్కడ మీ కోసం.
1. Mimi (హిందీ) (OTT Movies)
వన్ నేనొక్కడి తో తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితమైన క్రితి సనన్ తన 6 ఏళ్ల ఫిల్మ్ కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మన్స్ ఈ సినిమా లో చూడవచ్చు. హిరోయిన్ అవ్వాలనే తన కోరిక, డబ్బు కోసం సరోగసికి ఒప్పుకోవడం, ఇంకా ఇతర సన్నివేశాలలో క్రితి సనన్ తన నటనతో ఇరగతీసినది.
ఈ సినిమా 2011 లో వచ్చిన ఒక మరాఠీ సినిమాకి ఇది రీమేక్. సరోగసికి ఒప్పుకున్న మీమీ జీవితం ఎన్ని ఓడిదుడుగులకు గురి అవుతుందో అనే దాని చుట్టూ ఈ సినిమా కథ అంత తిరుగుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది.
2. Thittam Irandu (తమిళ్) (OTT Movies)
షాకింగ్ క్లైమాక్స్ మరియు థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ సోనీ లీవ్ లో అందుబాటులో ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ వేరే బదిలీ అవుతుంది. ఆ క్రమం లో తన చిన్ననాటి స్నేహితురాలు తప్పిపోతుంది. పోలీస్ ఆఫీసర్ తన స్నేహితురాలి భర్త ని కలిసి వివరాలు సేకరించి విచారణ ప్రారంభిస్తుంది. ఇంతకీ తన స్నేహితురాలు ఏమైందో అంటే ఈ సినిమా చూడాల్సిందే.
3. Raya and the Last Dragon (తెలుగు అనువాదం) (OTT Movies)
బిగ్ హీరో 6 లాంటి అనిమేషన్ చిత్రాన్ని నిర్మించిన డాన్ హాల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డిస్ని స్టూడియో లో నుంచి వచ్చిన ఈ సినిమా ఎంతో అందమైన అనిమేటెడ్ సినిమా తెలుగు లోకి అనువదించడం జరిగింది.
ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్న డ్రాగన్స్ క్రియేట్ చేసిన ఒక శక్తివంతమైన రత్నం, మనుషుల స్వార్థం వల్ల అది ముక్కలు అవుతుంది. దీని వల్ల డార్క్ మాన్స్టర్ అయిన డ్రన్ ప్రతి ఒక్కళ్లను రాళ్ళలాగా మార్చేస్తుంది.
ఇప్పుడు తన ప్రజలని కాపాడాలని ఒక రాజ్యానికి యువరాణి అయిన రాయ చేసే అద్బుతమైన కథ చుట్టూ జరిగేదే ఈ సినిమా. ఈ సినిమా డిస్నీ + హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది.
4. The Courier 2020 (ఇంగ్షీషు) (OTT Movies)
యూయస్ఏ కి రష్యా కి మధ్య జరిగిన కోల్డ్ వార్ మన అందరికీ తెలిసిందే అది 1947 నుంచి 1991 అన్నీ రంగాల్లో మరియు వేరే దేశాలకు మద్దతు ఇవ్వడం లో తెగ పోటీ పడ్డాయి. అలాంటి కొన్ని సందర్బాల నుంచి 1962 క్యూబన్ మిసైల్ క్రైసిస్ సమయంలో ఒక స్పై ఏజెంట్ మీద బేస్ చేసుకొని తీసిన రియల్ స్టోరీ ఇది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో ఉంది.
5. Vaazhl (తెలుగు అనువాదం) (OTT Movies)
Vaazhl అనగా జీవించు అని అర్థం. ఈ సినిమా ని తమిళ్ హీరో శివ కార్తికేయన్ ప్రొడ్యూస్ చేయగ, సోనీ లివ్ వాళ్ళు నేరుగా ఓ ఓ టీ లో విడుదల చేశారు.
అలాగే తెలుగు అనువాదం కూడా ఉంది. మనం సాధారణంగా చూసే ట్రావెల్లింగ్ సినిమా లు కాకుండా ట్రావెల్లింగ్ లో ఒక అనుభూతిని, ప్రాముఖ్యతను చూపిస్తుంది ఈ సినిమా.
ఒకే చోట ఒకే లాగా ఉంటే జీవితం అంటే ఏమిటో తెలియపోతుండవచ్చు. అలాంటి సమయంలో మనమేంటో తెలియడానికి ట్రావెల్లింగ్ చేస్తే సహాయపడుతుందని చెప్పటమే ఈ సినిమా ప్రత్యేకత.